Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» అహ్మద్ నగర్

అహ్మద్ నగర్ - పురాతన కోటలు, సరస్సులు, జలపాతాలు

23

మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో అహ్మద్ నగర్ ఒక పట్టణం. మహారాష్ట్రలో అహ్మద్ నగర్ జిల్లా పెద్దది ఇది సిన్హా నది పడమటి ఒడ్డున ఉంది. అహ్మద్ నగర్ మహారాష్ట్ర నడిబొడ్డున ఉంది. కనుక పూనే మరియు ఔరంగాబాద్ లనుండి సమాంతర దూరం కలిగి ఉంటుంది. ఔరంగాబాద్ దీనికి నాసిక్ పక్కగా ఉత్తర దిశగా ఉంటుంది. పూనే దీనికి దక్షిణంగా సోలాపూర్ జిల్లాకు పక్కగా ఉంటుంది. తూర్పువైపు బీడ్ మరియు ఉస్మానాబాద్ జిల్లా మరియు పడమటి  వైపున ధానే ఉంటాయి.  

చారిత్రక విశిష్టత అహ్మద్ నగర్ పట్టణానికి షుమారు అర్ధ  సహస్రాబ్ది చరిత్ర కలదు. సుమారుగా 1490 ల నాటిది. అహ్మద్ నిజాం షా అనే రాజు అహ్మద్ నగర్ ను 1494 లో స్ధాపించాడు. కనుక ఈ జిల్లా ఆ దాని వ్యవస్ధాపకుడి పేరుపై వ్యవహరించబడుతోంది. నిజామి షాహి రాజవంశానికి చెందిన అహ్మద్ నిజాం షా ఈ జిల్లాను స్ధాపించాడు అతని తర్వాత సుమారు 150 సంవత్సరాలకు ఈ పట్టణాన్ని మొగలాయీ పాలకుడు షాజహాన్ 1636 లో స్వాధీన పరచుకున్నాడు.   అహ్మద్ నగర్ తర్వాతి కాలంలో పేష్వాలు మరియు మరాఠాల పాలనలోకి సుమారు 1759 సంవత్సరంలో వచ్చింది.

వీరి తర్వాత దీనిని దౌలత్ రావ్ సింధియా అనే మరాఠా రాజు పాలించాడు. బ్రిటీష్ ప్రభువు లార్డ్ వెలస్లీ నాయకత్వం క్రింద బ్రిటీష్ వారు 1817 లో జరిగి పూనా ఒప్పందం కింద అహ్మద్ నగర్ ను చివరగా గెలుచుకున్నారు.  మొగలాయీ పాలనలో చివరివాడైన ఔరంగజేబ్ తన చివరి సంవత్సరాలను ఈ ప్రదేశంలో గడిపాడు. అహ్మద్ నగర్ లోని ఒక చిన్న స్మారంకం ఔరంగజేబు ఈ ప్రాంతాన్ని పాలించినట్లు సూచిస్తుంది.  

అహ్మద్ నగర్ లో పర్యాటక ఆకర్షణలు అహ్మద్ నగర్ కోట పట్టణంలో ప్రధాన ఆకర్షణ. ఇది అహ్మద్ నిజాం షా దౌలతాబాద్ కోట స్వాధీనాన్ని సూచిస్తుంది. ఈ కోట మన దేశ స్వాతంత్రం కొరకు పోరాడిన జాతీయ నాయకులకు ఒకప్పుడు జైలుగా గూడా ఉపయోగపడటం ఒక విశేషంగా చెప్పవచ్చు.  ఈ కోటలో ఎంతో ఖ్యాతికెక్కిన మన దేశ నాయకులైన జవహర్లాల్ నెహ్రూ వంటి నేతలను వారు ఆచరించిన క్విట్ ఇండియా మూవ్ మెంట్ సమయంలో జైలుపాలయ్యారు.

సలాబత్ ఖాన్ సమాధి, బాగ్ రౌజా మరియు కోట్ బాగా నిజాం వంటివి తప్పక చూడదగిన మరికొన్ని చారిత్రక ప్రదేశాలు.   అహ్మద్ నగర్ లో మతపరంగా చూడవలసిన ప్రదేశాలు కూడా కలవు. మొహతా దేవి దేవాలయం, సిద్దేశ్వర్ దేవాలయం, శ్రీ విశాల్ గణపతి దేవాలయం మరియు సంత్ ధ్యానేశ్వర్ దేవాలయం వంటివి మీలోని భక్తి భావాలను మరియు మతపర అంశాల ఆసక్తిని వెలికి తీస్తాయి.

దీనికి సమీపంలోనే అందరూ ఆరాధించే ప్రవక్త షిర్డి సాయిబాబా నివసించిన పవిత్రమైన షిర్డి గ్రామం మరియు దానికి సమీపంగా అందరికి ఎంతో ప్రధానంగా అనిపించే శని సింగణాపూర్ గ్రామం ఉన్నాయి.

మీలోని  చారిత్రాత్మక ఔత్సాహికుడు అన్వేషించే ఒక చారిత్రక మ్యూజియం మరియు రీసెర్చి సెంటర్ కూడా ఇక్కడ చూడవచ్చు. ఇక్కడకల ట్యాంకుల మ్యూజియం ప్రపంచ చరిత్ర అధ్యాయాలలో జరిగిన వివిధ ప్రధాన యుద్ధాలలో ఏ రకమైన యుద్ధ ట్యాంకులు ఉపయోగించారనేది చూపే అద్భుత మ్యూజియంగా ఉంటుంది.

