Search
  • Follow NativePlanet
Share
» »క్రిస్మ‌స్ వేడుక‌ల‌కు బెంగుళూరులోని ఈ చ‌ర్చిలు ఎంతో ఫేమ‌స్‌..

క్రిస్మ‌స్ వేడుక‌ల‌కు బెంగుళూరులోని ఈ చ‌ర్చిలు ఎంతో ఫేమ‌స్‌..

బెంగుళూరు ఐటి సిటీగా ప్ర‌సిద్ధిచెందింది. ఈ ప్ర‌దేశాన్ని శీతాకాలంలో కూడా సంద‌ర్శించొచ్చు. బెంగుళూరు అన‌గానే చాలామందికి ద‌స‌రా వేడుకలు మాత‌మ్రే గుర్తుకొస్తాయి. ఇక్క‌డ కూడా క్రిస్మ‌స్ సంబ‌రాలు, న్యూయ‌ర్ వేడుక‌లు అంబ‌రాన్నంటుతాయి. కొత్త సంవత్సరపు అతిపెద్ద పండుగను జరుపుకోవడానికి సన్నాహాలు జ‌రుగుతున్నాయి. ఇక్క‌డ దీపాల ప్రదర్శన, రంగురంగుల అలంకరణలు, కేకులు, సాంస్కృతిక కార్యక్రమాల వంటి కార్య‌క్ర‌మాలెన్నో చేస్తుంటారు. దీంతో పాటు, ఇక్క‌డ చ‌ర్చిల‌లో అర్ధరాత్రి వేళ‌ల్లో జరిగే సామూహిక కరోల్ ఎంతో ప్ర‌త్యేక‌తను సంత‌రించుకుంటుంది. ఇది లేకుండా ఇక్క‌డ క్రిస్మస్ వేడుక అసంపూర్ణమ‌నే చెప్పాలి. క్రిస్మస్ పండుగకు కొద్దిరోజుల ముందు నుంచే చర్చిని అలంకరించే పనులు ప్రారంభ‌మ‌వుతాయి. క్రిస్మస్ కారణంగా ఇక్క‌డి మార్కెట్‌ల‌లో నిత్యం సందడి వాతావ‌ర‌ణం ఉంటుంది. బెంగుళూరులో ప్ర‌సిద్ధిచెందిన చ‌ర్చిల గురించి తెలుసుకుందాం.

సెయింట్ మేరీస్ బసిలికా

బెంగుళూరులోని శివాజీనగర్‌లో ఉన్న ఈ చర్చిలో సామూహిక కరోల్ ఎంతో ప్ర‌త్యేకంగా నిర్వ‌హిస్తారు. సుమారు 140 సంవత్సరాల పురాతనమైన ఈ రోమన్ కాథలిక్ చర్చి, ఈ రాష్ట్రంలో మేరీస్ బాసిలికా హోదా పొందిన మొదటి చర్చి కావ‌డం విశేషం. శివాజీనగర్ చేరుకోవడానికి బెంగళూరులోని దాదాపు అన్ని ప్రాంతాల నుండి బస్సు సేవలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడికి సమీప మెట్రో స్టేషన్ కబ్బన్ పార్క్ మెట్రో స్టేషన్.

st-patricks church ,banglore

సెయింట్ పాట్రిక్స్ చర్చి

బెంగుళూరులోని సెయింట్ పాట్రిక్స్ చ‌ర్చిని 1841 సంవత్సరంలో నిర్మించారు. ఈ సెయింట్ పాట్రిక్ చర్చ్ క్రిస్మస్ సందర్భంగా బెంగళూరులో సందర్శించడానికి ఒక ప్రధాన ప్రదేశమ‌నే చెప్పుకోవాలి. పండుగ రోజులలో ఈ చర్చి నక్షత్రాలు, శాంతా క్లాజ్, క్రిస్మస్ చెట్టు, రాత్రి చీకటిలో చాలా అందంగా కనిపించే రంగురంగుల లైట్లతో అలంకరించబడి ఉంటుంది. MG రోడ్, కమర్షియల్ స్ట్రీట్‌కి సమీపంలో ఉన్నందున, ప్రతి ఏటా ఈ చర్చికి పెద్ద సంఖ్యలో ప్రజలు త‌ర‌లి వస్తుంటారు. ఇక్కడకు చేరుకోవడానికి మీకు బస్సు సౌక‌ర్యం కూడా ఉంటుంది. మెట్రో ద్వారా ఈ ప్రాంతాన్ని చేరుకోవాలంటే మాత్రం MG రోడ్ సమీప మెట్రో స్టేషన్.

సెయింట్ మార్క్స్ కేథడ్రల్

బెంగుళూరులో ప్ర‌సిద్ధిచెందిన చ‌ర్చిల‌లో సెయింట్ మార్క్స్ కేథ‌డ్ర‌ల్ ఒక‌టి. ఈ చర్చి 1808 సంవత్సరంలో స్థాపించబడింది. క్రిస్మస్ సందర్భంగా ఎంజీ రోడ్డు సమీపంలోని ఈ చర్చికి ప్రభువైన ఏసుక్రీస్తు ప్రార్థనా సమావేశానికి హాజరయ్యేందుకు చాలా మంది హాజ‌ర‌వుతుంటారు. ఈ తెల్లటి రంగు చర్చి, రాత్రిపూట రంగురంగుల లైట్లతో ప్ర‌కాశాన్ని వెద‌జ‌ల్లుతుంది. కాన్వాస్‌పై రంగురంగుల పెయింటింగ్ వలె అద్భుతంగా కనిపిస్తుంది. క్రిస్మస్ రోజున ఈ చర్చిలో ప్రత్యేక మాస్ కూడా నిర్వహిస్తారు.

allsaintschurch

ఆల్ సెయింట్స్ చర్చి

క్రిస్మస్ రోజున బయటకు వెళ్లాలని అనుకునేవారు త‌ప్ప‌కుండా బెంగుళూరులోని ఆల్ సెయింట్స్ చర్చిని సందర్శించడం ఉత్త‌మ‌మైన‌ది. ఈ చర్చి వయస్సు సుమారు 150 సంవత్సరాలు అని స్థానికులు చెబుతుంటారు. చర్చి లోపల ఉన్న ప్రాంగణాలు చాలా అద్భుతంగా ఉంటాయి. స్థానిక ప్రజలు ఈ చర్చిని 'గార్డెన్ చర్చ్ ఆఫ్ గార్డెన్ సిటీ' అని కూడా పిలుస్తుంటారు. ఇది బెంగళూరులోని హౌసర్ రోడ్‌లో ఉంటుంది.

సెయింట్ జాన్స్ చర్చి

బెంగుళూరులోని సెయింట్ జాన్స్ చర్చి దాని ప్రత్యేక నిర్మాణానికి ఎంత‌గానో ప్రసిద్ధి చెందింది. ఈ చ‌ర్చి సుమారు 167 సంవత్సరాల పురాతనమైనది. ఈ చర్చి క్రైస్తవ మత ప్రచారకుడైన సెయింట్ జాన్‌కు అంకితం చేయబడింది. క్రిస్మస్ రాత్రి ఈ చర్చిని అందంగా అలంకరిస్తారు. చర్చి ముందు ఉన్న చిన్న తోట వివిధ రకాల లైట్లతో అలంకరించబడుతాయి. క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక అర్ధరాత్రి మాస్‌లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ చర్చికి చేరుకుంటారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+