Search
  • Follow NativePlanet
Share
» »ఈ ప‌విత్ర‌మైన స్థ‌లాల‌ను బక్రీద్ నాడు సంద‌ర్శించాల్సిందే..

ఈ ప‌విత్ర‌మైన స్థ‌లాల‌ను బక్రీద్ నాడు సంద‌ర్శించాల్సిందే..

ఈ ప‌విత్ర‌మైన స్థ‌లాల‌ను బక్రీద్ నాడు సంద‌ర్శించాల్సిందే..

ఇస్లామిక్ మతంలోని రెండవ అత్యంత ప్రసిద్ధ, పవిత్రమైన పండుగను జరుపుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు బిజీగా ఉన్నారు. ఈద్-ఉల్-అజా అనేది త్యాగానికి ప్ర‌తీకైన పండుగ అని అంటారు. ధు అల్-హిజ్జా పదవ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ పండుగ‌ను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఆ రోజున రంగురంగుల బట్టలు ధ‌రించి, రుచికరమైన వంటకాలు వండుతారు.

ఇంటిని ఎంతో అందంగా అలంక‌రించుకుంటారు. ఈ పండుగ నాడు ముస్లింలంద‌రూ మసీదులకు వెళ్లి నమాజ్ చేసుకుంటారు. బక్రీద్ అల్లాకు విధేయతతో కూడిన పండుగ. ఈ పండుగను త్యాగాల పండుగ అని కూడా అంటారు. ఈ పండుగ ముస్లిం సమాజంలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. జూన్ 29న ఈ పండుగను జరుపుకోనున్నారు. బ‌క్రీద్ పండుగ స‌మ‌యంలో భార‌త‌దేశంలో త‌ప్ప‌క సంద‌ర్శించాల్సిన కొన్ని మ‌సీదులు, ద‌ర్గాల గురించి మ‌న‌మిప్ప‌డు తెలుసుకుందాం.

బక్రీద్ ఎందుకు జరుపుకుంటారు?

ఈద్-ఉల్-అజా ముస్లిం సమాజపు ప్రధాన పండుగ. ఇది హజ్రత్ ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటుంది. అల్లాకు తన విధేయతను నిరూపించుకునేందుకు అతను తన కొడుకు ఇస్మాయిల్‌ను కూడా బలి ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతాడు. అప్పటి నుంచి బక్రీద్ పండుగ జరుపుకోవడం మొదలైంది. ఈ ప్రత్యేక సందర్భంగా, భారతదేశంలోని కొన్ని ప్రధాన మసీదుల గురించి తెలుసుకుందాం.

1

జామా మసీదు, ఢిల్లీ

ఇది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ మసీదులలో ఒకటి. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది. దీనిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించాడు. షాజహాన్‌కు వాస్తుశిల్పం అంటే చాలా ఇష్టం. ఈ మసీదు గోపురం మైళ్ళ దూరం నుండే ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షిస్తుంది. దీనికి నాలుగు గోపురాలు ఉన్నాయి. అంతేకాకుండా, ఇది ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఈ ప్రాంతాన్ని చేరుకునేందుకు చాలా మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈద్-ఉల్-అజా సందర్భంగా, జామా మసీదుకు భారీ సంఖ్యలో జనం పోటెత్తుతారు.

2

హాజీ అలీ, ముంబై

హాజీ అలీ దర్గా భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ ఇస్లామిక్ మత ప్రదేశాలలో ఒకటి. ప్రతిరోజు వేలాది మంది ఇక్కడికి వ‌స్తుంటారు. సముద్రం మధ్యలో ఉన్న దీనిని హాజీ అలీ షాహి మసీదు అని కూడా పిలుస్తారు. ఈ మసీదును సూఫీ సన్యాసి హాజీ అలీ షా నిర్మించారు. ఈ మసీదు నిర్మాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది ఇస్లాం మతానికి నివాళులర్పించేందుకు నిర్మించబడింది. ఈ ప్రదేశంలో పర్షియన్, మొఘల్‌, యూరోపియన్ శైలులతో సహా అనేక రకాల నిర్మాణాలు ఉన్నాయి. దీనికి పెద్ద గోపురం కూడా ఉంది. ఇది పాలరాయి రాళ్ళు, చెక్కతో తయారు చేయబడింది.

3

దర్గా షరీఫ్, అజ్మీర్

దర్గా షరీఫ్ అజ్మీర్ నగరంలోని ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటి. ఇది రాజస్థాన్‌లో ఎక్కువగా సందర్శించే ప్రదేశాలలో ఒకటి. దర్గా షరీఫ్ హజ్రత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీకి అంకితం చేయబడింది. ఈ ప్రదేశం చరిత్రతో నిండి ఉంది. బక్రీద్ సంద‌ర్భంగా వేల సంఖ్య‌లో భ‌క్తులు ఇక్క‌డికి త‌ర‌లివ‌స్తుంటారు.

4

బారా ఇమాంబర, లక్నో

బారా ఇమాంబర భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ మసీదులలో ఒకటి. దీనిని నిజాం-ఎ-అడ్లీ అని కూడా పిలుస్తారు. ఇది నవాబుల నగరమైన లక్నోలో ఉంది. ఈ మసీదును నవాబ్ అసఫ్-ఉద్-దౌలా నిర్మించారు. అందుకే అతని పేరును పెట్టారు. బడా ఇమాంబరా వాస్తుశిల్పం చాలా అందంగా ఉండ‌డంతో పాటు దీనికి చాలా చారిత్రక ప్రాముఖ్యత కూడా ఉంది. ఇది భారతదేశంలోని అత్యంత అద్భుతమైన నిర్మాణ సౌందర్యాలలో ఒకటిగా పరిగణించబడింది. దీని నిర్మాణం పూర్తి కావడానికి సుమారు 14 సంవత్సరాలు పట్టింది. భవనం మొత్తం లక్నో ఇటుకలు మరియు సున్నపు ప్లాస్టర్‌తో తయారు చేయబడింది. దీని నిర్మాణ సమయంలో చెక్కను కానీ మెటల్‌ను కానీ ఉప‌యోగించ‌లేదు.

హజ్రత్బాల్ దర్గా, శ్రీనగర్

శ్రీనగర్‌లోని దాల్ సరస్సు ఒడ్డున ఉన్న హజ్రత్‌బాల్ దర్గా ముస్లింల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ మసీదు కాశ్మీర్‌లోని అత్యంత ముఖ్యమైన మసీదులలో ఒకటి. ప్రతి సంవత్సరం వేలాది మంది భ‌క్తులు దీనిని సందర్శిస్తారు. హజ్రత్‌బాల్ మసీదులో గోపురంతో పాటు మినార్ కూడా ఉంది. మసీదులో ప్రవక్త ముహమ్మద్ వెంట్రుకగా విశ్వసించబడే మోయి-ఎ-ముకద్దాస్ అనే అవశేషాలు ఉన్నాయి.

More News

    Read more about: ama masjid delhi
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+