ప్రకృతి ప్రేమికులు ఇక్కడకల ముల్లా డ్యామ్ మరియు భందర్దర డ్యామ్ లను బాగా ఆనందిస్తారు. ఈ రెండు సహజ సౌందర్యాలు మీ ఇంద్రియాలను ఎంతో ఆనందపరుస్తాయి. మీరు కనుక మీ కుటుంబ సభ్యులతో వచ్చినట్లయితే, ఈ ప్రదేశాలు మీకు ఎంతో ఆనందమయ కాలక్షేపాన్ని అందిస్తాయి.

మరికొన్ని ప్రత్యేకతలు అహ్మద్ నగర్ వాతావరణం సంవత్సరంలో చాలా భాగం ఒకమోస్తరు ఆహ్లాదంగానే ఉంటుంది. ఇక్కడి వాతావరణం ప్రధానంగా పొడిగాను వేడిగాను ఉంటుంది. కనుక వేసవిలో ఈ ప్రాంత సందర్శన సూచించదగినదికాదు. ఎండవేడిమికి ప్రదేశాలపట్ల ఆసక్తి తక్కువగా ఉంటుంది. వేసవిలో సందర్శించినప్పటికి రోజులో అధిక భాగం మీరు హోటల్ గదులలోనే గడపవలసి వస్తుంది.

వర్షాకాలంలో వర్షాలు చెదురుమదురుగా పడతాయి. కనుక పర్యటనకు అనుకూలమే. అయితే, శీతాకాలం అంటే షుమారుగా అక్టోబర్ నుండి మార్చి వరకు అనుకూలమైన వాతావరణంతో పర్యటనలకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.

అహ్మద్ నగర్ దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు, పట్టణాలకు మంచి విమాన, రైల్వే, రోడ్డు మార్గాల ద్వారా కలుపబడింది. మహారాష్ట్రలోని అన్ని ప్రాంతాలనుండి అతి తక్కువ సమయంలో ఈ పట్టణానికి చేరుకోవచ్చు. మీరు విమాన ప్రయాణం కోరే వారైతే, పూనే ఎయిర్ పోర్ట్ సమీపంగా ఉంటుంది. రైలు ప్రయాణం చేయాలంటే, అహ్మద్ నగర్ రైలు స్టేషన్ ప్రతిరోజూ రైలు సర్వీసులు కలిగి ఉంది. ఇక బస్ ప్రయాణ విషయానికి వస్తే, పూనే లేదా ముంబైల నుండి అహ్మద్ నగర్ 4 లేదా 5 గంటల ప్రయాణంలో బస్ లపై తక్కువ ఛార్జీలలో సౌకర్యవంతంగా  చేరవచ్చు.   

అహ్మద్ నగర్ కు సుమారుగా 500 సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలదు. ఈ పట్టణం ఎన్నో శిధిల స్మారక చిహ్నాలు కలిగి ఉంటుంది. పురాతన కోటలు, సరస్సులు మరియు జలపాతాలు, డ్యాములు ఎన్నో ఉంటాయి. మీరు కనుక పూనే లేదా ఔరంగాబాద్ పట్టణాలకు సందర్శన ప్లాన్ చేస్తే, అహ్మద్ నగర్ కూడా అదే సమయంలో తేలికగా చూడవచ్చు. ఆసక్తికల పర్యాటకులకు ఈ పట్టణంలో చూడదగిన ప్రాంతాలు అనేకం కలవు. ఇంత అద్భుతమైన ప్రదేశాన్ని పర్యాటనపట్ల ఆసక్తి కలవారు తప్పక చూడాలి.

అహ్మద్ నగర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

అహ్మద్ నగర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం అహ్మద్ నగర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? అహ్మద్ నగర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం అహ్మద్ నగర్ కు మహారాష్ట్ర ప్రభుత్వం అనేక నగరాలనుండి ప్రభుత్వ బస్సులు నడుపుతోంది. ప్రయివేటు వాహనాలు కూడా కలవు. ముంబై నుండి రోడ్డు మార్గంలో సుమారు 258 కి.మీ.లు ఉంటుంది. చేరేందుకు సుమారుగా 4 గంటల సమయం మాత్రమే పడుతుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం అహ్మద్ నగర్ రైలు ప్రయాణానికి ఎంతో సౌకర్యమైనది. దేశంలోని ప్రధాన నగరాలు పట్టణాలు దీనికి కలుపబడ్డాయి. షిర్డి, ముంబై (దాదర్), పూనే మరియు ఇతర అనేక నగరాలనుండి అహ్మద్ నగర్ సౌకర్యవంతంగా రైలులో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    అహ్మద్ నగర్ ఎలా చేరాలి? విమాన ప్రయాణం అహ్మద్ నగర్ కు సుమారు 113 కి.మీ.ల దూరంలో పూనే లోహేగాంవ్ విమానాశ్రయం స్ధానిక విమానాశ్రయం. ముంబై లోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయం సమీప అంతర్జాతీయ విమానాశ్రయం.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat