Search
  • Follow NativePlanet
Share
» »ఈ సీజ‌న్‌లో హ‌నీమూన్ వెళ్లేందుకు దేశంలోని బెస్ట్ ప్లేస్‌లు..

ఈ సీజ‌న్‌లో హ‌నీమూన్ వెళ్లేందుకు దేశంలోని బెస్ట్ ప్లేస్‌లు..

ఇప్ప‌డు పెళ్లిళ్ల సీజ‌న్ న‌డుస్తోంది. పెళ్లి త‌ర్వాత హానీమూన్‌కు వెళ్లేందుకు కొత్త జంట‌లు ప్ర‌దేశాలను ఎంచుకునే ప‌నిలో ప‌డ‌తారు. అయితే, ఇది వింట‌ర్ సీజ‌న్. ఈ శీతాకాలంలో హానీమూన్‌కు వెళ్లాల‌నుకునే జంట‌లు చాలామంది విదేశాల‌కు ప్లాన్ చేస్తుంటారు. రొమాంటిక్ ప్లేస్‌లన‌గానే చాలామందికి విదేశాలే గుర్తుకొస్తుంటాయి. కానీ, మ‌న‌దేశంలో కూడా రొమాంటిక్ హ‌నీమూన్ ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి.

హ‌నీమూన్‌కు వెళ్లేందుకు దేశంలో ప్రసిద్ధిచెందిన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో మీ భాగ‌స్వామితో క‌లిసి స‌మ‌యం గడ‌పొచ్చు. రొమాంటిక్ హ‌నీమూన్ ప్ర‌దేశాల‌ను ఎంచుకోవడం కాస్త క‌ష్టంతో కూడుకున్న ప‌నే అని చెప్పుకోవాలి. వింట‌ర్‌లో హ‌నీమూన్‌కు వెళ్లే ప్ర‌దేశాలేంటో ఓసారి చూద్దాం..

darjeeling2

డార్జిలింగ్

కాంచన్‌జంగాలోని మంచు శిఖరాలు, అందమైన తేయాకు తోటలు, రుచికరమైన కొండ వంటకాలకు ప్ర‌సిద్ధిచెందింది ఈ ప్ర‌దేశం. అంతేకాదు ఈ ప్రాంతం హ‌నీమూన్‌కు కూడా ఎంత‌గానో పేరుగాంచింది. ప్రతి సంవత్సరం డార్జిలింగ్‌కు అనేక మంది పర్యాటకులు త‌ర‌లివ‌స్తుంటారు. ప్రకృతి ప్రేమికులు టీని ఇష్టపడే వారైతే త‌ప్ప‌కుండా డార్జిలింగ్‌ను సందర్శించొచ్చు. హనీమూన్‌కు ఇంతకంటే మంచి ప్రదేశం మ‌రొక‌టి ఏముంటుందో చెప్పండి. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్‌లు కూడా తమ హనీమూన్ వెకేష‌న్‌ను ఇక్కడే జరుపుకున్నారట.

ఇక‌, ఎంతోమంది సెల‌బ్రిటీలు సైతం ఎంతో ఇష్ట‌ప‌డే ప్ర‌దేశం ఇది. సిమ్లా-మనాలీ వంటి పర్వతాలకు దూరంగా ఒక ప్రత్యేక ప్రదేశంలో హనీమూన్ జరుపుకోవాల‌నుకునే వారికి డార్జిలింగ్ ఉత్త‌మ ప్ర‌దేశం అని చెప్పుకోవాలి. ఇక్క‌డి చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో మీ భాగ‌స్వామితో క‌లిసి స‌రదాగా గ‌డిపేయొచ్చు. డార్జిలింగ్ లోని ఎత్తైన శిఖరం 'టైగర్ హిల్' ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా పేరుగాంచింది.

లాచెన్

సిక్కిం ఉత్తర భాగంలో ఉన్న లాచెన్ ప్ర‌దేశం కొత్త జంట‌లు సంద‌ర్శించేందుకు ఎంతో ఉత్త‌మ‌మైన ప్ర‌దేశ‌మ‌ని చెప్పుకోవాలి. లాచెన్‌లోని తంగు లోయ 3950 మీటర్ల ఎత్తులో 13000 అడుగుల ఎత్తులో ఉంటుంది. గురుడోంగ్మార్ సరస్సు, చోప్టా సరస్సుకు వెళ్లే మార్గంలో ఈ లోయ‌లోని అందాల‌ను ప్ర‌త్య‌క్షంగా చూడొచ్చు. ఈ ప్ర‌దేశాన్ని సంద‌ర్శించేందుకు ఉత్త‌మ స‌మ‌యం అక్టోబర్ నుంచి మార్చి. ఈ ప్ర‌దేశం చైనాకు స‌మీపంలో ఉంటుంది. అయితే, కేవ‌లం ఇక్క‌డికి భార‌తీయుల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంది.

తెల్ల‌టి మంచుతో క‌ప్ప‌బ‌డిన ప‌ర్వ‌తాలు ఈ లోయ అందాల‌ను మ‌రింత రెట్టింపుచేస్తాయి. ఇది ఆల్పైన్ పీఠభూమి వద్ద ఉంది. ఇది చోప్తా వ్యాలీ, ముగుతాంగ్‌లకు ట్రెక్ మార్గాల గుండా ప్ర‌యాణం చేయ‌వ‌ల‌సి ఉంటుంది. ఇక్క‌డికి స‌మీపంలో ఉండే చోప్తా గ్రామాన్ని కూడా ప‌ర్యాట‌కులు సందర్శించ‌వ‌చ్చు. ఈ లోయ పైకి వెళ్లే కొద్ది చెట్ల వ‌రుస‌ల దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది.

tawang

తవాంగ్

తవాంగ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణం. ఇది రాష్ట్ర రాజధాని ఇటానగర్ నుండి వాయవ్యంగా 448 కిలోమీటర్ల దూరాన సుమారు 3,048 మీటర్ల ఎత్తున ఉంటుంది. ఈ ప్రదేశం దాని సహజ సౌందర్యానికి ఎంత‌గానో పేరుగాంచింది. అంతేకాదు, సాంస్కృతిక వారసత్వానికి కూడా ఈ ప్ర‌దేశం ప్ర‌సిద్ది చెందింది. ఈ నగరంలో తవాంగ్ మఠం కూడా ఉంది. ఇది భారతదేశంలో అతిపెద్ద మఠం.

తవాంగ్ సందర్శనకు ఉత్తమ సమయం శీతాకాలం. హనీమూన్ ప్ర‌దేశాల‌కు కూడా ఈ ప్రాంతం ఎంతో ప్ర‌సిద్ధిచెందింది. ఇక్క‌డ ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. అందులో గోరిచెన్ శిఖరం, సెలా పాస్, తవాంగ్ మొనాస్టరీ, నురానాంగ్ జలపాతం వంటి ప్రదేశాలను తప్పక సందర్శించండి.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+