Search
  • Follow NativePlanet
Share
» »బెంగుళూరులోని ఈ ప్ర‌దేశాలను ఉచితంగా సంద‌ర్శించొచ్చు...

బెంగుళూరులోని ఈ ప్ర‌దేశాలను ఉచితంగా సంద‌ర్శించొచ్చు...

బెంగళూరును సిలికాన్ వ్యాలీ అని కూడా పిలుస్తుంటారు. ఇక్క‌డ విలాసవంతమైన షాపింగ్ మాల్స్ నుండి అనేక IT కంపెనీలతో పాటు అనేక చారిత్రక ప్రదేశాల వంటి ప్ర‌దేశాలు కూడా చాలానే ఉన్నాయి. ఇక్క‌డ ప్ర‌తి ఒక్క ప్ర‌దేశం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నివసించే వారితో పాటు ఇక్కడికి వచ్చే ప‌ర్యాట‌కులు కూడా ఈ ప్రాంతంలోని ప్ర‌తి స్థ‌లం ఎంతో ఖ‌రీదైన‌ద‌ని భావిస్తారు. ఇక్కడ కొన్ని ఉచిత స్థలాలు కూడా ఉన్నాయ‌నే సంగ‌తి చాలామంది ప‌ర్యాట‌కుల‌కు తెలీదు. అవును, అటువంటి కొన్ని గొప్ప ప్రదేశాలు కూడా ఉన్నాయి. ప‌ర్యాట‌కులు సందర్శించేటప్పుడు ఒక్క పైసా కూడా ఇక్క‌డ ఖర్చు చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఆ ప్ర‌దేశాలేంటో, వాటి ప్రాముఖ్య‌తలేంటో తెలుసుకుందాం ప‌దండి..

బెంగళూరు స్ట్రీట్ ఆర్ట్‌..

బెంగళూరు స్ట్రీట్ ఆర్ట్‌ని ఎంత పొగిడినా మాట‌లు స‌రిపోవు. ఈ ప్రాంతంలోని ప్ర‌తి ఆర్ట్ ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆకర్షిస్తాయి. ప్రత్యేకించి సెయింట్ మార్క్ రోడ్ లేదా కోరమంగళ గోడలపై చాలా అందమైన కుడ్యచిత్రాలను ప‌ర్యాట‌కులు చూడొచ్చు. ఇది బెంగళూరు సంద‌ర్శించే వారికి ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ ఉన్న కళాకారులు సృష్టి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్, కర్ణాటక చిత్రకళా పరిషత్ వంటి సంస్థలకు చెందిన వారు. వీరు ఖాళీగా ఉండే ప్ర‌దేశాల‌లో త‌మ క‌ళ‌తో ఆ ప్రాంతాల‌కు జీవం తెచ్చార‌నే చెప్పుకోవాలి. వారి అద్భుతమైన కళాకృతితో ఫ్లైఓవర్‌లకు ఓ రూపురేఖ‌ల‌ను తీసుకొచ్చారు.

iskcontemple

ఇస్కాన్ ఆలయ సంద‌ర్శ‌న‌...

బెంగుళూరులో ఆధ్యాత్మిక ప్ర‌దేశాలు ఎన్నో ఉన్నాయి. ఇక్క‌డ పురాత‌న ఆల‌యాలు వాటి ప్ర‌త్యేక‌త‌ల‌కు ప్ర‌సిద్ధిచెందాయి. ఈ ప్రాంతంలో ఏదైనా మతపరమైన స్థలాన్ని ఉచితంగా సందర్శించాలనుకునే ప‌ర్యాట‌కులు తప్పనిసరిగా ఇక్క‌డి ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించొచ్చు. ఇస్కాన్ టెంపుల్ శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన ఒక అందమైన ఆలయం. ఈ ఆలయ సముదాయం ప్రార్థనా స్థలంగానే కాకుండా సాంస్కృతిక కేంద్రంగా కూడా ఎంతగానో ప్ర‌సిద్ధిచెందింది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు శాంతి, అపారమైన ఆనందాన్ని అనుభవిస్తార‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.

bangalorepalace1

బెంగళూరు ప్యాలెస్

బెంగళూరు ప్యాలెస్‌లోకి ప్రవేశించడానికి ఎటువంటి రుసుము చెల్లించ‌క్క‌ర్లేదు. ఈ ప్రాంత స‌మీపంలోని ప్రదేశాలను ఉచితంగా చూసేయొచ్చు. ఈ ప్యాలెస్ ట్యూడర్ శైలిలో నిర్మించబడింది, ఈ ప్యాలెస్ ప్రదర్శన ఒక అద్భుత కథ కంటే తక్కువేమీ కాదు. పర్యాటకులు ఈ ప్యాలెస్ యొక్క గొప్పతనాన్నిబయటి నుండి చూసి ఆస్వాదించవచ్చు. ఇక్క‌డి అద్భుత‌మైన అందాల‌ను మీ మీ కెమెరాల‌ల్లో బంధించొచ్చు. బెంగుళూరులో బస చేసేందుకు మంచి ప్రదేశం కోసం వెతుకుతున్నట్లయితే మాత్రం ది డెన్ హోటల్‌కి వెళ్లొచ్చు. ఇక్కడ బస చేసేందుకు రోజుకు 15 వేల రూపాయ‌లు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఇక్క‌డ ది లాఫ్ట్ సూట్, ది డెన్ సూట్, టౌన్‌హౌస్ సూట్స్ కూడా ఉన్నాయి. లగ్జరీ కావాల‌నుకునేవారికి పారామౌంట్ సూట్ వంటి సూట్‌లు కూడా ఉన్నాయి.

cubbonpark

కబ్బన్ పార్కును చుట్టేయొచ్చు...

బెంగుళూరు పార్కులలో అత్యంత ప్ర‌సిద్ధి చెందింది కబ్బన్ పార్క్. ఈ పార్క్ నగరపు సందడి నుండి ప్ర‌శాంత‌మైన వాతావరణాన్ని అందించేందుకు ప‌ర్యాట‌కుల‌కు ఎంతగానో దోహ‌ద‌ప‌డుతుంది. ఈ పార్క్ 300 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాంతం ఎంతో అనువైన‌ది. బెంగుళూరులో కొన్ని మంచి క్షణాలు గడపాలనుకుంటే మాత్రం త‌ప్ప‌కుండా ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించొచ్చు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+