Search
  • Follow NativePlanet
Share
» »తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..

తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..

సాయిబాబాను ఆరాదించే భక్తులకు శుభ‌వార్త‌. సాయిబాబ భ‌క్తులు జీవితంలో ఒక్కసారైనా షిరిడికి వెళ్లాలని కోరుకుంటారు. ఆయన స్పర్శతో తరించిన ఆ పుణ్యభూమిలో అడుగు పెట్టాల‌ని చాలామంది భావిస్తుంటారు. మీకు అలాంటి కోరిక ఉంటే మాత్రం తప్పకుండా ఈ పుణ్య‌క్షేత్రానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకోండి. షిర్డి సందర్శించాల‌నుకునే వారికోసం తెలంగాణ టూరిజం ఓ ప్ర‌త్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీతో రెండు రోజుల్లో షిరిడిని సంద‌ర్శించొచ్చు.

తెలంగాణ టూరిజం హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా, తొందరగా, త‌క్కువ స‌మ‌యంలో షిరిడి వెళ్లి రావాలనుకునే వారికోసం తెలంగాణ టూరిజం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ కేవలం రెండు రోజుల్లోనే ముగుస్తుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను తెలుసుకుందాం.

షిరిడి ముంబయి నుంచి సుమారు 300 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. అలాగే, హైదరాబాదుకు 600 కిలోమీట‌ర్ల దూరంలో షిరిడి ఉంది. ప్రస్తుతం ఈ ఆలయం ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ ఆల‌యం మొత్తం మార్బుల్ రాళ్లతో నిర్మించి ఉంటారు. ఒకేసారి 600 మంది ఇక్క‌డ ప్రార్థనలు చేయవచ్చు.

రోజూ తెల్లవారుజాము 5 నుంచి రాత్రి 10 గంటల వరకు షిరిడి సాయి బాబాను దర్శించుకోవచ్చు. పండుగ వేళ్ల‌లో ఆల‌యం ఎల్ల‌ప్పుడూ తెర‌చే ఉంటుంది. గురుపూర్ణిమ, దసరా, రామనవమి రోజుల్లో రాత్రివేళ్లల్లో కూడా ఆలయం తెరిచే ఉంటుంది.

hyderabadtoshirdiflighttourpackage

షిర్డీకి రెండు రోజుల ఫ్లైట్ టూర్ ప్యాకేజీ వివ‌రాలివే..

తెలంగాణ టూరిజం Shiridi - Flight Package - Telangana Tourism పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. హైదరాబాద్ నుంచి ఈ ప్ర‌యాణం ఉంటుది. మొత్తం రెండు రోజుల్లో ఈ ప్ర‌యాణం కొన‌సాగుతోంది. హైదరాబాద్ నుంచి షిర్డీకి వెళ్లే ఫ్లైట్ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి మధ్యాహ్నం 01. 30 pmకు బయల్దేరుతుంది. మధ్యాహ్నం 2:50 pmకు షిర్డీ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 3:30pmకి హోటల్ లోకి వెళతారు. అనంత‌రం సాయిబాబా దర్శనానికి వెళ్తారు.

సాయంత్రం జరిగే హారతి కార్యక్రమంలో పాల్గొనటంతో పాటు వీఐపీ దర్శనం లేదా ఫ్రీ దర్శనం ఉంటుంది.సాయంత్రం 7:00PM-7:30PM మధ్య THEME PARK (BABA SOUND &LIGHT SHOW) షోలో పాల్గొన‌వ‌చ్చు. షిరిడిలో షాపింగ్ కూడా చేసుకోవ‌చ్చు. రాత్రి 8 గంటల వరకు ఇక్క‌డ షాపింగ్ చేసుకోవచ్చు. రాత్రి 9 తర్వాత హోటల్‌కు చేరుకుంటారు. రెండో రోజు ఉద‌యం టిఫిన్ చేశాక‌, పంచ‌ముఖి గణపతి టెంపుల్ సంద‌ర్శ‌న‌కు బ‌య‌లుదేరుతారు.

అక్క‌డ‌ ఓల్డ్ షిరిడి ద‌ర్శ‌నం చేసుకుంటారు. అనంతరం kandoba మందిర్ కు వెళ్లటంతో పాటు SAI TEETH ను కూడా సందర్శిస్తారు. తిరిగి మధ్యాహ్నం 12.30pmకు చేరుకుంటారు. సాయంత్రం 5:30PMకు హైదరాబాద్ కు ఫ్లైట్ లో చేరుకుంటారు. దీంతో టూర్ ప్యాకేజీ ముగుస్తోంది. ఈ ప్యాకేజీ ధర రూ. 12499 చెల్లించాల్సి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ఫ్లైట్ టికెట్లతో పాటు వసతి సౌకర్యం కూడా ఉంటుంది. ఇత‌ర ఏవైనా సందేహాలు ఉంటే ఈ https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు. అనంత‌రం టూర్ ప్యాకేజీ బుకింగ్ ప్రాసెస్ కూడా ఈ వైబ్‌సైట్‌లో పూర్తి చేయవచ్చు.

More News

Read more about: hyderabad shirdi tour
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+