హనుమంతుని భక్తులకు ఏపీఎస్ఆర్‌టిసి ఓ శుభవార్తను మోసుకొచ్చింది. రాష్ట్రంలోని ప్రసిద్ధిచెందిన హనుమంతుని ఆలయాలను సందర్శించాలనుకునేవారికోసం పుణ్యక్షేత్రం హనుమాన్ దర్శన్ యాత్రకు ప్రత్యేక టూర్‌ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) రాష్ట్రంలోని హిందూపురం నుంచి కసాపురం, మురిడి, నేమకల్లులో శ్రీ ఆంజనేయస్వామివారి దర్శనం అవకాశం కల్పిస్తుంది. ఏపీ ప్రజలకు ఆర్‌టిసి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్ సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సర్వీస్‌ను ప్రయాణికులకు వినియోగించుకోగలరని కోరింది.
రామేశ్వరం యాత్ర..
ఏపీఎస్ఆర్‌టిసి ప్రతిరోజు ప్రయాణికుల సౌకర్యాలకు అనుగుణంగానే కొత్త సర్వీసులను, ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ టూర్ ప్యాకేజీల్లో ఎక్కువగా ప్రయాణికుల డిమాండ్‌ను బట్టీ, ప్రయాణీకులు, యాత్రీకులు అత్యధికంగా వెళ్లే మార్గాలకు సరసమైన ధరలకే, సురక్షితమైన ప్రయాణాన్ని ఆర్టీసీ అందిస్తుంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగానే రామేశ్వరం యాత్రకి ఈ స్పెషల్ బస్సు సర్వీస్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఆర్టీసీ అందిస్తోన్న ఈ స్పెషల్ సూపర్ లగ్జరీ బస్సు సర్వీస్ (పుష్‌బ్యాక్ 2+2) సీట్లతో ఉంటుంది. ఈ టూర్ హిందూపురం నుంచి కసాపురం, మురిడి, నేమకల్లులోని శ్రీ ఆంజేయస్వామి వారి దర్శన యాత్ర వరకు ఉంటుంది. ఇక, ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా మొత్తం మూడు ప్రదేశాలను చూసే అవకాశం కల్పిస్తారు. ఒక్కరోజుల్లోనే మూడు ప్రాంతాల్లోని మూడు దేవస్థానాల్లో శ్రీ ఆంజనేయస్వామి వారి దర్శనం చేసుకునే వీలుంటుంది. ఇక, ఈ టూర్ ప్యాకేజీ శ్రావణ మాసంలో అంటే ఆగస్టు 10, 13, 17, 20, 24, 27, 31 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.

మూడు ప్రాంతాలు..
ఈ స్పెషల్ టూర్ బస్ హిందూపురం బస్ కాంప్లెక్స్ నుంచి ప్రారంభమవుతుంది. ఇది కసాపురం చేరుకుంటుంది. కసాపురం చేరుకున్నాక, అక్కడ నూతనంగా నిర్మించిన శ్రీ ఆంజనేయస్వామి వారి దర్శనం చేసుకుని ఆ తర్వాత అక్కడ నుండి బయలుదేరి మురిడి కి వెళ్తారు. ఇక, అక్కడ మరో రూపంలోని ఉన్న శ్రీ ఆంజనేయస్వామివారి దర్శనం భాగ్యం పొందుతారు. అక్కడ నుండి బయలుదేరి నేమకల్లు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఇంకో రూపంలో ప్రతిష్ఠించిన హనుమంతుని విగ్రహాన్ని వారిని దర్శించుకుంటారు. ఇక అక్కడ నుండి తిరుగు ప్రయాణంలో హిందూపురం చేరుకుంటారు.
టిక్కెట్ ధరలివే..
ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీలో మీరు కూడా భాగస్వాములవ్వాలనుకునేవారు ముందుగా టిక్కెట్లు బుక్ చేయాల్సి ఉంటుంది. టిక్కెట్టు ధర రెండు వైపుల కలిపి ఒక్కరికి (పెద్దలకు) రూ.710 గా నిర్ణయించారు. అదే పిల్లలకయితే రూ.380గా ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయించింది. టిక్కెట్టు కావాలనుకునేవారు లేదా ఇతర పూర్తి సమాచారం కోసం 8977225997, 9440834715 (ఎవీవీ ప్రసాద్), 7382863007, 7382861308లను ఈ ఫోన్ నంబర్లు సంప్రదించాలి. అప్పుడే టిక్కెట్టు బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే ఆన్‌లైన్ రిజర్వేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. అలాగే అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని గమనం ఉంచుకోవాలని డిపో మేనేజర్ శ్రీకాంత్ వివరించారు.



Click it and Unblock the Notifications













