Search
  • Follow NativePlanet
Share
» »విదేశీ యాత్రికులు సందర్శించే ఢిల్లీలోని బెస్ట్ ప్లేస్‌లు ఇవే..

విదేశీ యాత్రికులు సందర్శించే ఢిల్లీలోని బెస్ట్ ప్లేస్‌లు ఇవే..

భార‌త‌దేశంలో సంద‌ర్శించేందుకు ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. పురాత‌న క‌ట్ట‌డాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు, హిల్‌స్టేష‌న్లు అత్య‌ద్భుత‌మైన ప్ర‌దేశాలకు భార‌త‌దేశం పెట్టింది పేరు. ఇక‌, దేశ రాజ‌ధాని ఢిల్లీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఇక్క‌డ సంద‌ర్శించేందుకు చారిత్ర‌క ప్ర‌దేశాలు ఎన్నో ఉన్నాయి. వీటిని సంద‌ర్శించేందుకు విదేశీయులు సైతం వ‌స్తుంటారు. అయితే, భార‌త్‌లో విదేశీ యాత్రికులు సంద‌ర్శించేందుకు అనువైన ప్ర‌దేశాలు ఎన్నో ఉన్నాయి. అవి కూడా ఉచితంగా సంద‌ర్శించే అవ‌కాశం ఉంది. ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండానే ఫ్రీగా సంద‌ర్శించే ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి.

ఢిల్లీ..

దేశ రాజధాని ఢిల్లీలో ప‌ర్యాట‌కులు సంద‌ర్శించేందుకు అనువైన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. ఇక్క‌డి ప్రాంతాల‌ను సంద‌ర్శించేందుకు ప్రజలు సుదూర ప్రాంతాల నుండి వస్తారు. ఢిల్లీలో ఎంట్రీ ఫీజు ఉండే ప్రాంతాలు చాలానే ఉన్నాయి. ఉచితంగా సంద‌ర్శించే ప్ర‌దేశాల‌కు కొద‌వేలేదు. అందుకే ఈ రోజు మ‌నం అలాంటి ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ఢిల్లీ సంద‌ర్శ‌నార్థం వ‌చ్చిన ప‌ర్యాట‌కుల‌కు ఇక్క‌డి అపూర్వ‌మైన క‌ట్ట‌డాల‌ను తిల‌కించ‌కుండా వెళ్ల‌రు. ఢిల్లీ పేరు చెప్ప‌గానే మ‌నకు ముందుగా ఇండియా గేట్ గుర్తుకొస్తుంది. కేవ‌లం ఇదొక్క‌టే కాదండోయ్‌.. ఇక్క‌డ ఇంకా చాలా అంద‌మైన ప్ర‌దేశాలు ఉన్నాయి.

chandinchowk1

ఇండియా గేట్‌..

దేశంలో ఉన్న దిగ్గజ స్మారక చిహ్నాల్లో ఇండియా గేట్‌ను ప్ర‌ధానం చెప్పుకోవ‌చ్చు. ఈ ప్రాంతం అనేక మంది సందర్శించే ఉత్తమ పర్యాటక గమ్యస్థానంగా ప్ర‌సిద్దిచెందింది. ఈ స్మారక చిహ్నాన్ని చూడకుండా, అక్కడ ఫోటో దిగకుండా వెళితే వారి ఢిల్లీ ప‌ర్య‌ట‌న అసంపూర్ణంగా ఉన్న‌ట్లే.. దేశంలోని చాలామంది ప్ర‌జ‌లు ఇష్ట‌ప‌డే పిక్నిక్ స్పాట్‌గా ఇది ప్ర‌సిద్ధిచెందింది. అంతేకాకుండా విదేశీయులు సైతం ఎక్కువ‌గా సంద‌ర్శించే ప్ర‌దేశం కూడా ఇదే. మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన వేలాది మంది భారతీయ సైనికుల త్యాగాన్ని గుర్తు చేసే యుద్ధ స్మారక చిహ్నం ఇండియాగేట్‌.

lotustemple1

లోటస్ టెంపుల్‌

ఢిల్లీలో ఉన్న లోటస్ టెంపుల్ విదేశీయులు ఎక్కువ‌గా సంద‌ర్శించే ప్ర‌దేశం. 26 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కట్టడం టూరిస్టులు సంద‌ర్శించే ప్రాంతాల‌లో చాలా ప్రసిద్ధి చెందింది. ఈ లోటస్ టెంపుల్ చూసేందుకు దేశీయులే కాదు. విదేశాల నుంచి కూడా ప‌ర్యాట‌కులు త‌ర‌లి వ‌స్తుంటారు. ఈ ఆలయం అనేక మతాల ప్రార్థనలు చేసేందుకు వీలుగా ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ పచ్చదనం వెల్లువిరిసినట్లుంటుంది. ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించే ఎలాంటి ప్ర‌వేశ రుసుము చెల్లించ‌న‌క్కర్లదు. ఫ్రీగా ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించొచ్చు.

agrasenkibaoli1

అగ్రసేన్ కీ బావోలి

న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఉన్న అగ్రసేన్ కీ బావోలి ప‌ర్యాట‌కులు సంద‌ర్శించేందుకు ఉత్త‌మ‌మైన ప్ర‌దేశం. విదేశీయులు సైతం ఈ ప్రాంతాన్ని సంద‌ర్శిస్తుంటారు.ఈ బావోలిలో బాలీవుడ్ సినిమాల చిత్రీక‌ర‌ణలు కూడా జ‌రిగాయి. ఈ మెట్టు బావిలో బావితోపాటు 105 మెట్లను కూడా నిర్మించారు. దీన్ని చూసేందుకు నిత్యం ఈ ప్రాంతం జ‌నంతో రద్దీగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించాల‌న్న టిక్కెట్ అవ‌స‌రం లేదు. ఉచితంగా ఈ ప్రాంతాన్నిచూడొచ్చు.

చాందినీ చౌక్

పాత ఢిల్లీలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాంతం చాందినీ చౌక్. ప్ర‌తిఏటా ఇక్క‌డికి పెద్ద సంఖ్య‌లో విదేశీయులు వ‌స్తుంటారు. ఇక్క‌డ ప్ర‌తి వ‌స్తువు అందుబాటులో ఉంటుంది. అది కూడా అందుబాటు ధ‌ర‌ల‌కే దొరుకుతాయి. ఈ ప్రాంతంలో వివిధ ర‌కాలైన తిండి ప‌దార్థాల‌ను కూడా రుచి చూడొచ్చు. ఎందుకంటే ఇది ఆహారం నుండి షాపింగ్ వరకు ప్రతిదానికీ చాలా ప్రసిద్ధి చెందింది.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+