Search
  • Follow NativePlanet
Share
» »హిల్ అఫ్ హనీ ‘తెన్మెల’హృదయాన్ని హత్తుకునే అద్భుతమైన ఆకర్షణలు

హిల్ అఫ్ హనీ ‘తెన్మెల’హృదయాన్ని హత్తుకునే అద్భుతమైన ఆకర్షణలు

ప్రకృతిలో ఒడిలో ఒదిగిపోయిన సుందరసీమ తెన్మెల. ఇండియాలో మొట్టమొదటి పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందినది. కేరళ రాష్ట్రంలో కొల్లం జిల్లాలో ఉన్నది ఈ తెన్మెల. తెన్మెల అంటే తేనె గుట్ట అని అర్థం. ఈ పేరు ఎందుక

ప్రకృతిలో ఒడిలో ఒదిగిపోయిన సుందరసీమ తెన్మెల. ఇండియాలో మొట్టమొదటి పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందినది. కేరళ రాష్ట్రంలో కొల్లం జిల్లాలో ఉన్నది ఈ తెన్మెల. తెన్మెల అంటే తేనె గుట్ట అని అర్థం. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఒకప్పుడు ఈ ప్రదేశ తేనెలకు పుట్టిల్లుగా ఉండేది, దీనికితోడు ఈ ప్రదేశం ఔషధమూలికల నిధి. నగరాల రణగొన ధ్వనులకు చాలా దూరంగా ఉండే తెన్మెల, అరణ్య జీవన సంస్కృతికీ, సమకాలీన జీవన చిత్రానికి నిలువుటద్దంగా ఉండేది.

తెన్మెల ఎన్నో అద్భుతమైన ఆకర్షణలు గలది. ఈ ప్రదేశంలో ఎంతో శోభాయమానంగా ఉండే లోయలు హృదయాల్ని ఇట్టే కట్టిపడేస్తాయి. ఎంతో సువిశాలమైన తెన్మెలను పర్యాటకుల సందర్శర్శ సౌకర్యార్థం కల్చర్ జోన్, లీజర్ జోన్, అడ్వెంచర్ జోన్ అంటూ మూడు జోన్ ల కింద విభవించారు. ఒక విలక్షణమైన అరుదైన అనుభూతిని సొంతం చేసుకోవాలనుకుంటే తెన్మెలను సందర్శించాల్సిందే...

గార్గియస్ నేచర ట్రేల్:

గార్గియస్ నేచర ట్రేల్:

ఆహ్లదకరమైన సుందర దృశ్యాల్ని చూడలనుకునే వారికి, ప్రకృతి ప్రియులకు సాహసోపేత విషయాలను తెలుసుకోవాలనే కుతూహలం కలవారికి, సంప్రదాయ విలువలకు ప్రాధాన్యం ఇచ్చే వారికి తెన్మెలలోని ఈ నేచర్ ట్రేల్ ఊహకు మించిన అనుభూతిని కలిగిస్తుంది. ఎందుకుంటే ఇక్కడ పచ్చని ప్రకృతి , పర్వతాల మీదుగా, అరణ్యాల మీదుగా వీచే ఇక్కడి గాలి హృదయాలను తన్మయత్వంతో ముంచేస్తుంది.

Photo Courtesy : Anand Osuri

తెన్మెల పరప్పర్ వంతెన:

తెన్మెల పరప్పర్ వంతెన:

లీజర్ జోన్ లోంచి నడి వెళుతున్నప్పుడు తెన్మెల పరప్పర్ వంతెన ఎదురవుతుంది. నీటిపారుదల ప్రాజెక్టులతో పోలిస్తే కేరళ రాష్ట్రంలోనే ఇది రెండవ అతి పెద్ద , అతి పొడవైన వంతెన. షెండున్ని అటవీ మృగాల ప్రదేశం తెన్మెల ప్రకృతి పర్యటనల్లో ఎంతో విశేషంగా ఆకట్టుకుంటుంది.

Pc:Pratheepps

ఆహ్లాదపరిచే ట్రీ హౌజ్:

ఆహ్లాదపరిచే ట్రీ హౌజ్:

ట్రీహౌజ్ అంటే అత్యంత ఎత్తైన చెట్ల మొదల్లో ఏర్పరించిన కుటీరాలు. వృక్ష శిఖరాన జీవించడం అన్నది ఊహకందని ఆలోచన. అదొక మధురమైన అనుభూతిని కలిగిస్తుంది. చెట్టు కొమ్మల మీద ఉండే కుటీరం లాంటి గుహ చూస్తే ఎవరికైనా అందులో కొన్నాళ్ళు బసచేస్తే బావుండుననిపిస్తుంది. నిరంతరం చల్లచల్లని గాలులు వీచే ఈ చోట వేలాది పక్షుల గుంపులు వాటి కిళకిళ రావాలు, కేరింతల నాదాలు హృదయాన్నిఊయలులూపుతాయి.

