ఈ సీజన్‌లో ప్రతి ఒక్కరూ తమ శరీరాన్ని చల్లబరచడానికి ఏదోఒకటి ప్లాన్ చేస్తుంటారు. చాలామంది దీనికోసం రివర్ రాఫ్టింగ్ వంటివి ఎంచుకుంటుంటారు. ఇది సాహస ప్రియులకు ఒక మంచి ఎంపిక అని చెప్పుకోవాలి. రివర్ రాఫ్టింగ్ చేసేందుకు వేసవి కాలం ఎంతో ఉత్తమం సమయం. రివర్ రాఫ్టింగ్ అనేది వాటర్ స్పోర్ట్స్‌లో ఒకటి, దీనిని వైట్-వాటర్ రాఫ్టింగ్ అని కూడా పిలుస్తారు. సాహసాలను ఇష్టపడే వారు తమ జీవితంలో ఒక్కసారైనా రివర్ రాఫ్టింగ్‌ని తప్పకుండా ఆస్వాదించాలని అనుకుంటారు.
ఈ సెలవులను బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం రివర్ రాఫ్టింగ్ తప్పకుండా ప్రయత్నించవచ్చు. వేసవి కాలంలో, నది నీటి మట్టం పెరిగినప్పుడు.. రివర్ రాఫ్టింగ్ చేయడం ఎంతో ఆనందంగా, ఆహ్లాదభరితంగా ఉంటుంది. రివర్ రాఫ్టింగ్ సాహసాలకు భారత్‌లో ప్రసిద్ధి చెందిన నగరాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి వైట్ వాటర్ రాఫ్టింగ్ ఆనందించవచ్చు. భారతదేశంలో రాఫ్టింగ్ కోసం ప్రసిద్ధి చెందిన నగరాల గురించి ఇప్పడు తెలుసుకుందాం.

రిషికేశ్, ఉత్తరాఖండ్
రిషికేశ్ గంగా నది ఒడ్డున ఉన్న ఒక అందమైన నగరం. రివర్ రాఫ్టింగ్ రాజధానిగా కూడా రిషికేష్‌ను పిలుస్తారు. గంగా నదిలో ఈ క్రీడను ప్రయత్నించాలనుకునే చాలామంది పర్యాటకులు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ రాఫ్టింగ్ సమయంలో వివిధ రాపిడ్లను ఎదుర్కోవచ్చు. ఈ ప్రదేశం ఎంతో థ్రిల్‌గా ఉండటమే కాకుండా ప్రకృతి అందాలతో నిండి ఉంటుంది. ప్రకృతి అందాలను చూస్తు రివర్ రాఫ్టింగ్ చేయడం ఎంతో అనుభూతినిస్తుంది.
లడఖ్, జమ్మూ మరియు కాశ్మీర్
లడఖ్ పర్వతాలలో ఉన్న చాలా అందమైన నగరం. ఇక్కడి అందాలు అందరి పర్యాటకులు హృదయాల్లో ఎప్పడూ నిలిచి పోయి ఉంటాయి. లడఖ్‌లో ప్రవహించే జంస్కర్ నదిపై రాఫ్టింగ్ చేయడం ఎంతో అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. ఇక్కడ అందమైన ఘాట్‌లు మరియు చల్లని నీటి నదిలో రాఫ్టింగ్ చేయడమంటే ఓ సవాలనే చెప్పుకోవాలి. అంతేకాదు, ఇది ఎంతో థ్రిల్‌గా కూడా ఉంటుంది.

కులు-మనాలి, హిమాచల్ ప్రదేశ్
కులు-మనాలి హిమాచల్ ప్రదేశ్ లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ప్రతి సంవత్సరం ఇక్కడికి చాలా మంది ప్రజలు తమ వేసవి సెలవులను గడపడానికి వస్తుంటారు. అలాగే, ఇక్కడ ప్రవహించే బియాస్ నదిపై రాఫ్టింగ్ అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ అందమైన పర్వత దృశ్యాలు, వేగంగా ప్రవహించే నది రాఫ్టింగ్ ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి.
కూర్గ్, కర్ణాటక
కూర్గ్ హిమాచల్ ప్రదేశ్‌లోని చాలా అందమైన నగరం. ఈ ప్రదేశం కాఫీ తోటలకు ఎంతగాన ప్రసిద్ధిచెందింది. ఇక్కడ బారాపోల్ నదిపై రాఫ్టింగ్ చేయడమంటే పర్యాటకులకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. మేఘాలు కప్పబడిన పర్వతాల మధ్య రాఫ్టింగ్ చేయడం ఓ మంచి అనుభూతి. ఇక్కడి ప్రకృతి అందాలు పర్యాటకులను ఇక్కడినుంచి కదలనివ్వవు.

డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్
పశ్చిమ బెంగాల్‌లో ఉన్న డార్జిలింగ్ నగరం టీ తోటలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ తీస్తా, రంగీత్ నదులపై రాఫ్టింగ్ ప్రకృతి ప్రేమికులకు, సాహస ప్రియులకు ఓ గొప్ప ఎంపిక. ఇక్కడ రాఫ్టింగ్ సమయంలో పచ్చని అడవులు, పర్వతాలను ఆస్వాదించొచ్చు.
కోలాడ్, మహారాష్ట్ర
కోలాడ్, ముంబై పూణే సమీపంలో ఉన్న ఒక పట్టణం. మహారాష్ట్రలోని ప్రధాన పర్యాటక ప్రదేశాలలో ఇది ఒకటి. కోలాడ్ కుండలికా నదిపై తెప్పకు ఎంతో ప్రసిద్ధిచెందింది. ఇక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ రాఫ్టింగ్ చేయొచ్చు.



Click it and Unblock the Notifications














