Search
  • Follow NativePlanet
Share
» »ఈ తిరుపతిలో స్వామివారికి పాదరక్షలు దళిత పూజారులు సమర్పిస్తారు, అమావాస్య రోజు దర్శిస్తారు

ఈ తిరుపతిలో స్వామివారికి పాదరక్షలు దళిత పూజారులు సమర్పిస్తారు, అమావాస్య రోజు దర్శిస్తారు

కురుమూర్తి వేంకటేశ్వర స్వామికి సంబంధించిన కథనం.

తెలంగాణలో అనేక ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. అటువంటి ప్రాచీన ఆలయాల్లో మహబూబ్ నగర్ వద్ద ఉన్న ఓ దేవాలయాన్ని తెలంగాణ రెండో తిరుపతి అని పిలుస్తారు. ఇక్కడ సామాజికంగా వెనుకబడిన దళితులే పూజారులు. వారే ఇక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక స్వామివారికి పాదరక్షలు సమర్పిస్తారు. ఈ ఆచారం దాదాపు 650 ఏళ్లుగా కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకులైన మీ కోసం...

కురుమూర్తి వేంకటేశ్వర స్వామి

కురుమూర్తి వేంకటేశ్వర స్వామి

P.C: You Tube

కురుమూర్తి వేంకటేశ్వర స్వామి దేవాలయం గద్వాల్ కు 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. కురుమూర్తి కొండల పై అమ్మాపూర్ గ్రామంలోని కురుమూర్తి కొండల పై కురుమూర్తి వేంకటేశ్వర స్వామి వెలిశాడు.

కురుమూర్తి వేంకటేశ్వర స్వామి

కురుమూర్తి వేంకటేశ్వర స్వామి

P.C: You Tube

ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1350 ఏడాదిలో అంటే దాదాపు 630 ఏళ్ల క్రితం దీనిని నిర్మించినట్లు చెబుతారు. మహబూబ్ నగర్ నుంచి కురుమూర్తి దేవాలయం కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.

కురుమూర్తి వేంకటేశ్వర స్వామి

కురుమూర్తి వేంకటేశ్వర స్వామి

P.C: You Tube

మహబూబ్ నగర్ నుంచి దేవరకద్ర, కౌకుంట్ల మీదుగా బస్సులో కురుమూర్తి చేరుకోవచ్చు. కురుమూర్తి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలోనే రైల్వేష్టేషన్ ఉంది.

కురుమూర్తి వేంకటేశ్వర స్వామి

కురుమూర్తి వేంకటేశ్వర స్వామి

P.C: You Tube

ఈ క్షేత్రానికి సంబంధించిన ఒక కథనం ప్రచారంలో ఉంది. శ్రీనివాసుడు తన వివాహం కోసం కుబేరుడి వద్ద అప్పు చేస్తాడు. ఆ అప్పు తీర్చలేక శ్రీనివాసుడు తీవ్రంగా మనస్తాపం చెంది తిరుపతి వదిలి వెళ్లిపోతాడు.

కురుమూర్తి వేంకటేశ్వర స్వామి

కురుమూర్తి వేంకటేశ్వర స్వామి

P.C: You Tube

అలా నడుస్తున్న శ్రీనివాసుడు కృష్ణమ్మ తీరం వెంబడి నడుస్తూ కురుమూర్తి ప్రాంతానికి చేరుకొంటాడు. అక్కడ నది ఒడ్డున కుర్చొని ఉండగా కృష్ణమ్మ ఆయన ఎదుట ప్రత్యక్షమవుతుంది.

కురుమూర్తి వేంకటేశ్వర స్వామి

కురుమూర్తి వేంకటేశ్వర స్వామి

P.C: You Tube

నడిచినడిచి అలిసిపోయిన వేంకటేశ్వరుడిని చూసి చాలా బాధ పడుతుంది. అంతేకాకుండా పాదల వంక చూసి కన్నీళ్లు కారుస్తుంది. ఇక పై కాళ్లు కందిపోకుండా పాదరక్షలను అందజేస్తుంది.

కురుమూర్తి వేంకటేశ్వర స్వామి

కురుమూర్తి వేంకటేశ్వర స్వామి

P.C: You Tube

ఆ దేవత చేసిన మేలుకు గుర్తుగా వేంకటేశ్వరుడు ఇక్క ప్రతి ఏడాది పాదుకలోత్సాహం జరిపిస్తానని చెబుతాడు. అప్పటి మాట ఇప్పటికీ కొనసాగుతూ ఉంది.

