Search
  • Follow NativePlanet
Share
» »హైదరాబాద్ న‌గ‌రానికి చేరువ‌లోని బెస్ట్ వీకెండ్ స్పాంట్స్ ఇవే!

హైదరాబాద్ న‌గ‌రానికి చేరువ‌లోని బెస్ట్ వీకెండ్ స్పాంట్స్ ఇవే!

వీకెండ్ వ‌చ్చిందంటే చాలు భాగ్య‌న‌గ‌రవాసులు విహారానికి సిద్ధ‌మైపోతారు. అయితే, ఒక్క‌రోజులో కుటుంబ‌స‌మేతంగా టూర్ ఎంజాయ్ చేయాల‌నుకునేవారికి న‌గ‌రం చుట్టుప‌క్క‌ల ఉన్న ప‌ర్యాట‌క అందాల‌ను ఇక్క‌డ‌ ప‌రిచ‌యం చేస్తున్నాం. ఈ సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశాల‌లో అడుగుపెడితేచాలు.. ఒత్తిడికి దూరంగా ప్రశాంత‌త‌కు ద‌గ్గ‌ర‌గా చేరుకున్న అనుభూతిని పొందుతారు. ప‌చ్చ‌ని ప్ర‌కృతి అందాల‌ను ఆస్వాదిస్తూ ఇక్క‌డ గ‌డిపే ప్ర‌తి క్ష‌ణం జీవితంలో మ‌ర్చిపోలేని అనుభాన్ని మీకు అందిస్తుంది. మ‌రెందుకు ఆల‌స్యం హైద‌రాబాద్ న‌గ‌రానికి చేరువ‌లో ఉన్న కొన్ని సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశాల‌ను ప‌ల‌క‌రిద్దామా?!

sameerpetlake

న‌గ‌రవాసుల‌కు ది బెస్ట్ వీకెండ్ స్పాట్‌గా హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన శామీర్‌పేట్‌ను చెప్పుకోవ‌చ్చు. సికింద్రాబాద్‌కు 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం ఎన్నో విలాసవంతమైన రెస్టారెంట్లు, హోటళ్లకు కేరాఫ్ అడ్ర‌స్‌గా చెప్పొచ్చు. ఇక్కడ ఉన్న జింకల పార్క్‌లో జింకలతో పాటు నెమళ్లు, అనేక రకాల పక్షులు ఎంత‌గానో క‌నువిందు చేస్తాయి.

rachakondafort

రాచకొండ కోట..

సిటీ నుంచి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో రాచ‌కొండ కోట‌. ఇది 14వ శతాబ్దానికి చెందిన ఈ కోట నిర్మాణ శైలి చూప‌రుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. మరీ ముఖ్యంగా ట్రెక్కింగ్ ప్రియుల‌కు ఈ ప్ర‌దేశం ఎంతో అనువుగా ఉంటుంది. యాదాద్రి-భువనగిరి జిల్లాలో ఉన్న ఈ కోట పై నుంచి చూస్తే ఆకుపచ్చని ప్ర‌కృతి అందాలు మ‌న‌సును ఎంత‌గానో ఆహ్లాద‌ప‌రుస్తాయి. అందుకే.. ప్ర‌శాంత‌త‌ను ఇష్ట‌ప‌డేవారు రాచ‌కొండ కోట‌ను ఇష్ట‌ప‌డ‌తారు అంటారు.

kondapochamma

కొండపోచమ్మ

హైదరాబాద్‌కు 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న కొండ‌పోచ‌మ్మ ప్ర‌దేశం ప్ర‌శాంత‌త‌ను చేరువ చేసే అత్యుత్తమ క్యాంపింగ్‌ ప్రదేశంగా చెప్పవచ్చు. సిద్దిపేట జిల్లాలో ఉన్న ఈ రిజర్వాయర్‌ అందాలు ఈ సీజ‌న్‌లో కొత్త‌ద‌నాన్ని ఆవ‌లింప‌జేసుకుంటాయి. ఇక్క‌డి వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ కుటుంబ‌స‌మేతంగా క్యాంపింగ్‌ చేసేందుకు అధిక శాతం పర్యాటకులు వ‌స్తూ ఉంటారు.

ఆధ్యాత్మిక అందాల‌.. కీసర

ప‌ర్యాట‌కంగానే కాకుండా ఆధ్యాత్మిక చింత‌న క‌లిగిన ప్రాంతంగా కీస‌ర పేరుగాంచింది. ఎటు చూసినా పక్షుల కిలకిలరావాలు, ప‌చ్చ‌ద‌నం ప‌రిచేసిన‌ట్లు క‌నువిందు చేసే ప్ర‌కృతి అందాలు ఇక్క‌డికి సంద‌ర్శ‌కులు క్యూ క‌ట్టేలా చేస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా కొండ‌పైనుంచి చూసేందుకు ఉన్న వ్యూ పాయింట్స్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. ప్రకృతి సంపదతో నిర్మించినట్టుగా అనుభూతి కలిగించే ఆర్నమెంటల్‌ ఫెన్సింగ్‌.. ఆరోగ్యాన్ని పంచే ఔషధ మొక్కల కూడళ్లు.. నలువైపులా పరుచుకున్న పచ్చదనంతో కీసర.. పర్యాటకుల సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశాల‌లో అగ్ర‌స్థానికి చేర‌వేస్తాయి. సుమారు 1562 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇక్క‌డి అటవీ ప్రాంతంలో విభిన్న రకాల మొక్కలు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ద‌ర్శ‌న‌మిస్తాయి.

లక్నవరం సరస్సు

హైదరాబాద్‌ నుంచి 220 కిలో మీటర్లు దూరంలో ఉన్న ల‌క్న‌వ‌రాన్ని న‌గ‌ర ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించే ప్ర‌దేశాల జాబితాలో చేర్చాల్సిందే. ఈ ప్రదేశం చుట్టుపక్కల ఉండే ఏటూరునాగారం అభయారణ్య సందర్శకులను కనువిందు చేస్తుంది. ప్రశాంత వాతావరణానికి మారుపేరుగా ఉన్న ల‌క్న‌వ‌రంలోని సుందరమైన దృశ్యాలు అనేకం ఉన్నాయి. లేక్‌ క్రాసింగ్‌, రోప్‌ కోర్సులు, కయాకింగ్‌ వంటివి అందుబాటులో ఉంటాయి. దీనికి సమీపంలో బొగత జలపాతం కూడా కనువిందు చేసే పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది.

More News

Read more about: hyderabad telangana
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+