Search
  • Follow NativePlanet
Share
» »జోగులాంబ శ‌క్తిపీఠం సంద‌ర్శ‌న‌కు హైద‌రాబాద్ నుంచి స్పెష‌ల్ టూర్ ప్యాకేజీ..!

జోగులాంబ శ‌క్తిపీఠం సంద‌ర్శ‌న‌కు హైద‌రాబాద్ నుంచి స్పెష‌ల్ టూర్ ప్యాకేజీ..!

న‌గ‌ర జీవితంతో స‌త‌మ‌త‌మ‌య్యేవారికి మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను చేరువ చేసే ఈ ఆధ్యాత్యిక కేంద్రాల‌ టూర్ ప‌ర్యాట‌కుల‌కు ఎంతో ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది. దక్షిణ తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఆలయాలను ద‌ర్శించుకునేందుకు ప‌ర్యాట‌కులకు తెలంగాణ టూరిజం ఓ స‌రికోత్త ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీ కేవ‌లం వీకెండ్‌లో మాత్ర‌మే ఆప‌రేట్ చేస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ హైదరాబాద్ నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ఇందులో భాగంగా అలంపూర్ లోని జోగులాంబ అమ్మవారి ఆలయంతో పాటు బీచ్ పల్లిలోని ఆంజనేయస్వామి ఆలయానికి దర్శించుకోవ‌చ్చు. ఈ టూర్ ప్యాకేజీ కేవ‌లం శని, ఆదివారం తేదీల్లో మాత్ర‌మే అందుబాటులో ఉంటుంది.

పేరుగాంచిన తొమ్మిది ఆల‌యాలు..

ద‌క్షిణ తెలంగాణ ప్ర‌సిద్ధిగాంచిన ఆల‌యాలలో అలంపూర్‌లోని జోగులాంబ ఆల‌యం, బీచ్‌ప‌ల్లిలోని ఆంజ‌నేయ‌స్వామి ఆల‌యం ఎంతో పేరుగాంచాయి. ఈ ప్రాంతాన్ని అనేక దక్షిణ భారత రాజవంశాలు పాలించిన‌ట్లు చ‌రిత్ర చెబుతోంది. జోగులాం ఆలయంలోని ప్రధాన దేవతలు జోగులంబ, బాలబ్రహ్మేశ్వ‌రులు. దేశంలోని 18 శక్తి పీఠాలలో జోగులంబ దేవిని 5 వ శక్తి పీఠంగా పరిగణిస్తారు. ఇక్కడ జోగులంబ దేవత శవాలపై తేలు, కప్ప, తలపై బల్లితో కూర్చున్న ఆకారంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నిమిస్తుంది.

jogulambashaktipeetham

ఇక్కడ తొమ్మిది దేవాలయాలు ఉన్నాయి. అవి స్వర్గ బ్రహ్మ ఆలయం పద్మ బ్రహ్మ ఆలయం, విశ్వ బ్రహ్మ ఆలయం ఆర్కా బ్రహ్మ ఆలయం, బాల బ్రహ్మ ఆలయం, గరుడ బ్రహ్మ ఆలయం, తారక బ్రహ్మ ఆలయం. ఇక‌, అంజనేయ స్వామి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో బీచుపల్లి ఒకటి. ఇది తెలంగాణలోని జోగులంబా గద్వాల్ జిల్లాలో వెల‌సింది. ఈ ఆల‌యం జురాలా ప్రాజెక్ట్ తరువాత కృష్ణ నది ఒడ్డున 30 కిలోమీటర్ల దిగువన ఉంటుంది. ఈ ఆలయంతో పాటు ఇక్క‌డ కోదండరామస్వామి ఆలయం కూడా ఉంది. ఈ టూర్లో భాగంగా ఈ ప్రాంతాల‌న్నింటిని సంద‌ర్శించేయొచ్చు..

అలంపూర్, బీచ్ పల్లి టూర్ షెడ్యూల్ వివ‌రాలివే..

తెలంగాణ టూరిజం HYDERABAD-BEECHPALLI-ALAMPUR TEMPLES & BACK పేరుతో ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీ ప్రతి శనివారం, ఆదివారం తేదీల్లో మాత్ర‌మే ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ నుంచి నాన్ ఏసీ బస్సులో జర్నీ చేయాల్సి ఉంటుంది. వీటి టిక్కెట్ ధ‌ర‌లు చూస్తే పెద్ద‌ల‌క‌యితే రూ.1500 చెల్లించాలి. అదే పిల్ల‌ల‌క‌యితే రూ. 1200గా నిర్ణయించారు. ఈ టూర్ ప్యాకేజీ కేవ‌లం ఒక్క‌రోజు మాత్ర‌మే. ఒక్క‌రోజు ట్రిప్‌లోని మీరు ఇక్క‌డి ఆల‌యాల‌ను సంద‌ర్శించేయొచ్చు. ఈ టూర్ లో భాగంగా మొదటిరోజు ఉద‌యం 8 గంటలకు సికింద్రాబాద్ లోని యాత్రి నివాస్ నుంచి బస్సు బయల్దేరుతుంది. ఉదయం 11. 30 గంటలకు బీచ్ పల్లికి చేరుకుంటారు. అక్క‌డ కృష్ణా నది పక్కన వెల‌సిన ఈ ఆలయాన్ని సంద‌ర్శిస్తారు. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు.

jogulambashaktipeetham

ఈ గ్రామంలో ప్రతి 12 సంవత్సరాలకు జరిగే కృష్ణానది పుష్కరాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఇక‌, అదేరోజు మధ్యాహ్నం 1 గంటకు శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ అమ్మవారిని ద‌ర్శ‌నం ఉంటుంది. ఇక్క‌డికి స‌మీపంలోని ఆల‌యాల‌ను కూడా ద‌ర్శించుకోవ‌చ్చు. మధ్యాహ్నం హారిత హోటల్‌లో భోజ‌నం ముగిస్తారు. అనంత‌రం స‌మీపంలోని ప్ర‌దేశాల‌ను వీక్షిస్తారు. అదే రోజు సాయంత్రం 04.30 గంట‌ల‌కు అలంపూర్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. రాత్రి ఎనిమిది గంట‌ల‌కు హైద‌రాబాద్ చేరుకోవ‌డంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తోంది. ప‌ర్యాట‌కులు మ‌రింత‌ స‌మాచారం కోసం అధికారిక https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ ను సంప్ర‌దించ‌గ‌ల‌రు.

More News

    Read more about: gadwal telangana
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+