కురుమూర్తి వేంకటేశ్వర స్వామి

కురుమూర్తి వేంకటేశ్వర స్వామి

P.C: You Tube

అమ్మపూర్ సంస్థానాధీశుల ఇలవేల్పు అయిన కురుమూర్తి వేంకటేశ్వరుడికి ముక్కెర వంశస్తులైన రాజా సోంభూపాల్ 15వ శతాబ్దంలో బంగారు ఆభరణాలను సమర్పించారు.

కురుమూర్తి వేంకటేశ్వర స్వామి

కురుమూర్తి వేంకటేశ్వర స్వామి

P.C: You Tube

శంఖచక్రాలు, కిరీటం, మకర కుందనాలు, భుజకిరీటాలతో సహా వివిధ ఆభరణాలు ఈ స్వామి వారికి బహూకరించారు. నాటి నుంచి నేటి వరకూ ఆ ఆభరణాలను స్వామివారికి ఉత్సవాల సందర్భంగా అలంకరించడం అనవాయితీగా వస్తోంది.

కురుమూర్తి వేంకటేశ్వర స్వామి

కురుమూర్తి వేంకటేశ్వర స్వామి

P.C: You Tube

దీనిని రెండో తిరుపతి అనిచెప్పడానికి ఎన్నో కారణాలు చూపుతారు. కురుమూర్తి వేంకటేశ్వరుడికి తిరుపతి శ్రీనివాసుడికి ఎన్నో పోలికలు ఉన్నాయి. తిరుపతిలో వేంకటేశ్వరుడు ఏడు కొండల పై ఉన్నాడు.

కురుమూర్తి వేంకటేశ్వర స్వామి

కురుమూర్తి వేంకటేశ్వర స్వామి

P.C: You Tube

కురుమూర్తిలో కూడా ఏడు కొండల పైనే వేంకటేశ్వరుడు ఉన్నాడు. తిరుపతి క్షేత్రం ఆనందగిరిలో భాగం కాగా, కురమూర్తి కొండలు కూడా అందులో భాగమే. ఏ పురాతన ఆలయంలోనైనా విఘ్నేశ్వరుడి విగ్రహం ఉండటం ఆనవాయితి.

కురుమూర్తి వేంకటేశ్వర స్వామి

కురుమూర్తి వేంకటేశ్వర స్వామి

P.C: You Tube

అయితే తిరుమలలోని ప్రధాన ఆలయంలో వినాయకుడి విగ్రహం ఉండదు. అదే విధంగా కురుమూర్తి లో కూడా ఆ విఘ్నేశ్వరుడి విగ్రహం ఉండదు. కురుమూర్తిలో ఏడు కొండల పై శ్రీనివాసుడు దైవతాద్రి పై కొలువై ఉంటాడు.

కురుమూర్తి వేంకటేశ్వర స్వామి

కురుమూర్తి వేంకటేశ్వర స్వామి

P.C: You Tube

ఇక ఏడు కొండల పేర్లు వరుసగా దైవతాద్రి, పతగాద్రి, భల్లూకాద్రి, ఘనాద్రి, కోటగట్టు, ఏకాద్రి, శేతాద్రి. తిరుపతిలో స్వామివారు నిలుచున్న భంగిమలో కనిపిస్తే ఇక్కడ కూడా స్వామివారు నిలుచున్న బంగిమలోనే కనిపిస్తాడు.

కురుమూర్తి వేంకటేశ్వర స్వామి

కురుమూర్తి వేంకటేశ్వర స్వామి

P.C: You Tube

కురుమూర్తికి వెళ్లే సమయంలో మోకాళ్ల గుండు కనిపిస్తుంది. అటువంటి మోకాళ్ల గుండును మనం తిరుపతిలో కూడా చూడవచ్చు. కురుమూర్తిలో బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా నిర్వహిస్తారు.

కురుమూర్తి వేంకటేశ్వర స్వామి

కురుమూర్తి వేంకటేశ్వర స్వామి

P.C: You Tube

ఈ ఉత్సవాల్లో ఉద్దాల మహోత్సవం ప్రధానమైనది. ఉద్దాలు అంటే పాదుకలు అని అర్థం. ఈ పాదుకలను దళితులే తయారుచేస్తారు. ఇక ఉత్సవాల సందర్భంగా ఆ పాదుకలను ఊరేగిస్తారు.

కురుమూర్తి వేంకటేశ్వర స్వామి

కురుమూర్తి వేంకటేశ్వర స్వామి

P.C: You Tube

ఈ పాదుకలను తాకడానికి లక్షల సంఖ్యలో పోటీపడుతారు. అనంతరం ఆ పాదుకలతో తల పై కొట్టించుకొంటారు. దీని వల్ల పాపాలు పోతాయని చెబుతారు. అమావస్య రోజున ఈ పుణ్యక్షేత్రంలో దర్శనం చేసుకొంటే అతీత శక్తులు వస్తాయని నమ్ముతారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+