Search
  • Follow NativePlanet
Share
» »దీపావ‌ళి షాపింగ్‌కు బెంగుళూరులోని ఈ మార్కెట్లు ఎంతో ఫేమ‌స్..!

దీపావ‌ళి షాపింగ్‌కు బెంగుళూరులోని ఈ మార్కెట్లు ఎంతో ఫేమ‌స్..!

దేశంలో మరికొద్ది రోజుల్లో దీపావ‌ళి పండుగ సంబురాలు మొద‌లుకానున్నాయి. పండుగ సీజన్ అన‌గానే, షాపింగ్‌కాంప్లెక్స్‌లు, మార్కెట్లు నిత్యం ర‌ద్దీగా ఉంటాయి. ఎందుకంటే, చాలామంది కొత్త బ‌ట్ట‌లు కొంటారు. ఇక‌, దీపావ‌ళి పండుగ అంటే వెలుగుల పండుగ‌. ఈ పండక్కి చాలామంది దీపాలు, పూజా సామాగ్రి, ట‌పాసులు, స్వీట్లు కొనుగోలు చేస్తుంటారు. అందుకోసం త‌క్కువ బ‌డ్జెట్‌లో ఈ వ‌స్తువుల‌న్నీ దొరికే మార్కెట్ల‌కు ప‌రుగులు పెడ‌తారు. అయితే, అలాంటి మార్కెట్లు బెంగుళూరులో చాలానే ఉన్నాయి. బెంగుళూరు ప‌రిస‌ర ప్రాంతాల్లో ఉండేవారు త‌ప్ప‌కుండా ఈ మార్కెట్ల‌కు వెళితే స‌ర‌స‌మైన ధ‌ర‌ల్లోనే అన్నీ ర‌కాల వ‌స్తువులు లభిస్తాయి. మ‌రెందుకాల‌స్యం ఆ మార్కెట్లో ఏంటో చూసేద్దామా..?

మల్లేశ్వరం మార్కెట్‌..

బెంగళూరు న‌గ‌రంలో దీపావళి షాపింగ్ చేయాల‌నుకునేవారికి మల్లేశ్వరం మార్కెట్ ఎంతో ఉత్త‌మం. ఎందుకంటే, ఇది మెట్రో స్టేషన్ నుంచి సమీపంలో ఉంటుంది. అంతేకాదు, ఈ మార్కెట్‌లో అన్నీ స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కే ల‌భిస్తాయి. దీపావ‌ళి పండుగ‌కు సంబంధించిన ప్ర‌తి ఒక్క వస్తువు ఈ మార్కెట్లో దొరుకుతుంది. వీటితోపాటు ఆడ‌వారి అలంక‌ర‌ణ‌కు కావాల్సిన అన్నీ వ‌స్తువులు ఉంటాయి. ఒక్క దీవాళీ షాపింగ్ మాత్ర‌మే కాదు.. ఇక్క‌డ కర్వా చౌత్ పండుగ కోసం కూడా షాపింగ్ చేసుకోవ‌చ్చు.

బ్రిగేడ్ రోడ్

దీపావ‌ళి షాపింగ్‌కు బెంగుళూరులో ప్ర‌సిద్ధిచెందిన మ‌రోప్రాంతం బ్రిగేడ్ రోడ్. ఈ మార్కెట్లో దొరికని వ‌స్తువుంటూ ఉండ‌దు. ఇక్క‌డ అన్నీ ర‌కాల వ‌స్తువులూ అతి త‌క్కువ ధ‌ర‌కే ల‌భిస్తాయి. ఈ మార్కెట్‌లో స్థానిక తయారీ వస్తువుల నుంచి అంతర్జాతీయ బ్రాండ్ ల వరకూ ప్రతి ఒక్కటీ ల‌భిస్తుంది. ఇంకా ఇక్క‌డ దీపావ‌ళి పండుగ‌కు కావాల్సిన సామాగ్రి, ట‌పాసులు, పూజా సామాగ్రి, దుస్తులు, ఇంటికి కావాల్సిన అలంక‌ర‌ణ వ‌స్తువులు అన్నీ ల‌భిస్తాయి.

గాంధీ మార్కెట్

దీపావ‌ళి షాపింగ్‌కు సౌత్ బెంగళూరులోని గాంధీ మార్కెట్ ఎంతో ఫేమ‌స్‌. ఈ మార్కెట్‌ బసవన్నగుడి సమీపంలో ఉంటుంది. ఇందులో అన్ని రకాల వస్తువులు ల‌భిస్తాయి. ఈ మార్కెట్‌లో మైసూర్ సిల్క్ చీరలు, పాలతో తయారు చేసిన మిఠాయిలు, దీపావ‌ళి పూజా సామాగ్రి, ప్ర‌మిద‌లు, మట్టి దీపాలు వంటి వస్తువులెన్నో త‌క్కువ ధ‌ర‌ల‌కే ల‌భిస్తాయి. అంతేకాదు, షాపింగ్ చేసి అల‌సిపోయిన‌వారికి నోరూరించే వైరెటీ ఫుడ్స్ క‌లిగిన రెస్టారెంట్లు కూడా ఉన్నాయి.

రెసిడెన్సీ రోడ్

దీపావళి షాపింగ్ కు బెంగుళూరులో ప్ర‌సిద్ధిచెందిన రోడ్ రెసీడెన్సీ. ఇక్క‌డ అన్నీ ర‌కాల వ‌స్తువులు ల‌భిస్తాయి. ఇంటికి కావాల్సిన అనేక వస్తువులు కూడా ఇక్క‌డ దొరుకుతాయి. బెంగళూరులోనే ప్రాచూర్యం పొందిన సెంట్రల్ మాల్ తో పాటు స్థానికంగా ఈ రోడ్ ప్ర‌సిద్ధిచెందింది. ఈ రోడ్‌లో దీపావ‌ళి పండుగ‌లో అత్యంత ముఖ్య‌మైన‌ మట్టిప్రమిదలు ల‌భిస్తాయి.

చిక్కపేట

బెంగళూరులో దీపావ‌ళి షాపింగ్ చేసేందుకు అత్యుత్తమ ప్రాంతం చిక్క‌పేట‌. ఇక్కడ మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల బడ్జెట్‌లోనే అన్ని రకాల వస్తువులు ల‌భిస్తాయి. ఈ మార్కెట్‌లో హోల్‌సేల్ దుకాణాలు కూడా ఉన్నాయి. ఇక్క‌డ మైసూరు సిల్క్ శారీస్ నుంచి కాంచీపురం వరకు అన్నీ ర‌కాల చీర‌లతో పాటు అద్భుతమైన ఆభరణాలు కూడా లభిస్తాయి. దీపావ‌ళి వేళ ఇంటికి లైటింగ్ డెకరేషన్ కోసం కూడా అందుబాటు ధ‌ర‌ల‌లో కలర్ ఫుల్ లైట్స్ దొర‌కుతాయి. మ‌రెందుకాల‌స్యం ఈ దీపావ‌ళికి మీ ఇళ్లు వెలిగిపోవాలంటే ఈ మార్కెట్ల‌లో షాపింగ్ చేయాల్సిందే

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+