Search
  • Follow NativePlanet
Share
» »సురియనార్ కోయిల్ - సూర్యుడి నవగ్రహ ఆలయం !!

సురియనార్ కోయిల్ - సూర్యుడి నవగ్రహ ఆలయం !!

సురియనార్ కోయిల్, తమిళనాడు లోని తంజావూర్ జిల్లాలో ఉన్న ఒక గ్రామం. నవగ్రహ ఆలయాలు లేదా స్థలాలలో ఒకటైన ఈ ఆలయం సూర్యునికి అంకితం చేయబడింది.

By Mohammad

సురియనార్ కోయిల్, తమిళనాడు లోని తంజావూర్ జిల్లాలో ఉన్న ఒక గ్రామం. నవగ్రహ ఆలయాలు లేదా స్థలాలలో ఒకటైన ఈ ఆలయం సూర్యునికి అంకితం చేయబడింది. సూర్యుని విగ్రహం ఉన్న ఈ హిందూ ఆలయం శివసూర్యనారాయణ ఆలయానికి ఈ గ్రామం పేరుగాంచింది. భక్తులు ఈ ఆలయంలో ఇతర గ్రహాల విగ్రహాలను కూడా చూడవచ్చు. ఈ ఆలయం భావిష్యశాస్త్ర ప్రాముఖ్యతకు ప్రసిద్ది చెందింది, భక్తులు పెద్ద సంఖ్యలో సంపద కోసం గ్రహాల ప్రభావం బలోపేతం చేయడానికి, వారి ఆరోగ్యంపై గ్రహాల చెడు ప్రభావాలను తగ్గించుకోవడానికి ఈ స్థలాన్ని సందర్శిస్తారు.

శివసూర్యనారాయణ ఆలయ నిర్మాణ౦, చరిత్ర

ఈ ఆలయం పడమటి వైపు ఉంది, గ్రహాల నుండి అత్యంత ప్రయోజనకరమైన కిరణాలను పొందేటట్లు నిర్మించారు. ఈ ఆలయాన్ని కులోత్తుంగ చోలదేవ రాజు పాలనలో క్రీశ 1100 సంవత్సరంలో నిర్మించారు. 3 వరుసలతో అసాధారణ పరిమాణం గల గోపురం, పైన 5 గోపురాలు ఈ ఆలయ గొప్పతనాలు. ఇక్కడ సూర్య తీర్ధం అని పిలిచే పవిత్ర నీటి తొట్టె కూడా ఉంది. గురు భగవాన్ ఇక్కడ సూర్య భగవానుని ప్రార్ధనలు చేశాడు. ఇక్కడ తిరుమంగలకుడి వద్ద ముందు శివుడు (ప్రాణనాదేశ్వర్), పార్వతి (మంగలామ్బిగై) ని పూజించాలి, తరువాత సూర్యనారాయణ, ఇతర నవగ్రహాలను పూజించాలి.

సూర్యుడి నవగ్రహ ఆలయం

శివ సూర్యనారాయణ దేవాలయం

ఈ ఆలయం సురియనార్ కోయిల్ లో ఉంది. శివసూర్యనారాయణ ఆలయంలో సూర్యుని విగ్రహం ఉంది, ఇది తమిళనాడు లోని నవగ్రహ ఆలయాలలో ఒకటి. ఈ ఆలయంలో మిగిలిన ఎనిమిది గ్రహాల విగ్రహాలు కూడా ఉన్నాయి. కలవ మునివర్ తానూ త్వరలో కుష్టు వ్యాధికి గురౌతానని అంచనా వేసి చెప్పాడని చెప్తారు.

అందువల్ల అతడు ఆ రోగం నుండి రక్షించబడటానికి నవగ్రహాలని ప్రర్ధించాలని నిర్ణయించుకున్నాడు. నవగ్రహాలు అతని అంకితభావానికి సంతోషపడ్డారు, వారు అతని కొరికను విన్నారు. అయినా అతని విధి మారలేదు, ఎవరూ దానిని సరిచేయలేదు, అపుడు బ్రహ్మదేవుడు ఇది విని చాలా కోపోద్రిక్తుడై, కలవ మునివర్ అనుభవించిన బాధలు 9 గ్రహాలు అనుభవించాలని శపించాడు. అప్పటినుండి నవగ్రహాలన్నీ కుష్టు తో బాధపడ్డాయి.

ఇది కూడా చదవండి : వన్ డే ట్రిప్ టు తిరుప్పూర్ !!

తరువాత, నవగ్రహాలు బ్రహ్మతో ఇదంతా మర్చిపోయి, ఈ శాపాన్ని అధిగమించే మార్గాన్ని చెప్పమన్నారు. తిరుమంగలకుడి సందర్శించి, ప్రాణనాదేశ్వర్ (వెల్లెరుక్కకడు వద్ద) ను పూజించమని బ్రహ్మదేవుడు సలహా ఇచ్చాడు. ప్రాణనాదేశ్వర్, మంగలామ్బిగై (ఆయన భార్య) కు ప్రార్ధనలు చేసిన తరువాత నవగ్రహాల స్థానానికి దగ్గరలో వినాయకుడి విగ్రహాన్ని ఉంచుతారు, ఈ ప్రదేశంలో తపస్సు ప్రారంభించారు.

దేవుని ఆశీర్వాదం వల్ల, నవగ్రహాలు పాప విమోచనం (వారి పాపానికి విమోచన) పొందాయి. కలవ మునివర్ నవగ్రహాలకు తన కృతజ్ఞతను తెలుపుకోవడానికి నవగ్రహాలు తపస్సు చేసిన ప్రదేశంలో ఒక ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో, ప్రధాన దేవత శివసూర్యనారాయణ తన ఇద్దరు భార్యలు ప్రత్యూష, ఉష తోపాటు (సూర్యుడి రధాన్ని సూచించే) రాదోత్సవానికి నిలబడ్డారు. విజయ దశమి, రథ సప్తమి పండుగల సమయంలో అనేకమంది భక్తులు ఈ ఆలయానికి గుంపులుగా వస్తారు.

సూర్యుడి నవగ్రహ ఆలయం

శివ సూర్యనారాయణ దేవాలయంలోని ప్రతిమ

సందర్శించు సమయం : ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు మరియు తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.

సూరియనార్ కోయిల్ లోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు

తిరుమంగలకుడి లోని ప్రాణనాదేశ్వర్ ఆలయం, కన్జనూర్ లోని అగ్నీశ్వర్ స్వామీ ఆలయం (వీనస్ గ్రహ నవగ్రహ ఆలయం) సమీప ఆకర్షణలు.

సూరియనార్ కోయిల్ చేరుకోవడం ఎలా ??

సూరియనార్ కోయిల్, కుంబకోణం నుండి షుమారు 15 కిలోమీటర్ల దూరంలో, స్వామిమలై నుండి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మయిలాడుతురైకి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం నుండి అడుతురై సమీప రైల్వే స్టేషన్.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+