Search
  • Follow NativePlanet
Share
» »బ్రహ్మ తపస్సు చేసిన ప్రదేశంలో 10వ శతాబ్దం కాలం నాటి అత్యంత అపురూపమైన సూర్యుని సరస్సు(సూరజ్ కుండ్)

బ్రహ్మ తపస్సు చేసిన ప్రదేశంలో 10వ శతాబ్దం కాలం నాటి అత్యంత అపురూపమైన సూర్యుని సరస్సు(సూరజ్ కుండ్)

ద్వాపరయుగంలో మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్రం ఈ రాష్ట్రంలోనే వుంది. ఫరీదాబాద్ లోని బద్ఖల్ సరస్సు కూడా ఇక్కడ చూడదగిన మరో ఆకర్షణ.భివాని వద్ద వున్న నక్షత్ర నిర్మాణం కూడా పర్యాటకులను ఆకర్షించే ప్రదేశం.

మన భారత దేశంలో ప్రసిద్ది చెందిన పర్యాటక ప్రదేశాల్లో ఒకటి హర్యానా. భారత దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రాల్లో హర్యానా ఒకటి. 1966 లో పంజాబ్ నుండి వేరుపడి ఈ రాష్ట్రం ఏర్పడింది. తూర్పున ఉత్తర ప్రదేశ్, పశ్చిమాన పంజాబ్, దక్షిణాన రాజస్థాన్, తూర్పున హిమాచల్ ప్రదేశ్ సరిహద్దుగా కలిగి వుంది హర్యానా. భారత రాజధాని డిల్లీకి ఆనుకుని వున్నది. హర్యానా చాలా అందమైన, విశిష్ట పర్యాటక ప్రాంతాలను అందించే రాష్త్రం. హర్యానా లోని పర్యాటక ప్రాంతాలు డిల్లీ నుంచి కేవలం నిమిషాల్లో చేరుకోవచ్చు.

ద్వాపరయుగంలో మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్రం ఈ రాష్ట్రంలోనే వుంది. ఫరీదాబాద్ లోని బద్ఖల్ సరస్సు కూడా ఇక్కడ చూడదగిన మరో ఆకర్షణ.భివాని వద్ద వున్న నక్షత్ర నిర్మాణం కూడా పర్యాటకులను ఆకర్షించే ప్రదేశం. దేవాలయాలు, కోటలు లేక సరస్సులు, పార్కులు హర్యానా పర్యాటకం లో దర్శించవచ్చు. హర్యానా ప్రజలు, సంస్కృతి సాంప్రదాయాలు గల ప్రజలు. గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన రాష్ట్రం హర్యానా. వేద కాలం నాటి చరిత్ర కలిగిన ఈ రాష్ట్రం గురించి హిందూ పురాణాల్లోను ప్రస్తావన వుంది. విశ్వ విధాత బ్రహ్మ ఇక్కడే తపస్సు చేసి సృష్టి మొదలు పెట్టాడంటారు. హర్యానాలో సూరజ్ కుండ్ గురించి తెలుసుకుందాం..

సూరజ్ కుంద్

సూరజ్ కుంద్

ఢిల్లీకి కేవలం పదికిలో మీటర్ల దూరంలో సూరజ్ కుంద్ ఉన్నది. ఇక్కడ 900ఏళ్ళ క్రితం పాలించిన తోమార్ రాజ వంశీయులు నిర్మించిన సూర్య దేవాలయం చిక్కని అడవి మధ్య ప్రక్రుతి అందాలకు నిలయంగా ఉంది దేవాలయాన్ని ఆనుకొని ఒక పెద్ద సరస్సు ఉంది .అందుకే ఈ ప్రాంతాన్ని సూరజ్ కుండ్ అన్నారు .

 ప్రసిద్ది చెందిన పర్యాటక ప్రదేశం. సూరజ్ కుండ్

ప్రసిద్ది చెందిన పర్యాటక ప్రదేశం. సూరజ్ కుండ్

సూరజ్ కుండ్. ఇది ఫరిదాబాద్ లో ఉంది. ఇది బాగా ప్రసిద్ది చెందిన పర్యాటక ప్రదేశం. సూరజ్ కుండ్ ప్రదేశంలో సూర్యూన్ని సూచించే సరస్సు ఉంది. ఇది సూర్యున్ని సూచించే ప్రాధాన్యత కలిగి ఉంది.

