కర్నాటక రాజధాని బెంగుళూరులో ప్రసిద్ధిచెందిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. సుసంపన్నమైన సాంస్కృతిక, చారిత్రిక వారసత్వాన్ని కలిగి ఉన్న కర్ణాటక దక్షిణ భారతదేశంలోని పర్యాటకులు అత్యంత కోరుకునే పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా పేరుగాంచింది. డిసెంబరులోని చల్లని శీతాకాలపు రోజులలో, క్రిస్మస్‌లో బెంగుళూరు ప్రదేశాన్ని తప్పకుండా సందర్శించాల్సిందే.. ఎప్పుడూ పనులతో బిజీగా బిజీగా ఉండే ఈ నగరంలో ప్రతి పండుగను ఎంతో శ్రద్ధతో నిర్వహిస్తారు. ఇక ఇక్కడ క్రిస్మస్ వేడుకలకు కూడా బెంగుళూరు నగరం ఎంతగానో ముస్తాబవుతుంది.
క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ బోలెడన్నీ బహుమతులు తీసుకువెళ్లే శాంతా క్లాజ్, క్రిస్మస్ రాకకోసం ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. క్రిస్మస్ అంటే మంచు, శీతాకాలం, కేక్, క్రిస్మస్ చెట్టు అన్నీ ప్రత్యేకమైనవే. క్రిస్మస్ చెట్టు చిన్నదైనా, పెద్దదైనా రంగురంగుల కాగితాలు, గంటలు, ఇతర అలంకరణ వస్తువులతో అందంగా అలంకరించబడుతుంది. బెంగుళూరులో క్రిస్మస్ కోసం ప్రత్యేకంగా తయారుచేయబడిన మార్కెట్లు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దా పదండి.

శివాజీనగర్
క్రిస్మస్ సందర్భంగా, బెంగుళూరు శివాజీనగర్‌లోని రోడ్డు పక్కన తాత్కాలిక స్టాల్స్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మార్కెట్‌లో క్రిస్మస్ అలంకరణలకు కావాల్సిన అన్నీ వస్తువులు సరసమైన ధరలకే లభిస్తాయి. ముఖ్యంగా సెయింట్ మేరీస్ బసిలికా పరిసర ప్రాంతాలు రంగురంగుల అలంకరణ వస్తువులను విక్రయించే దుకాణాలతో నిండిపోయింటాయి. ఈ స్టాల్స్ వద్ద, క్రిస్మస్ చెట్టును అలంకరించేందుకు ముదురు రంగుల గంటలు, పూసలు, రిబ్బన్లు మొదలైనవి లభిస్తాయి. శివాజీనగర్‌లో తాత్కాలికవే కాకుండా శాశ్వత దుకాణాలు కూడా ఉన్నాయి. ఇక్కడ క్రిస్మస్ సమయంలో తాజా అలంకరణ వస్తువులు మార్కెట్‌లో లభిస్తాయి.

బ్రిగేడ్ రోడ్
బెంగుళూరు బ్రిగేడ్ రోడ్‌లోని దుకాణాలలో, క్రిస్మస్, న్యూ ఇయర్ పార్టీలను దృష్టిలో ఉంచుకుని అనేక అలంకరణ వస్తువులు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ దాదాపు ప్రతి దుకాణం, మాల్‌లో, క్రిస్మస్ చెట్లు, రెయిన్‌డీర్, స్లిఘ్ కార్ట్‌లతో సహా క్రిస్మస్, నూతన సంవత్సరానికి ఇంటిని అలంకరించే వస్తువులను ఇక్కడ కొనుగోలు చేయొచ్చు.

కమర్షియల్ స్ట్రీట్..
క్రిస్మస్ వేడుకలకు కావలసిన వస్తువులన్నీ బెంగుళూరు కమర్షియల్ స్ట్రీట్‌లో లభిస్తాయి. క్రిస్మస్ చెట్టు, బట్టలు, క్రిస్మస్ చెట్టును అలంకరించే వస్తువులు లేదా క్రిస్మస్ సమయంలో ఇంటిని అలంకరించే వస్తువులు అన్నీ ఇక్కడ లభిస్తాయి. మీ వన్ స్టాప్ షాపింగ్ గమ్యస్థానం కమర్షియల్ స్ట్రీట్ అని చెప్పుకోవచ్చు. ఈ కమర్షియల్ స్ట్రీట్‌లో క్రిస్మస్ వేడుకలకు కావాల్సిన అన్నీ వస్తువులు అతి తక్కువ ధరలకే లభిస్తాయి.
చిక్‌పేట
క్రిస్మస్ సందర్భంగా ఇంటి అలంకరణకు కావాల్సిన ఆభరణాలు, ఫెయిరీ లైట్లు మరియు షాన్డిలియర్స్ వంటి అలంకార వస్తువులను హోల్‌సేల్ ధరలకు కొనుగోలు చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా బెంగుళూరులోని చిక్ పేటకు రావాల్సిందే. ఇక్కడ స్టాల్స్ క్రిస్మస్ ముందు చాలా అలంకరిస్తారు. చిక్‌పేట్‌లో KR మార్కెట్, రాజా మార్కెట్ చుట్టూ ఉన్న ప్రాంతంలో అలంకరించబడిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. క్రిస్మస్ సందర్భంగా తక్కువ బడ్జెట్ షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం చిక్‌పేట్ మంచి ఎంపిక అని చెప్పుకోవాలి. ఇంకా బెంగుళూరులోని శివాజీనగర్, సంపగి రామ్‌నగర్, కోరమంగళ వంటి ప్రాంతాల్లో కూడా అలంకరణ వస్తువులు లభిస్తాయి.



Click it and Unblock the Notifications













