Search
  • Follow NativePlanet
Share
» »కురుక్షేత్ర స‌మీపంలోని ప్ర‌సిద్ధిచెందిన హిల్‌స్టేష‌న్‌లు ఇవే..

కురుక్షేత్ర స‌మీపంలోని ప్ర‌సిద్ధిచెందిన హిల్‌స్టేష‌న్‌లు ఇవే..

కురుక్షేత్ర ప్ర‌దేశం గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఇది హ‌ర్యానాలోని ఎంతో అంద‌మైన న‌గ‌రం. ఈ ప్ర‌దేశంతో పాటు ఇక్క‌డ ప్ర‌సిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలు చాలానే ఉన్నాయి. మ‌హాభార‌త యుద్ధం జ‌రిగిన ప్ర‌దేశం ఇదే. అంతేకాదు ఈ ప్ర‌దేశంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోప‌దేశం కూడా చేశాడు. అందుకే ఈ ప్రాంతం ఎంత‌గానో పేరుగాంచింది. కురుక్షేత్ర ప్ర‌దేశం స‌మీపంలో ప్ర‌సిద్ధి చెందిన హిల్‌స్టేష‌న్లు చాలానే ఉన్నాయి.

వికాస్ నగర్

వికాస్ నగర్

కురుక్షేత్రానికి సమీపంలోని హిల్ స్టేషన్ల గురించి ప్ర‌స్తావించిన‌ప్పుడు మొద‌ట‌గా గుర్తొచ్చే పేరు వికాస్‌న‌గ‌ర్‌. వికాస్‌నగర్ ఒక చిన్నమ‌రియు అంద‌మైన కాల‌నీగా పేరుగాంచింది. ఇది ఎంతో మనోహరమైన హిల్ స్టేషన్. ఉత్తరాఖండ్‌లోని హాసి లోయలలో ఉన్న వికాస్, ఎత్తైన పర్వతాలు, దేవదారు వృక్షాలు, సరస్సులు, జలపాతాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. శీతాకాలంలో ఈ ప్రదేశపు అందం మరింత రెట్టింప‌వుతుంది. వికాస్‌నగర్‌లో సంద‌ర్శించేందుకు అశోక్ రాక్ శాసనం, శని ధామ్, కటపత్తర్ వాటర్ పార్క్ వంటి అద్భుతమైన ప్రదేశాలను చూసే అవ‌కాశం ఉంటుంది. కురుక్షేత్ర నుండి వికాస్ నగర్ దూరం సుమారు 129 కిలోమీట‌ర్ల ఉంటుంది.

సెలాక్వీ

సెలాక్వీ ఉత్తరాఖండ్‌లోని అందమైన లోయలలో ఉన్న ఒక చిన్నఅద్భుతమైన హిల్ స్టేషన్. ఇది ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామ‌మ‌నే చెప్పుకోవాలి. ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించేందుకు ప‌ర్యాట‌కులు హర్యానా నుండి మాత్రమే కాకుండా ఢిల్లీ, పంజాబ్ నుండి కూడా వ‌స్తుంటారు. ఇక్కడ ఎత్తైన పర్వతాలు, గడ్డి భూములు, సరస్సులు, జలపాతాలు ప‌ర్యాట‌కుల‌ను మైమ‌రింప‌జేస్తాయి. ఇంకా ఇక్క‌డ చూడ‌ద‌గిన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. అందులో MDDA పార్క్, టైగర్ ఫాల్, వంటి ప్ర‌దేశాల‌ను చూడొచ్చు. సెలాక్వి ప‌క్షిప్రేమికులకు ఎంతో అనువైన ప్ర‌దేశం. సాహ‌స‌ప్రియుల‌కు కూడా ఈ ప్ర‌దేశం ఎంతో ఉత్త‌మం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నో అడ్వంచ‌ర్ కార్య‌క్ర‌మాలు ఉంటాయి. వాట‌న్నింటిని ఆస్వాదించొచ్చు. ఇక్కడి నుండి సెలాక్వీ దూరం సుమారు 141 కిలోమీట‌ర్ల ఉంటుంది.

musssorie

ముస్సోరీ

ముస్సోరీ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ముస్సోరీ అంద‌మైన ప్ర‌దేశాల‌లో ఒక‌టి. ముస్సోరీ ఢిల్లీతో పాటు హర్యానా ప్రజలకు చాలా దగ్గరగా ఉండే ప్ర‌దేశం. ఇది ఉత్తరాఖండ్ అందమైన లోయల మధ్య, ఎత్తైన పర్వతాలు, సరస్సులు, జలపాతాలు, భారీ దేవదారు చెట్ల మధ్య ఉంటుంది. ఇక్క‌డి అందాల‌ను వీక్షించేందుకు ప‌ర్యాట‌కుల బారులు తీరుతుంటారు. ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో సేద‌తీరాల‌నుకునేవారు త‌ప్ప‌కుండా ఈ ప్ర‌దేశానికి రావాల్సిందే. ముస్సోరీ ప్ర‌కృతి అందాల‌కు ఎంత‌గానో పేరొందింది. ముస్సోరీలో ప‌ర్యాట‌కులు దలై హిల్స్, కెంప్టీ ఫాల్స్, లాల్ టిబ్బా, గన్ హిల్ పాయింట్ వంటి ప్రదేశాలను సందర్శించొచ్చు. కురుక్షేత్ర నుండి ముస్సోరీకి సుమారు 191 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది.

ధనౌల్తి

ఉత్తరాఖండ్‌లోని అందమైన లోయలలో ఉన్న ధనౌల్తి ఒక చిన్న, అంద‌మైన ప‌ట్ట‌ణం. ఇది ఒక మనోహరమైన హిల్ స్టేషన్‌గా కూడా ప్ర‌సిద్ధిచెందింది. ఇక్కడి ప్రశాంతమైన ప్రదేశం ప‌ర్యాట‌కుల‌ను ఎంతగానో ఆక‌ట్టుకుంటుంది. అందమైన కొండల నుండి దాక్కుని చూసి మేఘాలు ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో క‌నువిందుచేస్తాయి. ఇక్కడ పర్వతాల మీద కనిపించే మేఘాల అందాలు చలికాలంలో మ‌రింత అందాన్ని సంత‌రించుకుంటాయి. ధనౌల్తిలో సంద‌ర్శించేందుకు ఇంకా చాలా ప్ర‌దేశాలున్నాయి. అందులో సుర్ఖండ దేవి ఆలయం, ఎకో పార్క్, ఆపిల్ ఆర్చర్డ్ రిసార్ట్ వంటి ప్రదేశాలను సందర్శించొచ్చు. కురుక్షేత్ర నుండి ధనౌల్తికి దూరం దాదాపు 200 కిలోమీట‌ర్లు ఉంటుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+