Search
  • Follow NativePlanet
Share
» »నంజుండేశ్వర ఆల‌యంలో అడుగుపెడితే చాలు.. మొండి వ్యాధులు న‌య‌మైపోతాయ‌ట‌!?

నంజుండేశ్వర ఆల‌యంలో అడుగుపెడితే చాలు.. మొండి వ్యాధులు న‌య‌మైపోతాయ‌ట‌!?

కర్ణాటక రాష్ట్రంలోని నంజున్​గఢ్ జిల్లాలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన నంజుండేశ్వర క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో నిత్యం భ‌క్తుల తాకిడి ఎక్కువ‌గా ఉంటుంది. అందుకు ప్ర‌ధాన కార‌ణం ఇక్క‌డి శివుడిని ద‌ర్శించుకుంటే ఎలాంటి మొండి రోగాలైనా న‌య‌మ‌యిపోతాయ‌ట‌.

ఈ కార‌ణంగా సుదూర ప్రాంతాల నుంచి భ‌క్తులు ఇక్కడ‌కు చేరుకుని, శ‌వుడిని ద‌ర్శించుకుంటారు. ఇక్క‌డ‌ శివుడు శ్రీకంఠీశ్వరుడుగా పిల‌వ‌బ‌డ‌తాడు. అంతేకాదు, ఈ ఆలయంలోని శివలింగాన్ని గౌతమ మహర్షి ప్రతిష్ఠిచినట్లుగా ఆలయ శిలాఫలకాల శాసనాల ద్వారా గుర్తించారు. ఈ ఆల‌య విశిష్ట‌త‌ను తెలుసుకుందాం!

ద‌క్షిణ కాశీగా పేరొందిన మైసూరుకు ద‌గ్గ‌ర‌లో ఉన్న‌ ఈ ఆల‌యంలోని నంజుండేశ్వ‌రడు పేరు వెనుక ఉన్న అర్థాన్ని తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. కన్నడ భాషలో నంజ అంటే విషం అని, నంజుంద అంటే విషాన్ని స్వీకరించిన వాడు అని అర్థం. క్షీర సాగర మధనంలో వ‌చ్చిన‌ కాలకూట విషాన్ని స్వీకరించి, ఆ విషాన్ని తన కంఠంలోనే ఉంచిన‌ శివుడు గరళకంఠుడయ్యాడుని పురాణాలు చెబుతున్నాయి. ఆ నీలకంఠ శివుడే ఇక్కడ నంజుండేశ్వరుడిగా వెలిశాడ‌ని భ‌క్త‌ల ప్ర‌గాఢ న‌మ్మ‌కం.

ఈ ఆల‌యంలోని నంజుండేశ్వరడుని దర్శనం చేసుకోవ‌డం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల‌తోపాటు మొండి రోగాలు సైతం నయమవుతాయనే ప్ర‌చారం ఉంది. ఆలయానికి సమీపంలోని కపిల నదిలో స్నానం చేసి, శివునికి ఉరుల్ అనే సేవ చేసుకోవ‌డం ద్వారా ఎలాంటి వ్యాధైనా క్రమంగా త‌గ్గిపోతుంద‌ని ఇక్క‌డ‌కు వ‌చ్చే భ‌క్తులు విశ్వ‌సిస్తుంటారు.

nanjundeshwaratemple Mysore

నంజుండేశ్వరుని చారిత్ర‌క నేప‌థ్యం..

కర్ణాటకను పాలించిన టిప్పుసుల్తాన్ ఏనుగుకు కళ్ల సంబందిత వ్యాధి వ‌చ్చింద‌ట‌. ఈ వ్యాధి చాలా కాలంపాటు త‌గ్గ‌కుండా ఇబ్బంది పెట్టింద‌ట‌. అప్పుడు నంజుండేశ్వరుడికి ప్ర‌త్యేక‌ పూజలు చేయించారు. దీంతో ఏనుగుకు వ్యాధి వెంటనే తగ్గిందని, అందుకు కృతజ్ఞతగా టిప్పు సుల్తాన్ నంజుండేశ్వరుడికి పచ్చల పతకం, పచ్చల కిరీటం చేయించార‌ని ప్ర‌చారంలో ఉంది. అలాగే, పరశురాముడు తన తండ్రి ఆజ్ఞ మేరకు తల్లి శిరస్సు ఖండించిన తర్వాత ఆ మానసిక వ్యాధితో ఆసేతు హిమాచలం పర్యటించాడ‌ట‌.

అయినా ప‌ర‌శురాముడికి మనశ్శాంతి దొర‌క‌లేదు. త‌ర్వాత‌ క్షేత్రంలో అడుగు పెట్టగానే మాన‌సిక ప్ర‌శాంత‌ను పొందాట‌. దాంతో ఇక్కడే తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడని స్థల పురాణం చెబుతోంది. ఈ కార‌ణంగానే ఆలయానికి సమీపంలో పరశురామ క్షేత్రం వెల‌సింద‌ని చెబుతారు. అంతేకాదు, నంజుండేశ్వరుడి దర్శనానికి ముందే ఈ పరశురామ క్షేత్రాన్ని దర్శించుకోవాల‌ని, అలా చేయ‌కుంటే దర్శన ఫలం దక్కదని పెద్ద‌లు చెబుతున్నారు.

ఏడాదికి రెండు సార్లు వేడుక‌లు..

ఏడాదికి రెండు సార్లు దొడ్డ రథోత్సవం, చిక్క రథోత్సవం పేరుతో నంజుండేశ్వరుడి ఆలయంలో ఘనంగా రథోత్సవాలు జ‌రుపుతారు. మూడు రోజుల పాటు జరిగే రథోత్సవాల్లో శివుడు, పార్వతి దేవి, గణపతి, కుమారస్వామి, చండికేశ్వరుని ఐదు ర‌థాల‌తో తిరువీధులలో ఊరేగించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. అయిదు రథాలతో జరిగే ఈ రథోత్సవాన్ని చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోప తండాలుగా హాజ‌ర‌వుతారు. ఆల‌య నిర్వాహ‌కులు భ‌క్తుల విశ్వాసానికి త‌గ్గ‌ట్టుగా అన్ని ఏర్పాట్లూ చేస్తుంటారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+