ర్వా చౌత్ షాపింగ్ కోసం ఢిల్లీలోని ఈ మార్కెట్లు ఉత్తమం...
కర్వా చౌత్ వివాహిత మహిళలు జరుపుకునే అతి పెద్ద పండుగలలో ఒకటి. ఈ పండుగను ఎక్కువగా ఉత్తర భారతీయులు జరుపుకుంటారు. ఈ పండుగకు సంబంధించిన సన్నాహాలు నెల రోజుల ముందు నుంచే ప్రారంభమవుతాయి. ఈ ఏడాది నవంబర్ 1న కర్వా చౌత్ పండుగను నిర్వహించుకోనున్నారు. ఇప్పటికి వరకూ కర్వాచౌత్ షాపింగ్ పూర్తయి ఉండాలి. ఒకవేళ మీ షాపింగ్ ఇంకా పూర్తి కాకపోతే ఆలస్యం చేయకుండా ఢిల్లీలోని ఈ మార్కెట్లకు వెళ్లండి. ఎందుకుంటే ఇక్కడ అతి తక్కువ ధరలో కర్వాచౌత్ షాపింగ్‌ను పూర్తిచేయొచ్చు. కర్వాచౌత్ పూజకు అవసరమైన సామా్గ్రి అంతా ఈ మార్కెట్లలో లభిస్తుంది. ఇక్కడ మీరు కూడా మీకు కావలసిన బట్టలు, ఆభరణాలు, చెప్పులు వేటినైనా ఇక్కడ కోనుగోలు చేయొచ్చు. అది కూడా అతి తక్కువ బడ్జెట్‌తో మీ షాపింగ్ పూర్తయిపోతుంది. మరి, ఢిల్లీలోని ఈ మార్కెట్లు ఏంటో ఒకసారి చూసేద్దామా...

చాందినీ చౌక్
ఢిల్లీలోని చాందినీ చౌక్ పెళ్లి షాపింగ్‌లకు ఉత్తమ గమ్యస్థానంగా ప్రసిద్ది చెందింది. చాందినీ చౌక్ ఎంతో పురాతనమైన మార్కెట్. ఈ మార్కెట్‌కు 370 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ మార్కెట్‌లోని ఇరుకైన వీధులను కత్రా అని పిలుస్తారు. ఈ మార్కెట్ నిత్యం కొనుగోలుదారులతో రద్దీగా ఉంటుంది. ఇక్కడ అన్ని వయసుల వారికి కోరుకున్న వస్తువులు లభ్యమవుతాయి. ఇక్కడ అన్నిరకాల షాపింగ్‌లు చేయొచ్చు. అది కర్వా చౌత్ కానీ, దీపావళి కానీ ఏ పండుగకైనా మీరు ఇక్కడ షాపింగ్ చేసుకును వీలు ఉంటుంది. అతి తక్కువ బడ్జెట్‌తో చాందినీ చౌక్‌లో అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ రకరకాల దుస్తులతో పాటు నగలు, ఇంటి అలంకరణకు కావాల్సిన సామాగ్రి, పూజ మొదలైన వంటివన్నీ లభిస్తాయి.

లజ్‌పత్ మార్కెట్
ఈ రోజుల్లో లజ్‌పత్ మార్కెట్‌లో ఫుల్ రద్దీగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడి దుకాణాలు రంగురంగుల దుస్తులు, నగలు, పాదరక్షలతో అలంకరించబడి ఉంటాయి. పెళ్లిళ్లు, పంక్షన్లు, పండుగలు సందర్భం ఏదైనా సరే ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల వస్తువులు అతి తక్కువ ధరలకే అందుబాటులో ఉంటాయి. మీకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకుని షాపింగ్ చేయొచ్చు.

సరోజిని మార్కెట్
కర్వా చౌత్ సందర్భంగా అందమైన చీరలు లేదా వాటికి సరిపోయే ఆభరణాల కోసం చూస్తున్నట్లయితే మాత్రం తప్పకుండా ఢిల్లీలోని ఈ మార్కెట్‌కు వెళ్లాల్సిందే.. ఢిల్లలోని సరోజని మార్కెట్‌లో అన్ని రకాల వస్తువులు లభిస్తాయి. ఇక్కడ మీరు బట్టల నుండి అవసరమైన ప్రతి వస్తువును కొనుగోలు చేయొచ్చు. అంతేకాదు ముఖ్యంగా ఇక్కడ రకరకాల పాదరక్షలు , లెదర్ వస్తువులు అంటే హ్యాండ్ బాగ్స్, పర్సులు, బెల్ట్ వాటిని చౌక ధరలలో కొనుకోవచ్చు. సరోజినీ నగర్ మార్కెట్ బడ్జెట్ షాపింగ్‌కు ప్రత్యేకించి ప్రసిద్ధి చెందింది. బేరసారాల విషయానికి వస్తే ఇంతకంటే మంచి ప్రదేశం మరొకటి ఉండదు. కర్వా చౌత్ కాకుండా, ఇక్కడ శీతాకాలపు దుస్తులు, పార్టీ దుస్తులను కూడా కొనుగోలు చేయవచ్చు.
తిలక్ నగర్ మార్కెట్
పశ్చిమ ఢిల్లీలోని ఈ మార్కెట్ కూడా ఎల్లప్పుడు రద్దీగానే ఉంటుంది. పెళ్లికి సంబంధించిన దుస్తులు మొదలుకొని సాధారణ సందర్భాల వరకు తక్కవు బడ్జెట్‌లో అన్నీ ఇక్కడ లభిస్తాయి. రెడీమేడ్ దుస్తులే కాకుండా ఫ్యాబ్రిక్, పాదరక్షలు, లేస్, స్కార్ఫ్, ఇంటి అలంకరణ తదితర దాదాపు అన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వ్యక్తిగత వాహనం లేదా మెట్రో ద్వారా కూడా ఈ మార్కెట్‌ను చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications












