Search
  • Follow NativePlanet
Share
» »ఈ ఆల‌యంలో అమ్మ‌వారి విగ్రహం ఉండ‌దు.. ఎక్క‌డో తెలుసా..?

ఈ ఆల‌యంలో అమ్మ‌వారి విగ్రహం ఉండ‌దు.. ఎక్క‌డో తెలుసా..?

దేశ‌మంతా దసరా సందడి కోలహాలం నెల‌కొంది. ఈ శరన్నవరాత్రుల్లో దుర్గమాత‌ను భ‌క్తితో కొలుచుకుని అమె అనుగ్ర‌హం పొందాల‌నుకుంటారు చాలామంది. ద‌స‌రా సంద‌ర్భంగా చాలామంది అమ్మ‌వారి ఆల‌యాల సంద‌ర్శ‌న‌కు బ‌య‌లుదేరుతుంటారు. అయితే అమ్మ‌వారి విగ్ర‌హ‌మే లేని ఆల‌యాన్ని ఎప్పుడైనా చూశారా.. ? ఇక్క‌డ అమ్మ‌వారి విగ్ర‌హం ఉండ‌దు. అయినా ద‌స‌రా పండుగ‌వేళ అక్క‌డి పూజారులు గ‌ర్భాల‌యాన్ని విగ్రహాన్ని పోలి ఉండే విధంగా అలంకరిస్తారు. ఇంత‌కీ ఆ ఆల‌యం ఎక్క‌డ ఉందో తెలుసుకుందాం ప‌దండి..

దేశంలో అమ్మ‌వారి విగ్ర‌హ మూర్తులు క‌లిగిన ఆల‌యాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో మనకు తెలియని విచిత్రమైన శక్తి పీఠాలు కూడా కొలువై ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి గుజరాత్ రాష్ట్రంలోని అంబాజీ ఆలయం. ఈ ఆలయంలో అమ్మ‌వారి విగ్రహం అస్స‌లు భక్తులకు కనిపించదు. కానీ పండుగ‌లు, ఉత్స‌వాల వేల పెద్ద ఎత్తున పూజలు, ఉత్సవాలు చేస్తారట. ఆ ఆలయ విశిష్టతలు తెలుసుకుందాం ప‌దండి.

మ‌రొక ఆల‌యం..

అంబాజీ ఆలయం గుజరాత్‌-రాజస్తాన్‌ సరిహద్దులకు సమీపంలో ఉంటుంది. ఇక్క‌డికి చేరుకోవాలంటే మౌంట్‌ అబు నుంచి సుమారు రెండు గంటల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ఆలయం అరసుర్‌ కొండలలో వెల‌సింది. ఇక్కడ వెలిసిన అమ్మవారిని 'అరసురి అంబ' అని పిలుస్తారు. ఇంకా అంబాజీ అని కూడా పిలుస్తారు. ఈ అంబాదేవి శక్తి స్వరూపిణిగా భావించే దుర్గమ్మ అంశయే అని భక్తుల ప్ర‌గాఢ విశ్వాసం.

ambajitemple Gujarat

పురాణ ప్రకారం 51 శక్తి పీఠాలలో ఒకటిగా అంబాజీ ఆలయాన్ని చెబుతుంటారు. ఈ ఆల‌యాన్నిన్ని సతిదేవి హృదయం పడిన ప్రదేశమని కూడా క‌థ‌లు ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే రెండు దేవాలయాలు ఉన్నాయ‌ని కొన్ని క‌థనాలు చెబుత‌న్నాయి. ప్రస్తుతం ఉన్న ఆలయం కాకుండా మ‌రొక ఆల‌యం కిలోమీటర్ల దూరంలో గబ్బర్‌ కొండపై ఉందని ఇక్క‌డివారు చెబుతున్నారు.. దీన్ని దేవత నిజ ఆలయంగా పిలుస్తారు.

ఈ ఆల‌య క‌థ‌...

అయితే, ఈ కొండ‌పై వెల‌సిన అమ్మ‌వారిని ద‌ర్శంచుకోవ‌డం చాలా క‌ష్టంగా ఉండ‌డంతో దంతా రాజ్యపు రాజు దేవతను తన రాజ్యానికి వచ్చి ఉండాల్సిందిగా ప్రార్థిస్తాడట‌. దాంతో అందుకు అంగీకరించిన దేవతా రాజుకి ఒక షరతు పెడుతుంద‌ట‌.. "రాజా నిన్ను అనుసరిస్తూ వస్తుంటాను కానీ నువ్వు వెనుదిర‌గ‌కూడ‌దు అని చెబుతుంద‌ట‌.. మాటతప్పితే అక్కడ భూస్థాపితం అవ్వ‌డం లేదా అక్క‌డే వెలుస్తాను అని రాజుతో చెబుతుంది దేవతా. అందుకు రాజు ఒప్పుకుంటాడు. వేంట‌నే దేవ‌త‌ని త‌న రాజ్యానికి తీసుకెళ్లే ప‌నిలో ప‌డ‌తాడు. అలా మెల్ల‌గా అడుగులు వేస్తూ ముందుకు వెళ్లుతుంటాడు.

అయితే కొంత దూరం వెళ్లాక దేవ‌తా పాదాల శబ్దం వినిపించ‌డం లేద‌ని వెన‌క్కితిరుగుతాడు. అంతే అమ్మ అక్కడే భూమిలోకి పాతుకుపోతుంది. ఆ ప్రదేశమే ఈ అంబాజీ దేవాలయం అని పురాణ‌క‌థ‌నాలు చెబుతున్నాయి. ఈ ఆలయానికి ఉన్న మ‌రో ప్రత్యేకత ఏంటంటే..ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. అమ్మ‌వారి విగ్ర‌హానికి బదులుగా దేవత చిహ్నమైన 'శ్రీ వీసా యంత్రం' ఉంటుంది. అది కూడా భ‌క్తుల‌కు క‌నిపించ‌కుండా పూర్తిగా ముసుగుతో కప్పబడి ఉంటుంది.

ఇదే అతిపెద్ద వేడుక..

శ్రీ వీసా యంత్రాన్ని చూసేందుకు భక్తులకు అనుమతి లేదు. కానీ పండుగ‌లు, ఉత్స‌వాల స‌మ‌యంలో ఆలయ పూజారులు ఈ గ‌ర్భాల‌యాన్ని విగ్రహాన్ని పోలి ఉండే విధంగా అలంకరిస్తారు. నవరాత్రుల వేళ ఈ ఆల‌యం శోభ మ‌రింత రెట్టింప‌వుతుంది. ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా అంబాజీ డ్యాన్స్ ఫెస్టివల్‌లో భాగంగా నిర్వహించే హారతి ఎంతో అద్భుతంగా ఉంటుంది.ఇక ఆ కార్యక్రమంలోనే "గర్భా" అనే జానపద నృత్యాన్ని కూడా చేస్తారు. ఈ ఆల‌యంలో భాద్రపద పౌర్ణమి రోజు నిర్వహించే "భదర్వి పూనం" ఉత్సవం అతిపెద్ద వేడుక. ఈ వేడుకను చూసేందుకు వేలాదిగా భక్తులు ఇక్కడకు తరలివస్తారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+