Search
  • Follow NativePlanet
Share
» »మురుద్ జంజీరా - ఒక అద్భుతమైన మెరైన్ కోట !

మురుద్ జంజీరా - ఒక అద్భుతమైన మెరైన్ కోట !

మురుద్ జంజీరా కోట పూర్తిగా ఒక సముద్రపు కోట. దీనిని రాజపురి జెట్టి ద్వారా చేరాలి. ఈ కోట అనేక కోట బురుజులు మరియు ఫిరంగులు కలిగి ఉంటుంది. నేటికి అవి చెక్కు చెదరలేదు.

By Mohammad

మహారాష్ట్రలోని రాయ్ ఘడ్ జిల్లాలో మురుద్ ఒక కోస్తా గ్రామం. మురుద్ జంజీరా అక్కడ ప్రసిద్ధి చెందిన ఒక ఓడరేవు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని సిద్ధి రాజవంశం పాలించింది. మరాఠాలు, పోర్చుగీస్, డచ్ మరియు ఇంగ్లీష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీ వంటివారు ఎంతమంది దీనిపై దాడులు చేసినప్పటికి ఈ కోట మాత్రం ఏ రకంగాను నష్టపోలేదు.

జంజీరా అనే మాట మన భారతదేశ భాష కాదు. దీని మూలం అరబ్బీ భాషలో ఉంది. జంజీరా అంటే అరబ్బీలో ద్వీపం అయి అర్ధం. మురుద్ అనే పదం మరాఠి భాష నుండి వచ్చింది. ఈ పదం కొంకణిలో పుట్టిన మోరోద్ అనే పదానికి సంబంధించినది. కొంకణి మరియు అరబ్బీ భాషల సమ్మేళనంగా మోరద్ మరియు జజీరా అనేవారు.

మురుద్ జంజీరా

మురుద్ జంజీరా

చిత్రకృప : Orderinchaos

చాలామంది ఈ కోటను జల్ జీరా అని కూడా అనేవారు. దీనికి కారణం ఈ ద్వీపం చుట్టూ అరేబియా మహా సముద్రం ఉండటమే. ఛత్రపతి శివాజి మహరాజ్ ఈ కోటను స్వాధీనం చేసుకునేందుకు ఆరు సార్లు ప్రయత్నించాడు. కాని ఏ ఒక్కసారి విజయం సాధించలేకపోయాడు.

ఖొడాల- ముంబై వారాంతపు ట్రెక్కింగ్ విహారం !

మురుద్ జంజీరాలో తప్పక చూడదగినవి ఏమిటి?

మురుద్ జంజీరా కోట

మురుద్ జంజీరా కోట పూర్తిగా ఒక సముద్రపు కోట మరియు పెద్దది. దీనిని 16వ శతాబ్దంలో నిర్మించారు. దీనిని రాజపురి జెట్టి ద్వారా చేరాలి. కోట చుట్టూ అరేబియా సముద్రం ఉంటుంది. ఈ కోట అనేక కోట బురుజులు మరియు ఫిరంగులు కలిగి ఉంటుంది. నేటికి అవి చెక్కు చెదరలేదు.

దుర్భేద్యమైన కోటగోడలు

దుర్భేద్యమైన కోటగోడలు

చిత్రకృప : Damitr

కోట ఆవరణలో ఒక మసీదు, అనేక భవనాలు మరియు పెద్ద వాటర్ ట్యాంక్ ఉంటాయి. కోట కలపతో నిర్మించారు. శత్రువులనుండి రక్షణకు అవసరమైన ఆయుధ గిడ్డంగులు కూడా ఇక్కడ ఉంచేవారు. అరేబియా సముద్రం మధ్య ఉన్నప్పటికి దాని ఉప్పు గాలులు తగిలినప్పటికి కోట చెక్కు చెదరలేదు.

మురుద్ బీచ్

మహారాష్ట్రలో మురుద్ బీచ్ ప్రసిద్ధి గాంచినది. ఇది మురుద్ జంజీరా గ్రామం వద్ద కలదు. సుమారు 1.75 కి.మీ.ల పొడవున ఇది వ్యాపించి ఒక కంఠ హారం వలే ఉంటుంది. బీచ్ పొడవునా తెల్లటి ఇసుక మరియు స్వచ్ఛమైన నీరు పర్యాటకులకు, స్ధానికులకు ఆనందం కలిగిస్తాయి.

మురుద్ బీచ్ వద్ద పర్యాటకులు

మురుద్ బీచ్ వద్ద పర్యాటకులు

చిత్రకృప : Tomas Belcik

ఇక్కడి వాతావరణం ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. చల్లని సముద్రపు నీటి గాలులు మీ ఇంద్రియాలను ఆహ్లాదపరుస్తాయి. సోమరిగా కూర్చొని, పూర్తి విశ్రాంతి పొందాలనుకునే వారికి ఇది చక్కని ప్రదేశం. ఈ బీచ్ సందర్శకులకు మరచిపోలేని అనుభవాలను అందిస్తుంది. సమీపంలో కల పాంచాల కోట కూడా చూడదగినదే.

పన్హాలా హిల్ స్టేషన్ - అద్భుతం, ప్రశాంతం !

దత్తాత్రేయ స్వామి దేవాలయం

ఆధ్యాత్మికులకు ఈ ప్రాంతంలో దత్తాత్రేయ స్వామి దేవాలయం కలదు. దేవాలయంలోని విగ్రహం ఎంతో అందంగా ఉంటుంది. మూడు తలలు కలిగి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను తలపిస్తూంటుంది. ఈ దేవాలయాన్ని స్వామి బ్రహ్మేంద్ర కనుగొన్నారు. ఆయన అనేక శతాబ్దాల కిందట అక్కడి లోయలో ఒక పాదుకను కూడా కనుగొన్నారు. ఆ పాదుకను నేటికి భక్తులు పూజిస్తూంటారు.

తమ్హిని జలపాతాలు

తమ్హిని జలపాతాలు

చిత్రకృప : Ankur P

గారంబి డ్యామ్

గారంబి డ్యామ్ నవాబ్ సర్ సిద్ది అహ్మద్ ఖాన్ చే నిర్మించబడింది. మురుద్ జంజీరా పట్టణానికి, చుట్టుపట్ల ప్రదేశాలకు పూర్తి నీటి సరఫరా గారంబి డ్యామ్ నుండే జరుగుతుంది. ఈ ప్రదేశం మీ విలువైన సమయాన్ని కుటుంబ సభ్యులతో కలసి అంతకంటే విలువతో ఆనందించేందుకు సూచించదగినది. మురుద్ జంజీరాలో తగిన వసతి సౌకర్యాలు కలవు. హోటళ్ళ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

మురుద్ జంజీరా రోడ్డు మార్గం

మురుద్ జంజీరా రోడ్డు మార్గం

చిత్రకృప : Tomas Belcik

మురుద్ జంజీరా ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : 145 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం లో దిగి క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి కోట చేరుకోవచ్చు.

రైలు మార్గం : కొంకణ్ రైల్వే లోని రోహా రైల్వే స్టేషన్ మురుద్ జంజీరా కు సమీపాన కలదు. స్టేషన్ నుండి కోట చేరుకోవటానికి గంట సమయం పడుతుంది.

బస్సు / రోడ్డు మార్గం : ముంబై నుండి తరచూ మురుద్ జంజీరా కు ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు నడుస్తుంటాయి. పూణే, కళ్యాణ్ నుంచి కూడా బస్సులు తిరుగుతుంటాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+