తెలంగాణలో సందర్శించేందుకు పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఎన్నో పురాతన కట్టడాలు, చారిత్రక ప్రదేశాలతో పాటు ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే, ఈ సమ్మర్‌లో టూర్ ప్లాన్ చేసేవారు తప్పకుండా తెలంగాణ టూరిజం అందిస్తోన్న టెంపుల్ టూర్ ప్యాకేజీ గురించి తెలుసుకోవాల్సిందే..! అతి తక్కువ బడ్జెట్‌తోనే తెలంగాణలోని ఆధ్యాత్మిక ప్రదేశాలను దర్శించుకోవచ్చు.
తెలంగాణ టూరిజం అందిస్తోన్న Temple Tour (Kakatiya Region) పేరుతో ఈ ప్యాకేజీని అందిస్తోంది. దీనిని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తోంది. ఈ ట్రిప్ రోడ్డు మార్గాన సాగుతోంది. ప్రతి శనివారం తేదీల్లో ఈ ప్యాకేజీ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. తెలంగాణ టూరిజం అందిస్తోన్న ఈ సరికొత్త ప్యాకేజీ గురించి వివరాలు ఇప్పడు తెలుసుకుందాం.

బషీర్ బాగ్ నుంచి టూర్ మొదలు..
ఈ టెంపుల్ టూర్ ప్యాకేజీలో భాగంగా హైదరాబాద్ నుంచి ప్రతి శనివారం ఈ ప్యాకేజీ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.
ఈ టూర్ లో భాగంగా తెలంగాణలోని కాళేశ్వరం, రామప్ప, వేయ్యి స్తంభాల ఆలయం, యాదాద్రి, కీసరగుట్టు ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించొచ్చు. ఈ ప్యాకేజీలో భాగంగా ప్రతి శనివారం తేదిల్లోని మొదటిరోజు ఉదయం 9:30 PM గంటలకు హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి బస్సులు బయల్దేరుతారు. ఈ ప్రయాణంలో రాత్రి 10 గంటలకు యాత్రినివాస్ కు చేరుకుంటారు. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం 05.00 AM - కాళేశ్వరం బయల్దేరాల్సి ఉంటుంది. ఇక, రెండో రోజు ఉదయం ఏడు గంటలలోపు కాళేశ్వరం చేరుకుని దర్శనం భాగ్యం కల్పించుకుంటారు. అనంతరం ఏడు తర్వాత సమీపంలోని రామప్ప సందర్శనకు బయలు దేరాల్సి ఉంటుంది. అక్కడినుండి 11 గంటలకు రామప్ప చేరుకుంటారు. అనంతరం అల్పాహారం తర్వాత రామప్ప దర్శనం ఉంటుంది.

టెంపుల్ టూర్ ప్యాకేజీ ధరల వివరాలు..
11 గంటల తర్వాత అక్కడి నుంచి వరంగల్ ప్రయాణానికి బయలుదేరాలి. మధ్యాహ్నం 02.30 గంటలకు వరంగల్ చేరుకుంటాం. అక్కడ హారిత హోటల్ లో భోజనం చేసి, అనంతరం 02.30 PM - హన్మకొండ నుంచి యాదాద్రికి బయలుదేరుతాం. అక్కడ సాయంత్రం 04.30 PM to 06.00 PM యాదాద్రి దర్శనం పూర్తి చేసుకుంటాం. దర్శనం అయిపోయాక సాయంత్రం 06.00 PM - యాదాద్రి నుంచి కీసరకు బయల్దేరాల్సి ఉంటుంది. ఆ తర్వాత 07.15 PM to 08.00 PM - కీసరగుట్టకు చేరుకుంటారు.
అక్కడినుండి రాత్రి 08.00 గంటల సమయంలో హైదరాబాద్‌కు బయల్దేరాల్సి ఉంటుంది. రాత్రి 09.00 గంటల సమయంలో హైదరాబాద్ కు చేరుకుంటాం. ఇంతటితో ఈ టెంపుల్ టూర్ ముగుస్తోంది. ఒకసారి తెలంగాణ టూరిజం ప్రకటించిన ఈ టెంపుల్ టూర్ ప్యాకేజీ ధరలు చూద్దాం. ఈ ప్యాకేజీలో భాగంగా పెద్దలకయితే 2999 రూపాయిలు గా నిర్ణయించారు. అదే పిల్లలకయితే రూ. 2399 చెల్లించాల్సి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీకి ఏసీ బస్సులు ఉండవు. నాన్ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది. ఇక, ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవాలంటే మాత్రం ఈ వెబ్‌సైట్‌ను https://tourism.telangana.gov.in/p సంప్రదించొచ్చు.



Click it and Unblock the Notifications













