దీపావళికి పండుగకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ పండుగ కోసం ప్రత్యేకంగా ఇంటిని శుభ్రపరచడం, అలంకరణ, బట్టలు, ఆభరణాలు, పూజకు సంబంధించిన అనేక వస్తువులను కొనుగోలు చేస్తారు చాలామంది. ఇవన్నీ ఒకే దగ్గర దొరికే ప్రాంతం కోసం చాలామంది చూస్తుంటారు. కాబట్టి వీటన్నింటిని షాషింగ్ చేసేందుకు ఢిల్లీలోని ఈ మార్కెట్లు ఎంతో ఉత్తమమైనవి. ఇప్పటికే ఢిల్లీలోని ఈ మార్కెట్లలో దీపావళి శోభ కనిపిస్తోంది. దుకాణాలను అలంకరణలు, వస్త్రాలు, రంగోలీలు, దీపాలతో అలంకరించారు.
దీపావళి పండుగను సాధారణంగా మూడు నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు. ప్రతి రోజు దాని దీపావళి దాని సొంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ధంతేరాస్, ఛోటీ దీపావళి, బడి దీపావళి, భాయ్ దూజ్ కోసం విభిన్న సన్నాహాలు బహుమతులను ఏర్పాటు చేస్తుంటారు. పండుగలొచ్చాయంటే చాలు బడ్జెట్‌లో కోత ఏర్పడుతుంది. కాబట్టి ఈసారి దీపావళి షాపింగ్‌కోసం ఢిల్లీలోని ఈ మార్కెట్లను ఎంచుకోండి. ఎందుకంటే ఇక్కడ అన్ని వస్తువులు అతి తక్కువ ధరలకే లభిస్తాయి. తక్కువ బడ్జెట్‌లో ఇక్కడ చాలా వస్తువులను కొనుగోలు చేయవచ్చు.

లజపత్ నగర్
ఢిల్లీలోని లజ్‌పత్ నగర్ మార్కెట్ నిత్యం వినియోగదారులతో సందడి సందడిగా ఉంటుంది. ఢిల్లిలో ప్రసిద్ధి చెందిన మార్కెట్లలో ఇది ఒకటి. ఇక ఈ మార్కెట్ పండగులప్పుడు మరింత శోభతో అందరిని ఆకట్టుకుంటుంది. పండుగలకు, పూజలకు కావలసినవన్నీ వస్తువులన్నీ ఇక్కడ లభిస్తాయి. ఇక్కడ బేరసారాల్లో కొంత వెనుకుడుగు వేసినప్పటికీ, అన్నీ నాణ్యమైన వస్తువులే దొరుకుతాయి. చీరలు, సూట్లు, దీపాలు, బందంవార్, పెయింటింగ్స్, ఉర్లీ, ఇంటి అలంకరణకు కావాల్సినవన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ దీపావళికి షాపింగ్‌కు వెళ్లాలంటే తప్పకుండా ఈ ప్రాంతానికి వెళ్లాల్సిందే..

సరోజినీ నగర్ మార్కెట్
ఢిల్లీలో షాపింగ్ చేసేందుకు సరోజని మార్కెట్ ఎంతగానో ప్రసిద్ధి చెందింది. నిత్యం వేలాదిమంది జనంతో ఈప్రాంతమంతా కిక్కిరిసిపోతుంది. బడ్జెట్ షాపింగ్‌కు ఇంతకంటే మంచి ప్రదేశం మరొకటి ఉండదు. ఈ మార్కెట్ దీపావళికి సంబంధించిన భారతీయ, పాశ్చాత్య, ఉన్ని, ప్రతి చిన్న పెద్ద వస్తువులతో అలంకరించబడి ఉంటుంది.
ఢిల్లీ హాట్
ఢిల్లీ హాట్ మార్కెట్ ఢిల్లీలోని సరోజినీ నగర్ సమీపంలో ఉంది. ఈ ప్రదేశం వివిధ రాష్ట్రాలకు చెందిన హస్తకళా వస్తువులకు ఎంతగానో ప్రసిద్ధి చెందింది. దీపావళి పండుగ సందర్భంగా ఇక్కడ భిన్నమైన ఉత్సాహం, రద్దీ కనిపిస్తుంది. ఇక్కడ లభించే అలంకరణ వస్తువులతో ఇంటిని డిఫరెంట్ లుక్‌లో మార్చేయవచ్చు. అయితే ఇక్కడ చాలా దుకాణాలలో వస్తువుల ధరలు ఫిక్స్‌డ్‌గా నిర్ణయించబడి ఉంటాయి. షాపింగ్ చేసి అలసిపోయిన వారికోసం ప్రత్యేకమైన రుచులను అందించే హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్ ఇలా వివిధ రాష్ట్రాల రుచులను ఇక్కడి రెస్టారెంట్లలో ఆస్వాదించొచ్చు.

చాందినీ చౌక్
ఢిల్లీలో ప్రసిద్ధి చెందిన మార్కెట్ చాందీని చౌక్. ఈ మార్కెట్‌లో పెళ్లి, పండుగలు, పూజ కార్యక్రమాలు ఇతర వాటికి కూడా దాదాపు అన్నింటి కోసం షాపింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ మార్కెట్‌లో అతితక్కువ బడ్జెట్‌తోనే షాపింగ్ చేయొచ్చు. ఈ మార్కెట్‌లో రూ. 100 నుండి రూ. 100,000 లక్షల వరకు వస్తువులు అందుబాటులో ఉంటాయి. దీపావళి షాపింగ్‌కు ఎక్కడికి వెళ్లాలో తెలియక గందరగోళంలో ఉంటే మాత్రం తప్పకుండా ఢిల్లీలోని ఈ మార్కెట్‌కు వెళ్లండి. గృహాలంకరణ, ఆభరణాలు, బట్టలు నుండి పాదరక్షలు, పువ్వుల వరకు ప్రతి వస్తువు ఇక్కడ షాపింగ్ చేయవచ్చు. ఈ మార్కెట్ ఆదివారాల్లో మూసివేయబడి ఉంటుంది.



Click it and Unblock the Notifications












