Search
  • Follow NativePlanet
Share
» »ఆరు రోజుల‌పాటు జ‌రిగే ఊటీ ఫ్ల‌వ‌ర్ ఫెస్టివ‌ల్ విశేషాలు మీకోసం..!

ఆరు రోజుల‌పాటు జ‌రిగే ఊటీ ఫ్ల‌వ‌ర్ ఫెస్టివ‌ల్ విశేషాలు మీకోసం..!

త‌మిళనాడులో ప్ర‌సిద్ధిచెందిన ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు ఎన్నో ఉన్నాయి. ఇక్క‌డ అనేక జ‌ల‌పాతాలు, పురాత‌న క‌ట్ట‌డాలు, చారిత్ర‌క నేప‌థ్యం ఉన్న దేవాల‌యాల వంటివి మ‌రెన్నో ఉన్నాయి. ఇంకా ఇక్క‌డ ప‌ర్యాట‌కులు వీక్షించేందుకు అనువైన ప్ర‌దేశాలు కూడా ఉన్నాయి. త‌మిళ‌నాడులోని ప్ర‌సిద్ధిచెందిన హిల్‌స్టేష‌న్ ఊటీ. ఇది ప‌ర్యాట‌కులకు ఎంతో ఇష్ట‌మైన ప్రాంతం. ఇక్క‌డ ప్ర‌కృతి అందాలు ప‌చ్చ‌ని తివాచీ ప‌ర‌చిన‌ట్లు ఉంటాయి.

ఊటీలో ప్ర‌తి సంవ‌త్సరం ఈ సీజ‌న్‌లో ఫ్లవర్ ఫెస్టివల్ జ‌రుగుతుంది. ఇది దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన స్థానిక పండుగలలో ఒకటిగా పేరుగాంచింది. ఈ ఫ్ల‌వ‌ర్ ఫెస్టివ‌ల్‌లో పాలుపంచుకునేందుకు కేవ‌లం భార‌త‌దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ప్ర‌జ‌లు త‌ర‌లి వ‌స్తుంటారు. ఇక‌, ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించే రంగురంగుల పూల పండుగను ఈ ఏడాది ఈ మాసంలో నిర్వహించనున్నారు. ఊటీ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరిన‌ట్ల‌యితే త‌ప్ప‌కుండా ఊటీ ఫ్ల‌వ‌ర్‌ ఫెస్టివ‌ల్‌ను ఆస్వాదించాల్సిందే..

ootyflowerfestivai

150 కి పైగా రకాల పువ్వులు..

ఊటీలో ఫ్లవర్ ఫెస్టివల్ అనేది ఎన్నో యేళ్ల నుంచి నిర్వ‌హించ‌బ‌డుతున్నారు. దీనిని 1896 సంవత్సరం నుండి జరుపుకోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తుంది. ప్రతి సంవత్సరం ఈ ఫెస్టివ‌ల్‌లో భాగంగా 150 కి పైగా రకాల పూలతో ఈ పండుగను జ‌రుపుకుంటారు. మొత్తం 250 మందికి పైగా ఈ ప్రదర్శనకు వస్తారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఇక్కడికి ఫ్లవర్ షో చూసేందుకు వస్తుంటారు. ఈ సంవత్సరం కూడా ఊటీ ఫ్లవర్ ఫెస్టివల్ 2024 ఊటీలోని బొటానికల్ గార్డెన్‌లో నిర్వహించబడుతోంది.

ఈ ఉద్యాన‌వ‌నం మధ్యలో దాదాపు 1500 కుండలను వివిధ జాతుల పూలతో అలంకరిస్తారు. ఇవి వేసవి కాలంలో కూడా సువాసనను వెదజల్లుతూ ఉంటాయి. ఈ పుష్పాలకు ఆకర్షితులై ప్రతి సంవత్సరం పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ఫెస్టివ‌ల్‌తో పాటు ఇక్క‌డ ప‌ర్యాకుల ఆనందం కోసం సంగీతంతో పాటు నృత్యంతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి.

ఊటీ ఫ్లవర్ ఫెస్టివల్ ప్రారంభం...

ఈ ఏడాది జ‌ర‌గ‌బోయే ఊటీ ఫ్లవర్ ఫెస్టివల్ 2024 సుమారు ఆరు రోజుల పాటు జరగనుంది. ఈ ఫెస్టివ‌ల్ మే 17 న ప్రారంభ‌మ‌వుతుంది. మే 22న ముగుస్తుంది. ఇక్కడ అలంకరించబడిన పుష్పాలను చూడటంతోపాటు, సందర్శకులు వాటి గురించిన వివరణాత్మక సమాచారాన్ని కూడా తెలుసుకోవ‌చ్చు. ఈ పండుగ ప్రత్యేకంగా ఫోటోగ్రఫీ ప్రియులకు ఓ గొప్ప అవ‌కాశ‌మ‌నే చెప్పుకోవాలి. ఇక్కడ వారు సువాస‌ల‌ను వెద‌జ‌ల్లే పూల ప‌రిమ‌ళ‌లాల‌ను ఆస్వాదించ‌డంతోపాటు వాటి యొక్క అద్భుతమైన చిత్రాలను త‌మ కెమెరాల‌లో బంధించొచ్చు.

ootyflowerfestival

ప్ర‌వేశ ధ‌ర వివ‌రాలు..

ఊటీ ఫ్లవర్ ఫెస్టివల్‌కు హాజ‌ర‌య్యేందుకు ప‌ర్యాట‌కులు త‌ప్ప‌కుండా టిక్కెట్ల‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇవి ఆన్‌లైన్‌లో ఉద్యానవన శాఖ వెబ్‌సైట్‌లో లభిస్తాయి. దీంతో పాటు, టిక్కెట్లను టికెట్ కౌంటర్ నుండి ఆఫ్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. ఫ్లవర్ ఫెస్టివల్ కోసం పెద్దలకు టిక్కెట్ ధర రూ. 50గా నిర్ణ‌యించారు. పిల్లలకయితే టిక్కెట్ ధర రూ.30 చెల్లించాల్సి ఉంటుంది. ప్రకృతి ప్రేమికులు త‌ప్ప‌కుండా ఊటీలోని ఫ్లవర్ ఫెస్టివల్‌ను సందర్శించాల్సిందే.

ఈ ఫెస్టివ‌ల్‌ పూల ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు, సంస్కృతి ప్రేమికులు, ఫోటోగ్రాఫర్‌లకు ఓ గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. ఈ ఫ్లవర్ ఫెస్టివల్‌తో పాటు, ఊటీలో ఇంకా వివిధ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. అందులో వేసవి ఉత్సవాలు ముఖ్యం. ఫ్రూట్ షో, వెజిటబుల్ షో, రోజ్ షో మరియు స్పైస్ షో వంటివి కూడా ఉన్నాయి. మ‌రెందుకాల‌స్యం మీ ఊటీ ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టండి మరి.

More News

    Read more about: ooty tamil nadu
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+