Search
  • Follow NativePlanet
Share
» »తెలంగాణ టూరిజం వారి హైద‌రాబాద్ టు అర‌కు టూర్ ప్యాకేజీ..

తెలంగాణ టూరిజం వారి హైద‌రాబాద్ టు అర‌కు టూర్ ప్యాకేజీ..

హైద‌రాబాద్ న‌గ‌ర‌వాసుల‌కు ఓ శుభ‌వార్త‌. ఈ స‌మ్మ‌ర్ హాలీడేస్‌లో అర‌కు సంద‌ర్శించాల‌నుకునే వారికి తెలంగాణ టూరిజం ఓ స‌రికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. అతి త‌క్కువ ధ‌ర‌లోనే అర‌కు అందాల‌ను చూసేయొచ్చు. ఇది మొత్తం నాలుగురోజుల టూర్‌. రోడ్డు మార్గం ద్వారా తెలంగాణ టూరిజం ఈ ప్యాకేజీని ఆప‌రేట్ చేస్తోంది. ప్ర‌తి బుధ‌వారం తేదీల్లో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. కేవ‌లం 6999 రూపాయ‌ల‌తో హైద‌ర‌బాద్ టు అర‌కు ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. ఈ ప్యాకేజీ గురించి పూర్తి వివ‌రాలు తెలుసుకుందాం.

వైజాగ్ ప‌ట్ట‌ణానికి సుమారు 114 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో అరకులోయ హిల్ స్టేషన్ ఉంటుంది. ఈ ప్రాంతం పర్వత శ్రేణుల నడుమ ఒదిగి ఉంటుంది. ఇది ప్రకృతి రమణీయతకు ఆలవాలంగా చెప్పుకోవ‌చ్చు. అరకులోయ కేవలం పర్యాటక కేంద్రంగానే కాదు.. లొకేషన్ల పరంగా సినిమా షూటింగ్‌ల‌కు కూడా ఎంత‌గానో ప్ర‌సిద్ధిచెందింది. ఈ సెల‌వుల్లో కుటుంబంతో పాటు స‌ర‌దాగా విహ‌రించేందుకు ఈ ప్ర‌దేశం ఎంతో అనువైన‌ది.

rkbeach

అరకు టూర్ షెడ్యూల్ వివ‌రాలిలా ఉన్నాయి..

Araku Tour - Telangana Tourism పేరుతో ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది.
ఈ టూర్ ప్యాకేజీ ప్రతి బుధవారం తేదీల్లో ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ మొత్తం నాలుగు రోజుల‌పాటు ఉంటుంది. ఈ టూర్‌లో భాగంగా అన్నవరం, సింహాచలం, వైజాగ్, ఆర్కే బీచ్, కైలాసగిరి, అరకులోని బొర్రా గుహలు, అనంతగిరి వంటి ప్ర‌సిద్ధిచెందిన ప్రాంతాల‌ను చూడొచ్చు. ఈ రోడ్ జ‌ర్నీ బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని పర్యాటక భవన్ నుంచి ప్రారంభ‌మ‌వుతుంది.

annavaram1

మ‌రుస‌టి రోజు ఉద‌యం ఆరు గంట‌ల‌కు వైజాగ్ చేరుకుంటారు. విశాఖ‌ప‌ట్నంలోని హోట‌ల్‌లో చెకిన్ అయిన త‌ర్వాత సింహాచలం, కైలాసగిరి, రిషికొండ ప‌ర్య‌ట‌న ఉంటుంది. వీటితో పాటు వైజాగ్‌లో ప్ర‌సిద్ధిచెందిన బ్ మైరైన్ మ్యూజియంను సందర్శన కూడా చేయొచ్చు. అనంతం అదే రోజు సాయంత్రం వైజాగ్ బీచ్‌లో కాసేపు స‌రదాగా గ‌డిపేయొచ్చు.
ఆ రోజు రాత్రంతా వైజాగ్ లోనే బస ఉంటుంది.

arakuvalley

అర‌కులోని ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశాలు..

ఆ మ‌రుస‌టి రోజు ఉద‌యం ఆరుగంట‌ల‌కు అర‌కు ప‌ర్య‌ట‌న ఉంటుంది. అర‌కు రోడ్డు ప్ర‌యాణం చాలా బాగుంటుంది. చుట్టూ ప‌చ్చ‌ని ప్ర‌కృతి అందాలు ప‌ర్యాట‌కులకు సాద‌ర ఆహ్వానం ప‌లుకుతాయి. ఈ జర్నీ ఎంతో ఆహ్లాదభ‌రితంగా ఉంటుంది. అరకులో ఉంటే ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి, కాఫీ ప్లానిటేషన్, బొర్రాగుహ‌ల‌తో పాటు అక్క‌డి ప్ర‌జ‌లు చేసే ధింసా నృత్యాల‌ను కూడా వీక్షించొచ్చు. రాత్రి అరకులోనే బ‌స ఉంటుంది. ఇక‌, నాలుగోరోజు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అన్న‌వ‌రం చేరుకుంటారు.

అన్న‌వ‌రం స్వామి ద‌ర్శ‌నం అనంత‌రం హైద‌రాబాద్ తిరుగు ప్ర‌యాణం ఉంటుంది. ఐదో రోజు ఉదయం 7 గంటల‌కు హైదరాబాద్ చేరుకోవటంతో ఈ అర‌కు టూర్ ప్యాకేజీ ముగుస్తుంది. నాన్ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది. బ‌స్సు టికెట్ ధరల విష‌యానికొస్తే పెద్దవారికి రూ. 6,999 చెల్లించాలి. పిల్ల‌ల‌క‌యితే రూ. 5.599గా నిర్ణయించారు. మ‌రెందుకాల‌స్యం హైద‌రాబాద్ టు అర‌కు టూర్ ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టండి మ‌రీ...

More News

    Read more about: vizag andhrapradesh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+