Search
  • Follow NativePlanet
Share
» »కర్నాటకలో కూడా వైష్ణోదేవి దేవాలయం ఉంది? మీరు చూశారా?

కర్నాటకలో కూడా వైష్ణోదేవి దేవాలయం ఉంది? మీరు చూశారా?

గుల్బర్గాలో నూతనంగా నిర్మించిన వైష్ణోదేవి దేవాలయానికి సంబంధించిన కథనం.

వైష్ణోదేవి దేవాలయం ఎక్కడ ఉంది అంటే ధార్మిక విషయాల పై అవగాహన ఉన్న వారెవరైనా సరే జమ్ములో అని ఠక్కున చెప్పేస్తారు. ఆ దేవతను దర్శించుకోవడానకి వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని కూడా లెక్కచేయరు. అయితే చాలా మంది అక్కడికి వెళ్లడానికి వీలుకాదు. ఇందుకు అక్కడి వాతావరణ పరిస్థితులే కారణం. అటువంటి వారి కోసం కర్నాటకలోని గుల్బర్గాలో ఒక నూతన దేవాలయాన్ని నిర్మించారు. ఇందుకు సంబంధించిన వివరాలు మీ కోసం....

వైష్ణోదేవి దేవాలయం

వైష్ణోదేవి దేవాలయం

P.C: You Tube

గుల్బర్గా దీనిని ప్రస్తుతం కలబుర్గీ అని అంటున్నారు. ఈ కలబుర్గి శివారులోని సయ్యద్ చించోళి దగ్గర ఉన్న రింగ్ రోడ్డులో వైష్ణోదేవి దేవాలయం ఉంది. ఇక్కడి అమ్మవారి విగ్రహంతో పాటు చుట్టు పక్కల ఉన్న పరిసరాలు అచ్చు జమ్ముకాశ్మీర్ లోని వైష్ణోదేవి ఆలయాన్ని పోలి ఉంటాయి.

వైష్ణోదేవి దేవాలయం

వైష్ణోదేవి దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అదేవిధంగా విభిన్న రీతిలో ఈ దేవాలయం నిర్మాణం కొనసాగింది. గబరాది రిలీజియస్ ట్రస్ట్ ఈ దేవాలయం నిర్మించింది.

వైష్ణోదేవి దేవాలయం

వైష్ణోదేవి దేవాలయం

P.C: You Tube

జమ్ము కాశ్మీర్ లో ఉన్న వైష్ణోదేవి దేవాలయం సహజ సిద్ధంగా ఏర్పడిన ఒక గుహాలయం. చుట్టు మంచు పర్వతాల మధ్య ఓ గుహలో వైష్ణోదేవి విగ్రహం ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న దేవాలయం మానవ నిర్మితం.

వైష్ణోదేవి దేవాలయం

వైష్ణోదేవి దేవాలయం

P.C: You Tube

గుల్బర్గాలోని వైష్ణోదేవి దేవాలయం ఎత్తు 108 అడుగులు. అంతేకాకుండా జమ్ముకాశ్మీర్ లో వైష్ణోదేవి గుహలోకి ఎలా వెలుతామో ఈ దేవాలయం లోకి వెలుతున్నప్పుడు కూడా అటువంటి అనుభూతే కలుగుతుంది.

వైష్ణోదేవి దేవాలయం

వైష్ణోదేవి దేవాలయం

P.C: You Tube

జమ్ముకాశ్మీర్ కు వెళ్లి అక్కడి వైష్ణోదేవిని చూడటానికి వీలుకాని వారు ఎక్కువగా ఈ దేవాలయానికి వస్తుంటారు. ఇక్కడి వైష్ణోదేవిని సందర్శించి జమ్ములోని వైష్ణోదేవిని సందర్శించినట్లు భావిస్తుంటారు. సుమారు ఒక ఎకరా విస్తీర్ణంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు.

వైష్ణోదేవి దేవాలయం

వైష్ణోదేవి దేవాలయం

P.C: You Tube

సుమారు నాలుగేళ్లపాటు ఈ దేవాలయ నిర్మాణం కొనసాగింది. బీహార్, ఉత్తర ప్రదేశ్, గుజారాత్, మహారాష్ట్ర నుంచి ప్రత్యేక నిపుణులను పిలిపించి ఈ దేవాలయాన్ని నిర్మింపజేశారు.

వైష్ణోదేవి దేవాలయం

వైష్ణోదేవి దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయ నిర్మాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అమర్నాథ్ గుహాలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

వైష్ణోదేవి దేవాలయం

వైష్ణోదేవి దేవాలయం

P.C: You Tube

గుల్బర్గాలో నూతనంగా నిర్మించిన ఈ దేవాలయంలో కేవలం వైష్నోదేవి విగ్రహమే కాకుండా గణపతి, బాలాజీ, ఆంజనేయ, కాలభైరవ మహాకాళి విగ్రహాలు కూడా ఉన్నాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+