Search
  • Follow NativePlanet
Share
» »భాగ్య‌న‌గ‌రం నుంచి సోమ‌శిలకు స‌మ్మ‌ర్ వీకెండ్‌ టూర్ రెఢీ అయ్యింది!

భాగ్య‌న‌గ‌రం నుంచి సోమ‌శిలకు స‌మ్మ‌ర్ వీకెండ్‌ టూర్ రెఢీ అయ్యింది!

భాగ్య‌న‌గ‌రం హైద‌రాబాద్ నుంచి ఆధ్యాత్మిక చింత‌న క‌లిగిన ఔత్సాహికుల‌కు తెలంగాణ టూరిజం శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. Srisailam - Somasila Road cum River Cruise Tour పేరుతో రెండు రోజుల టూర్‌ ప్యాకేజీని ప్రకటించింది. వేస‌వి సెల‌వుల‌లో కుటుంబ స‌మేతంగా రెండు రోజులు విహరిస్తూ.. ప్ర‌సిద్ధ ఆధ్యాత్మిక కేంద్రాన్ని చూసేందుకు ఇదో గొప్ప అవ‌కాశ‌మ‌నే చెప్పాలి. ప్ర‌కృతి సోయ‌గాల మ‌ధ్యసాగే ప్ర‌యాణం జీవితంలో మ‌ర్చిపోలేని ఎన్నో అనుభూతుల‌ను చేరువ చేస్తుందంటే అతిస‌యోక్తి కాదు. మ‌రెందుకు ఆల‌స్యం.. తెలంగాణ ప‌ర్యాట‌క శాఖ విడుద‌ల చేసిన ఈ స‌రికొత్త టూర్ ప్యాకేజీ వివ‌రాల‌ను తెలుసుకుందాం రండి!

ప‌చ్చ‌ని సోమశిల ప్రకృతి అందాలను మ‌న‌సారా ఆస్వాదించాల‌నుకునే ఆధ్యాత్మ‌క ప‌ర్యాట‌క ప్రేమికులకు Srisailam - Somasila Road cum River Cruise Tour పేరుతో తెలంగాణ టూరిజం శాఖ ప్ర‌క‌టించిన టూర్ ప్యాకేజీ గొప్ప అవ‌కాశ‌మ‌నే చెప్పాలి. సిటీ లైఫ్‌లో బిజీగా గ‌డిపేస్తున్న న‌గ‌ర‌వాసుల‌కు కాస్త మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను చేరువ చేసేందుకు ప్రతి వీకెండ్ శనివారం తేదీల్లో ఈ టూర్ ప్యాక్‌ను అందుబాటులోకి తెచ్చింది తెలంగాణ టూరిజం శాఖ‌. హైద‌రాబాద్ కేంద్రంగా మొద‌లయ్యే ఈ ట్రిప్‌ నాన్ ఏసీ కోచ్ బస్సు ప్ర‌యాణంతో స్టార్ట్ అవుతుంది.

srisailam temple tour

అలా ఉదయం 9 గంటలకు భాగ్య‌న‌గ‌రంలో మొద‌లై.. శ్రీశైలం చేరుకున్న‌క రాత్రి అక్కడే విడిది చేయాల్సి ఉంటుంది. అలా రెండ‌వ‌ రోజు శ్రీశైలం నుంచి బయలుదేరి.. సోమశిలలో అడుగుపెడ‌తారు. అక్కడ క్రూజ్ బోట్ ద్వారా ప్ర‌యాణాన్ని ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. ఊగిస‌లాడే న‌దీ ప్ర‌వాహంపై బోటు ప్ర‌యాణం అనుభ‌వాన్ని మాట‌ల్లో వర్ణించ‌డం క‌ష్ట‌మే అనుకోండి. అదే జ‌ర్నీలో బోటులోనే భోజ‌న సౌక‌ర్యాన్ని అందిస్తారు. అలా సాయంత్రం 5 గంటలకు సోమశిల నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్ర‌యాణం ఉంటుంది. అదే రోజు రాత్రి 9 గంటల భాగ్య‌న‌గ‌రంలో అడుగుపెట్ట‌డంతో టూర్ ముగుస్తుంది.

హైదరాబాద్ - శ్రీశైలం - సోమశిల టూరిజం ప్యాకేజీ ధరలు

ఓవైపు సంగమేశ్వరాలయం.. మ‌రోవైపు సోమేశ్వరాలయం.. ఆ ప్ర‌దేశాన్ని క‌నులారా వీక్షించేవారెవ్వ‌రైనా జీవితంలో అలాంటి క్ష‌ణాల‌ను మ‌ర్చిపోలేర‌నే చెప్పాలి. ప‌చ్చ‌ద‌నం ప‌రిచిన‌ట్లు క‌నిపించే ఇక్కడి ప్రకృతి అందాలు పాపికొండలకు దీటుగా నిలుస్తాయి. దీంతో పర్యాటకులు సోమశిల టూర్ ప్యాకేజీపై ఎక్కువ ఆస‌క్తి క‌న‌బ‌రుస్తార‌ని టూరిజం శాఖ అధికారులు భావిస్తున్నారు. నల్లమల్ల పచ్చదనం.. కృష్ణానది పరవళ్లను మీ మొబైల్ ఫోన్‌ల‌లో బంధించేందుకు సిద్ధంగా ఉండండి.

somasilaroadcumrivercruisetour1

తక్కువ బడ్జెట్ లోనే ఉన్న ఈ రెండు రోజుల టూర్ ప్యాకేజీ చూస్తే... పెద్దలకు రూ. 4999, పిల్లలకు రూ. 3600గా నిర్ణ‌యించారు. ఇక టూర్ ప్యాకేజీలో బ‌స్సు టికెట్లు, దర్శనం, బోట్ ఛార్జీలు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి డైరెక్ట్ గా టూర్ ప్యాకేజీని మీరే స్వ‌యంగా బుక్ చేసుకునే అవ‌కాశం ఉంది. ప్ర‌తి శ‌నివారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. మ‌రెందుకు ఆల‌స్యం కుటుంబ‌స‌మేతంగా సోమ‌శిల అందాల‌ను ఆస్వాదించేందుకు మీ ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టిండి.

More News

    Read more about: somasila tour hyderabad tour
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+