సూరజ్‌కుండ్‌ అనగా ‘సూర్యుని సరస్సు’

సూరజ్‌కుండ్‌ అనగా ‘సూర్యుని సరస్సు’

సూరజ్‌కుండ్‌ అనగా ‘సూర్యుని సరస్సు' అని అర్థం. ఇది పదో శతాబ్దానికి చెందిన ఒక సరస్సు. ఉదయిస్తున్న సూర్యుడి ఆకారంలో దీన్ని నిర్మించారు. ఒకప్పుడు ఈ సరస్సు వద్ద ఎన్నో నెమళ్లు స్వేచ్ఛగా తిరుగాడేవి. అందుకే దీన్ని ‘పీకాక్‌ లేక్‌'గా కూడా పిలుస్తారు. తోమర్‌ రాజవంశానికి చెందిన గుర్జార్‌కింగ్‌ సూరజ్‌ పాల్‌ దీన్ని నిర్మించారు.

PC:Jyoti Prakash Bhattacharjee

ఈ సూరజ్ కుండ్ చుట్టూ చెక్కిన రాతి మెట్లు ఉన్నాయి.

ఈ సూరజ్ కుండ్ చుట్టూ చెక్కిన రాతి మెట్లు ఉన్నాయి.

ఈ సూరజ్ కుండ్ చుట్టూ చెక్కిన రాతి మెట్లు ఉన్నాయి. అలాగే ఈ సూరజ్ కుండ్ సమీపంలోనే ఔషద శక్తులున్న సిద్ధ అనే నీటి చెరువు కూడా ఉంది. అలాగే ఈ ప్రాంగణంలో రఝూన్ లు చేసి అందమైన తోటలు ఆహ్లాదపరుస్తాయి.PC:Anupamg

ఫరిదాబాద్ లో ఉన్న సూరజ్ కుండ్ లో

ఫరిదాబాద్ లో ఉన్న సూరజ్ కుండ్ లో

ఫరిదాబాద్ లో ఉన్న సూరజ్ కుండ్ లో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1 నుండి 15 వరకు అంతర్జాతీయ పండుగ జరుగుతుంది. పర్యాటకులు, కళాకారులు, నిపుణులు మేళాలో ప్రదర్శించబడే కళలు, చేతిపనుల ద్వారా గ్రామీణ భారతీయ రంగులను అనుభవించవచ్చు.

PC:Varun Shiv Kapur

ఈ పండుగ సమయంలో అలరించే సంప్రదాయ నృత్యాలు,

ఈ పండుగ సమయంలో అలరించే సంప్రదాయ నృత్యాలు,

ఈ పండుగ సమయంలో అలరించే సంప్రదాయ నృత్యాలు, ఆకట్టుకునే అందమైన బొమ్మలు. హోరెత్తించే డప్పుల దరువులు, హుషారెత్తించే గిరిజనుల పాటలు, అద్భుత కళారూపాలు, ఆకాశాన్నంటే సంబరాలు. దేశ సంస్కృతి, సంప్రదాయాన్ని చాటే ఆ జాతరే ‘సూరజ్‌కుండ్‌ మేళా'. హర్యానాలోని ఫరీదాబాద్‌లోజరుగిగే ఈ మేళ అత్యంత ప్రసిద్ది చెందినది.

మనదేశంలో జరిగే ప్రసిద్ధ హస్తకళల జాతరే ‘సూరజ్‌కుండ్‌ మేళా’.

మనదేశంలో జరిగే ప్రసిద్ధ హస్తకళల జాతరే ‘సూరజ్‌కుండ్‌ మేళా’.

మనదేశంలో జరిగే ప్రసిద్ధ హస్తకళల జాతరే ‘సూరజ్‌కుండ్‌ మేళా'. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ మేళాలో దాదాపు 20 దేశాల వాళ్లు భాగమవుతారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1న మొదలవుతుంది ఈ సంబరం. 15రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ మేళాను చూడటానికి దేశ, విదేశ సందర్శకులు వస్తుంటారు.

మనదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు తమ హస్తకళల్ని ఇక్కడ ప్రదర్శిస్తారు.

మనదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు తమ హస్తకళల్ని ఇక్కడ ప్రదర్శిస్తారు.

మనదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు తమ హస్తకళల్ని ఇక్కడ ప్రదర్శిస్తారు. సూరజ్‌కుండ్‌ మేళాకు దాదాపు 30 సంవత్సరాల చరిత్ర ఉంది. 1987లో మొదటి మేళా జరిగింది. హస్తకళలను ప్రోత్సాహించటంతో పాటు దేశ, విదేశాల్లో వాటికి మంచి గుర్తింపు తీసుకురావడం ఈ మేళా ఉద్దేశం.

అలరించే ప్రదర్శనలు

అలరించే ప్రదర్శనలు

గిరిజనులు జానపద పాటలు, నృత్యాలు సందర్శకుల్లో ఉత్సాహాన్ని నింపుతాయి. తోలుబొమ్మలాటలు, సంగీత కచేరీలు, బుర్ర కథలు, నాటకాలు ఈ మేళా ప్రత్యేకం. వీటికోసం ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేస్తారు. పిల్లల కోసం అనేక రైడ్లు కూడా ఉంటాయి. ఫుడ్‌ ఫెస్టివల్‌ మేళాకు మరో ఆకర్షణగా నిలుస్తోంది.

అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ఈ మేళాకు

అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ఈ మేళాకు

అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ఈ మేళాకు పదిలక్షల మంది సందర్శకులు వస్తారు. గత మేళాను రెండు లక్షలమంది విదేశీయులు సందర్శించారు.

ఫరీదాబాద్‌ స్థాపకుడు బాబా ఫరీద్‌ ఖాన్‌. ఆయన పేరుతో నిర్మించి కోట

ఫరీదాబాద్‌ స్థాపకుడు బాబా ఫరీద్‌ ఖాన్‌. ఆయన పేరుతో నిర్మించి కోట

ఫరీదాబాద్ సూరజ్ ఒక చారిత్రక నగరం...పారిశ్రామిక కేంద్రానికి నిలయం, ఫరీదాబాద్‌లో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు అనేకం ఉన్నాయి.
ఫరీదాబాద్‌ స్థాపకుడు బాబా ఫరీద్‌ ఖాన్‌. ఆయన పేరుతో నిర్మించి కోట, మసీద్‌, టూంబ్‌ ఉన్నాయి. వాటి శిథిలాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి.

హర్యానా లోని రెండవ అతి పెద్ద నగరం.

హర్యానా లోని రెండవ అతి పెద్ద నగరం.

హర్యానా లోని రెండవ అతి పెద్ద నగరం. దీని చుట్టూ ఢిల్లీ, బుర్గాన్‌ ఉండటం వల్ల ఫరీదాబాద్‌ భూగోళిక స్థానం ముఖ్యమైనది. ఇది యమున నది ప్రాంతంలో ఉంది. ఢిల్లీ నుంచి 25 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఫరీదాబాద్‌ ఒక పారిశ్రామిక ఉత్పత్తుల కేంద్రం.

ఫరీదాబాద్‌ చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలను చూసినట్లైతే

ఫరీదాబాద్‌ చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలను చూసినట్లైతే

ఫరీదాబాద్‌ చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలను చూసినట్లైతే బద్ఖల్‌ సరస్సు, సూరజ్‌ కుండ్‌, రాజ నహర్‌ సింగ్‌ ప్యాలెస్‌, సెయింట్‌ మేరీస్‌ చర్చ్‌, ధవుజ్‌ సరస్సు, ఆరావళి పర్వతాలు, నహర్‌ సింగ్‌ క్రికెట్‌ స్టేడియం, టౌన్‌ పార్కు, ఝార్ణ మందిర్‌ విలేజ్‌, మొహబ్బతాబాద్‌, ఫరీద్‌ ఖాన్‌ సమాధి, ఫరీదాబాద్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ మొదలైనవి ఫరీదాబాద్‌ లోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు.

ఎలా వెళ్లాలి ?

ఎలా వెళ్లాలి ?


వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా హర్యానా అన్ని ప్రధాన నగరాలకు కలపబడి వుంది. రాజధాని డిల్లీకి దగ్గరగా వుండడం వల్ల హర్యానా చేరుకోవడం చాలా తేలిక.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+