Search
  • Follow NativePlanet
Share
» »టీచర్స్ డే రోజున పిల్లలు సంద‌ర్శించేందుకు ఢిల్లీలోని ఈ ప్ర‌దేశాలు ఉత్త‌మం..

టీచర్స్ డే రోజున పిల్లలు సంద‌ర్శించేందుకు ఢిల్లీలోని ఈ ప్ర‌దేశాలు ఉత్త‌మం..

టీచర్స్ డే రోజున పిల్లలు సంద‌ర్శించేందుకు ఢిల్లీలోని ఈ ప్ర‌దేశాలు ఉత్త‌మం..

ఉపాధ్యాయుడు మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. అతను మనకు మంచి విద్యను అందించడమే కాకుండా జీవితంలోని సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పిస్తాడు. దేశంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఉపాధ్యాయునికి, విద్యార్థికి ఈ రోజు ఎంతో ముఖ్యమైనది. ఈ ప్ర‌త్యేక‌ స‌మ‌యంలో కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను కొన్ని కొత్త ప్ర‌దేశాల‌కు తీసుకెళుతుంటారు. మీరు కూడా మీ పిల్ల‌ల్ని ఎక్క‌డికైనా తీసుకెళ్లాల‌నుకుంటే మాత్రం త‌ప్ప‌కుండా ఢిల్లీలోని ఈ ప్ర‌దేశాలు తీసుకెళ్లండి. ఎందుకంటే, ఈ ప్ర‌దేశాలు వారికి వినోదాన్ని పంచ‌డ‌మే కాకుండా, ఎంతో జ్ఞానాన్ని కూడా అందిస్తాయి. మ‌రెందుకాల‌స్యం రండి ఆ ప్ర‌దేశాలేంటో ఓసారి చూసేద్దాం..

1

నెహ్రూ ప్లానిటోరియం

నెహ్రూ ప్లానిటోరియం ఉపాధ్యాయ దినోత్స‌వం సంద‌ర్భంగా పిల్ల‌ల‌కు చూపించే ఉత్త‌మ‌మైన ప్ర‌దేశం. చాలా మందికి ఇది కాన్స్టెలేషన్ పేరుతో కూడా తెలుసు. ఇది ఒక రకమైన సైన్స్ సెంటర్. ఇక్కడ పిల్లలు అంతరిక్షం గురించి చాలా చూడొచ్చు, చాలా విష‌యాలు నేర్చుకోవచ్చు. అంతేకాదు, ఇక్కడ పిల్లలు సైన్స్‌కు సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుంటారు. అంతరిక్షంపై ఆసక్తి ఉన్న పిల్లల కోసం ఇక్కడ ప్రత్యేక లైబ్రరీ కూడా తయారు చేయబడింది. ఇందులో ప్ర‌వేశించేందుకు పిల్లలకు టికెట్ ఇర‌వై రూపాయ‌లు, పెద్దలకు యాభై రూపాయ‌లు. ఈ ప్లానిటోరియం మంగళవారం నుండి ఆదివారం వరకు మాత్ర‌మే తెరిచి ఉంటుంది.

జాతీయ బాల భవన్

ఈ టీచ‌ర్స్ డే రోజున పిల్లలు ఆనందంగా గ‌డిపేందుకు ఢిల్లీలోని నేషనల్ బాల్ భవన్ ఒక ఆహ్లాదకరమైన ప్రదేశం. ఈ భవనం భారతదేశ మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూకి అంకితం చేయబడింది. ఎందుకంటే చాచా నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టం. ఈ ప్రదేశం ఉద్దేశ్యం పిల్లల సృజనాత్మకతను ప్రోత్సహించడం. ఇక్కడ అప్పుడప్పుడు అనేక రకాల పోటీలు కూడా నిర్వ‌హిస్తుంటారు. వినోద కార్యక్రమాలతో పాటు, ఇక్క‌డ ఫోటోగ్రఫీని కూడా ఆస్వాదించవచ్చు. పిల్లలకు ప్రవేశ రుసుము కేవ‌లం 10 రూపాయలు మాత్ర‌మే. ఆది, సోమవారాల్లో బాల్‌భవన్‌ మూసివేయబడి ఉంటుంది.

2

రైలు మ్యూజియం

టీచ‌ర్స్ డే రోజున పిల్లలను ఎక్కడికైనా తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే, త‌ప్ప‌కుండా ఢిల్లీలోని రైల్ మ్యూజియ‌మ్‌కు తీసుకెళ్లండి. ఈ రైలు మ్యూజియంలో 163 ​​ఏళ్ల నాటి వారసత్వ సంపద భద్రపరచబడిందని ఇక్క‌డి వారు చెబుతున్నారు. ఇక్కడికి రావడం వల్ల పిల్లలు రైల్వే నెట్‌వర్క్ గురించి అవగాహన పొందడమే కాకుండా 3డి వర్చువల్ ట్రైన్, స్టీమ్ లోకో స్టిమ్యులేటర్, టన్ ట్రైన్ రైడింగ్‌తో పాటు ఇండోర్ గ్యాలరీని కూడా చూస్తారు. ఇక్కడ పిల్లలకు టికెట్ ప‌ది రూపాయ‌లు, పెద్దలకు యాభై రూపాయ‌లు. ఈ మ్యూజియం ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంట‌ల వరకు తెర‌చి ఉంటుంది. సోమవారం మూసివేయబడి ఉంటుంది.

3

నేషనల్ జూలాజికల్ పార్క్

పిల్లలను బయటకు తీసుకెళ్లి వారి జ్ఞానాన్ని పెంపొందించాల‌నుకుంటే మాత్రం ఢిల్లీలోని నేషనల్ జూలాజికల్ పార్కు ఎంతో ఉత్త‌మ‌మైన ప్ర‌దేశం. ఈ పార్క్‌లో ఆసియాటిక్ సింహం, రాయల్ బెంగాల్ టైగర్, జింకలు, భారతీయ ఖడ్గమృగం, ఎర్ర అడవి కోడి వంటి అరుదైన జంతువులను చూడటం పిల్లలకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. కుటుంబ విహారయాత్రకు కూడా ఇది మంచి ప్రదేశం. పిల్లలకు టిక్కెట్ ఇర‌వై రూపాయ‌లు, పెద్దలకు న‌లభై రూపాయ‌లు. ఈ పార్క్ ఉదయం 9:30 నుండి సాయంత్రం 4:30 వరకు తెరిచి ఉంటుంది. శుక్రవారం మూసివేయబడి ఉంటుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+