Search
  • Follow NativePlanet
Share
» »కర్నాటక లో చల్లచల్లని ప్రదేశాలు !

కర్నాటక లో చల్లచల్లని ప్రదేశాలు !

గత కొద్ది సంవత్సరాలుగా కర్ణాటక రాష్ట్రం ఒక గొప్ప టూరిస్ట్ కేంద్రంగా మారింది. రాష్ట్రంలో అటవీ ప్రదేశాలు, చారిత్రక నిర్మాణాలు సమర్ధవంతంగా నిర్వహించ బడటంతో రాష్ట్రం ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. వేసవిలో దక్షిణ భారత దేశం అంటా వేడి గా ఉన్నప్పటికీ కర్నాటక రాష్ట్రం మాత్రం చల్లదనం కలిగి చూడ వచ్చిన పర్యాటకులకు ఆహ్లాదకర వాతావరణం లో ఎన్నో ప్రోగ్రాములు కల్పిస్తోంది.

ఐ . టి. రంగానికి కేంద్రం గా విలసిల్లుతున్న బెంగుళూరు కర్నాటక రాష్ట్రంలో కలదు. రాష్ట్రంలో అనేక ఉత్తమ పర్యాటక ఆకర్షణలు కలవు. ఒంటరి ట్రావెలర్ , లేదా జంట హనీ మూనర్ లేదా, స్నేహితులతో , కుటుంబ సభ్యులతో కలసి ఆనందించ గోరె వారికి ఎవరికీ ఏది కావాలంటే ఆ ప్రోగ్రాం ఇక్కడ లభ్యంగా వుంటుంది. మరి చల్లటి కర్ణాటకలో మిమ్మల్ని మరింత కూల్ గా ఉంచేందుకు, ఆనందింప చేసేందుకు ఏ రకమైన ప్రోగ్రాములు కలవో పరిశీలిద్దాం.

 సావన్ దుర్గ లో నేచర్ వాక్

సావన్ దుర్గ లో నేచర్ వాక్

సావన్ దుర్గ ప్రదేశం బెంగుళూరు సిటీ నుండి 33 కి. మీ. ల దూరంలో కలదు. సావన్ దుర్గ లో కరిగుడ్డ మరియు బిల్లి గుడ్డ అని రెండు కొండలు కలవు. ఈ కొండలపై కల మార్గాలలో మీ నడక మీకు మరువలేని అనుభూతులు అందిస్తుంది. ట్రెక్కింగ్, రాక్ క్లైమ్బింగ్, ఇతర సాహస క్రీడలు చేయవచ్చు.

Photo Courtesy: L. Shyamal

నంది హిల్స్

నంది హిల్స్

నంది హిల్స్ లో కల సుందర దృశ్యాలు పర్యాటకులను అబ్బుర పరుస్తాయి. స్థానికులు నంది హిల్స్ ను తమ వారాంతపు పిక్నిక్ ప్రదేశంగా భావిస్తారు. నంది హిల్స్ బెంగుళూరు కు 60 కి. మీ. ల దూరం. ఉదయం వేళ పెందలకడే ఈ ప్రాంతంలో మేఘాలతో కూడిన ఆకాశం, పొగ మంచు వ్యాపించిన కొండలు చూసి ఆనందించవచ్చు.

Photo Courtsey: Clement Francis M.

 ముడుమలై లో జంగల్ సఫారి

ముడుమలై లో జంగల్ సఫారి

వన్య జీవుల పట్ల ఆసక్తి కలవారికి ముడుమలై ఒక ఆకర్షణీయ ప్రదేశం. వేసవి కాల విహారంగా బాగుంటుది. ఇక్కడ కల జంగల్ సఫారిలో మీరు అనేక జంతువులను సమీపంగా చూడవచ్చు. ఈ సఫారిని ఫారెస్ట్ డిపార్టుమెంటు నిర్వహిస్తోంది. కొన్ని ప్రైవేటు రిసార్ట్ లు కూడా సఫారి పాకేజ్ లు నిర్వహిస్తునాయి.

బండి పూర్ అడవులు

బండి పూర్ అడవులు

ఉదయం వేళ బండి పూర్ అటవీ ప్రాంతం లో మీరు చేసే ప్రయాణం మీకు మరువ లేని అనుభూతులు పంచుతుంది. అనేక జంతువులను చూడవచ్చు. ఇక్కడ, లేడి, ఏనుగు, నెమలి, వంటి వన్య జంతువులు ఎన్నో మీకు దర్శనమిస్తాయి.

రివర్ రాఫ్టింగ్ గాలి బోర్ లో

రివర్ రాఫ్టింగ్ గాలి బోర్ లో

గాలిబోర్ ఒక సుందర దృశ్యాల ప్రదేశం ఇది బెంగుళూరు కు 102 కి. మీ. ల దూరం. ఇక్కడ రివర్ రాఫ్టింగ్ కలదు. రివర్ రాఫ్టింగ్ మాత్రమే కాక, ఇక్కడ మీరు చేపలు కూడా పట్టవచ్చు.

 తడి యాన్దమోల్ లో ట్రెక్కింగ్

తడి యాన్దమోల్ లో ట్రెక్కింగ్

తదియాన్దమోల్ శిఖరం కర్నాటక రాష్ట్రంలో రండవ ఎత్తైన శిఖరం. కర్నాటక రాష్ట్రంలోని మంచి వేసవి విహార ప్రదేశాలలో ఒకటి.

Photo Courtesy: L. Shyamal

కుద్రేముఖ్ లో ట్రెక్కింగ్

కుద్రేముఖ్ లో ట్రెక్కింగ్

కుద్రేముఖ్ లో కల ట్రెక్కింగ్ రూట్ లు మీకు ఎంతో ఆనందం కలిగిస్తాయి. మొత్తంగా ఇక్కడ 13 ట్రెక్కింగ్ రూట్ లు కలవు. ఎంతో ప్రసిద్ధి చెందినా కుద్రేముఖ్ హిల్ స్టేషన్ బెంగుళూరు నుండి 338 కి. మీ. ల దూరం.

Photo Courtesy: Karunakar Rayker

కూర్గ్ లో కల టిబెటన్ కాలనీ

కూర్గ్ లో కల టిబెటన్ కాలనీ

కూర్గ్ పరిసరాలలో కల టిబెటన్ కాలనీ లో అనేక పర్యాటక ఆకర్షణలు కలవు. ఈ టిబెట్ దేశీయుల స్థావరం తప్పక చూడదగిన ప్రదేశం. తమ సాంప్రదాయక దుస్తులు ధరించి ఈ పట్టణంలో విహరిస్తున్న టిబెట్ దేశీయులను చూడటం మీకు ఎంతో విభిన్న దృశ్యం గా వుంటుంది. టిబెట్ దేశీయుల సంప్రదాయం, సంస్కృతి ఇక్కడ మీకు బాగా కనపడుతుంది. వేసవిలో ఈ ప్రాంతం చల్లగా వుంది, పర్యాటకులకు ఆహ్లాదకరం గా వుంటుంది.

Photo Courtesy: Dvellakat

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+