PC:Kerala Tourism

వేలాడే వంతెన:

వేలాడే వంతెన:

1877లో తెన్మెలలో నిర్మితమైన హ్యాంగింగ్ బ్రిడ్జ్ అప్పటి ఇంజనీర్ల సృష్టికి ఒక అద్భుత నిదర్శనం. బ్రిటిష్ ఇంజనీర్ ఆల్బర్ట్ హెన్నీ సారథ్యంలో నిర్మాణమైన ఈ వంతెన 400అడుగుల పొడవుతో ఉంది. కల్లాడ నది మీద కట్టిన ఈ వంతెనను కలప పలకలను బిగించడం ద్వారా ఏర్పరిచారు. రెండు చివర్లల్లో కేవలం రెండు స్థంభాలతో ఈ వంతెనను పూర్తి చేశారు.

PC:Arunvrparavur

పాలరువి జలపాతాలు

పాలరువి జలపాతాలు

పాలరువి జలపాతాలు కేరళ – తమిళనాడు సరిహద్దులలో వుంటాయి. పాలరువి అంటే పాల ధార అని అర్ధం చెపుతారు. నురగలు కక్కే ప్రవాహాలు వెండి రంగులో చల్లని ధారలతో చూచే వారికి ఒక అద్భు తంగా అనిపిస్తుంది. పాలరువి కొల్లం కు 75 కి.మీ. దూరంలో ఉంటుంది. ఈ నీటి స్వర్గాన్ని చేరాలంటే 4 కి.మీ. దూరం ట్రెక్కింగ్ చేయాలి. తేన్మలై సందర్శకులకు ఇది ఒక ప్రత్యెక ఆకర్షణ.

Photo Courtesy : commons.wikimedia.org

కులతుపూజ

కులతుపూజ

కులతుపూజ కొల్లం జిల్లలో ఒక అందమైన గ్రామం. తేన్మలై పర్వత ప్రాంతానికి ఇది సమీపంలో ఉంటుంది. తిరువంతపురం – శేన్కోట్టాయి మార్గంలో కలదు. తిరువనంతపురం కు 62 కి.మీ. మరియు కొల్లం కు 64 కి.మీ. దూరంలో ఉంటుంది. కులుతుపూజ దాని శాస్త దేవాలయానికి ప్రసిద్ధి. ఇక్కడ బాల శాస్త దేవి అంటే హరిహర ప్రియ ప్రధాన దైవం.Pc: Sailesh

ట్రెక్కింగ్

ట్రెక్కింగ్

ఆనందోత్సాహాలతో వుండే వారికి సాహస ప్రియులకు ట్రెక్కింగ్ మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక్కడ 3 రోజుల ట్రెక్కింగ్ టూర్లు కలవు. ఇక్కడ నిర్వహించే ట్రెక్కింగ్ టూర్లు ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. చెండురూనీ అభయారణ్యంలో పక్షి సందర్శకులకు పక్షులను సందర్శించే అవకాశం కలదు. పర్యాటకులు పక్షి సందర్శనను కూడా బాగా ఆనందించగలరు.

PC : Fotokannan

ఆర్యంకావు

ఆర్యంకావు

ఆర్యంకావు ప్రదేశాన్ని వ్యాలీ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ రేంజ్ అంటారు. కొల్లం జిల్లా కు తూర్పు దిశగా 75 కి.మీ. దూరంలో కలదు. తేన్మలై కు సమీపంలో కల ఆర్యంకావు గ్రామం జిల్లాలోని ప్రదాన ఆకర్షణలలో ఒకటి. ఆర్యంకావు లోని ప్రధాన ఆకర్షణ పాలరువి జలపాతాలు. ఈ క్షేత్రం లేడి సెయింట్ మేరీస్ రోమన్ కేథలిక్ చర్చి మరియు జార్జ్ మలంకర కాథలిక్ చర్చి భక్తులను ఆహ్వానిస్తుంది.PC: : Akhilan

తేన్మల ఎలా చేరుకోవాలి ?

తేన్మల ఎలా చేరుకోవాలి ?

రోడ్డు మార్గం
తేన్మలై కు తిరువనంతపురం మరియు కొల్లం ల నుండి ప్రభుత్వ లేదా ప్రైవేటు బస్సులలో చేరవచ్చు. రోడ్డు మార్గంలో టాక్సీ మరియు ఇతర వాహనాలలో కూడా చేరవచ్చు.

రైలు మార్గం
తేన్మలైకు 66 కి.మీ. దూరంలో కల కొల్లం లో రైలు స్టేషన్ కలదు. ఇక్కడకు దేశంలోని అన్ని ప్రాంతాలనుండి రైళ్ళు నడుస్తాయి. రైలు స్టేషన్ నుండి టాక్సీలలో తేన్మలై కు చేరుకోవచ్చు. టాక్సీ చార్జీలు కి.మీ. కు సుమారు రూ. 7 నుండి రూ. 11 వరకు ఉంటాయి.

వాయు మార్గం
తేన్మలై కు సమీపంలో సుమారు 72 కి.మీ. దూరంలో తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. ఇక్కడి నుండి ఇండియా లోని ప్రధాన నగరాలకు విమాన ప్రయాణ సదుపాయాలు కలవు. విమానాశ్రయం నుండి టాక్సీ లలో తేన్మలై చేరుకోవచ్చు.
PC : Jayeshj

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+