రెండు తెలుగురాష్ట్రాల్లో దసరా సంబురాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి అమ్మవారి అలంకారాలు మొదలవుతాయి. ఇక, ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని తొమ్మిది రకాలుగా అలంకరిస్తారు. ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ దసరా పండుగను దేశవ్యాప్తంగా అందరూ జరుపుకుంటారు. కానీ, ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఈ పండుగలు నిర్వహించుకుంటారు. ఇక, ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించేశారు. ఈ సెలవుల్లో దసరా పండుగ సందర్భంగా దేశంలో సందర్శించేందుకు అనేక ప్రదేశాలు పర్యాటకులకు స్వాగతం పలుకుతున్నాయి. దేశంలోని ఈ ప్రాంతాల్లో శరన్నవరాత్రుల పేరుతో నిర్వహించే ప్రతి వేడుకకు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. దేవి నవరాత్రుల వేళ దేశంలోని ఈ ప్రాంతాలను తప్పకుండా సందర్శించాల్సిందే.

కోల్‌కతా
దసరా ఉత్సవాల్లో దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రదేశాలలో పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కత్తా ఒకటి. బెంగాల్ వాసులు ఈ పండుగను దుర్గా పూజ అని పిలుస్తారు. ఇక్కడివారు దుర్గాపూజను పుజొ పేరుతో జరుపుకుంటారు. దసరా వేళ కోల్‌కతా నగరమంతా అమ్మవారి విగ్రహాలతో ముస్తాబయ్యి ఉంటుంది. ఇక్కడ ప్రతిష్టించే అమ్మవారి విగ్రహాల కోసం పెద్ద పెద్ద మండపాళ్లను కూడా తయారు చేస్తారు. ఈ మండపాలను ఇక్కడివారు పెండాళ్లు అంటారు. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క మండపానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ 'బొనెది బరీ' పేరుతో కోల్‌కతాలో ఉండే రాజభవనాల్లో అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. వాటికి ప్రత్యేక పూజలు కూడా చేస్తారు.
ఛత్తీస్‌గఢ్
దసరా పండుగను తొమ్మిది రోజులు ఎంతో భక్తి శ్రద్దలతో అమ్మవారిని పూజిస్తారు. అయితే, ఛత్తీస్‌గఢ్‌లోని ఆదివాసీలు మాత్రం ఈ దసరా పండుగను సుమారు 75 రోజుల పాటు చేసుకుంటారు. జగదల్‌పూర్‌లోని బస్తర్ గిరిజనులు దసరా పండుగను ప్రకృతి ఆరాధనగా పూజిస్తారు. ఇక్కడ దంతేశ్వరి దేవి కొలువైంది. ఈమె ఇక్కడి బస్తర్ గిరిజనుల దేవత. అందుకే ఈ దేవీమాతను ఇక్కడివారు ఎంతో భక్తి తో పూజిస్తారు. ఈ 75 రోజుల్లో పాత కచనగాడి, నిషా జాతర వంటి అనేక ఆచారాలను కూడా పాటిస్తారు. నిర్వహిస్తారు.

గుజరాత్
నవరాత్రుల్లో మరో ముఖ్యమైన ప్రదేశం గుజరాత్. ఇక్కడ నవరాత్రి వేడుకలను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఇక్కడి హాలెరి రాజుల ఆధిపత్య చరిత్రలో దసరా పండుగకు ప్రత్యేక స్థానం ఉన్నట్లు ఇక్కడివారు చెబుతున్నారు. దసరాను ఇక్కడ మరియమ్మ పండుగ అని పిలుస్తారు. ఇక్కడ దసరా రోజున ప్రదర్శించే గర్బా నృత్యం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. ఈ సమయంలో ఇక్కడివారంతా డోలు బాజాలు వాయిస్తూ రంగు రంగుల దుస్తుల్లో కళాకారులు నృత్యాలు ప్రదర్శిస్తుంటారు. అమ్మవారికి నిర్వహించే 'గుజరాతీ హారతి' నృత్యం ఇక్కడ ఎంతో ప్రత్యేకత అని చెప్పుకోవాలి.

రాజస్థాన్
నవరాత్రులకు ప్రసిద్ధిచెందిన మరో ప్రదేశం రాజస్థాన్. ఇక్కడ కోటాలో దసరా వేడుకలు అత్యంత పేరుగాంచాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం 25 రోజులు దసరా ఉత్సవాలు చేసుకుంటారు. నగరంలోని దసరా 'మేళా' మైదానంలో ఒక జాతరను కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తారు. జాతర సందర్భంగా లక్షలాది మంది సందర్శకులు, భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. అంతేకాదు, పండుగ ముగింపు సమయంలో ఇక్కడివారు సంప్రదాయ దుస్తులు ధరించి రావణ విగ్రహాలను కాల్చి వేస్తారు. ఈ జాతర చంబల్ నది ఒడ్డున జరుగుతుంది.



Click it and Unblock the Notifications













