Search
  • Follow NativePlanet
Share
» »అక్షయ తృతీయ నాడు దేశంలోని ఈ ఆల‌యాల‌ను సంద‌ర్శించాల్సిందే..!

అక్షయ తృతీయ నాడు దేశంలోని ఈ ఆల‌యాల‌ను సంద‌ర్శించాల్సిందే..!

అక్షయ తృతీయ హిందూ మతంలో ఎంతో ప్రత్యేకమైనది. ఇక‌, ఈ ఏడాది అక్ష‌య‌తృతీయ మే 10వ తేదీన వ‌చ్చింది. హిందూ నమ్మకాల ప్రకారం ఈ తేదీ ఎంతో శుభప్రదమైన‌దిగా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఎటువంటి శుభ ముహూర్తాలు లేకుండానే చాలామంది కొత్త పనిని ప్రారంభించడం, శుభ‌కార్యాలు చేసుకోవ‌డం లేదా కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేయడం వంటివి జరుగుతాయి. భారతీయ సంప్రదాయం ప్రకారం, ఈ రోజున బంగారు ఆభరణాలు ధరించడం.

లక్ష్మీ దేవిని పూజించడం ఎంతో ముఖ్యం. అక్ష‌య‌తృతీయ నాడు దేశంలోని పెద్ద పెద్ద దేవాలయాల తలుపులు కూడా తెరుస్తారు. కొన్ని చోట్ల ఈ రోజున‌ రథశత్రం ప్రారంభమవుతుంది, కొన్ని చోట్ల ఆలయాల తలుపులు తెరుస్తారు. భార‌త్‌లోని ప్ర‌సిద్ధిచెందిన పుణ్య‌క్షేత్రాల‌లో అక్ష‌య తృతీయ ఎంతో ప్ర‌త్యేకం. ఈ ఆల‌యాల్లెంటో చూసేద్దాం..

badrinathtemple

బద్రినాథ్ ఆలయ తలుపులు తెరుచుకుంటాయి...

అక్షయ తృతీయ రోజున ఉత్త‌రాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. దీపావళి తర్వాత, ఈ ఆలయ తలుపులు 6 నెలల పాటు మూసివేయబడ‌తాయ‌నే సంగ‌తి తెలిసిందే. తలుపులు మూసిన రోజున దేవతలు ఇక్కడికి వచ్చి స్వామిని పూజిస్తారని ఇక్క‌డి ప్రతీతి. ప్రతి సంవత్సరం ఈ రోజు కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అంతే కాదు, వీటితో పాటు కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి ద్వారాలు అక్ష‌య‌తృతీయ నాడే తెరుచుకుంటాయి.

jagannathtemple

పూరిలో రథ నిర్మాణం ప్రారంభం..

ఒడిశాలోని జగన్నాథ ఆలయంలో అక్షయ తృతీయ ఎంతో ప్ర‌త్యేకమ‌నే చెప్పుకోవాలి. నిజానికి ఇక్క‌డ ప్ర‌తి ఏటా జగన్నాథ యాత్ర అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ప్రయాణంలో జగన్నాథుడు తన సోదరుడు బలరామ్, సుభద్రతో కలిసి రోడ్డుపై వేర్వేరు రథాలపై ప్రయాణిస్తాడు. ఈ రథాల నిర్మాణం అక్షయ తృతీయ రోజు నుండి ప్రారంభమవుతుంది. ఈ రోజున పాండాలు జగన్నాథుని నుండి దండలు తీసుకుంటారు. అంతేకాదు, ఇక్క‌డ‌ రథం నిర్మాణానికి ముందు పూజలు కూడా నిర్వహిస్తారు.

chandanyatra1

చందన్ యాత్ర..

గౌడియ వైష్ణవ దేవాలయాల్లో అక్ష‌య తృతీయ ఎంతో ప్రత్యేకంగా నిర్వ‌హిస్తారు. ఈ పవిత్ర పండుగ నాడు చందన్ యాత్ర ఇక్కడ జరుగుతుంది. గౌడియ వైష్ణవ దేవాలయాల్లో దేవుడు ఈ స‌మ‌యంలో ఎంతో వేడిగా ఉంటాడని భ‌క్తుల విశ్వాసం. కావున, ఈ సందర్భంగా, వేడిని పోగొట్టేందుకు దేవతలకు చందనం పూత పూస్తారు. దేవాలయాలలో ఇది అక్షయ తృతీయ నుండి గురు పూర్ణిమ వరకు జరుపుకునే భారీ పండుగ.

నరసింహ స్వామి అద్భుత దర్శనం..

ఆంధ్రప్రదేశ్‌లోని సింహాచలం ఆలయంలో అక్షయ తృతీయ ఎంతో ప్ర‌త్యేకం. ఈ ప్రత్యేక సందర్భంలో వరాహ నరసింహ స్వామి భక్తులకు దర్శనమిస్తాడు. భగవంతుడు ఏడాది పొడవునా గంధపు చెక్కతో కప్పబడి ఉంటాడు. అందుకే శివుడు లింగంలా కనిపిస్తాడు. అక్షయ తృతీయ నాడు మాత్రమే భగవంతుని అవతారాన్ని ప్రజలు చూడ‌గ‌ల‌ని ఇక్క‌డి వారు చెబుతున్నారు. అక్షయ తృతీయ పర్వదినాన ఇక్కడికి భక్తులు పోటెత్తడానికి ఇది ఒక ముఖ్య కారణమ‌ట‌..!

గరుడ సేవ ఉత్సవాలు ప్రారంభం..

అక్షయ తృతీయ రోజున, తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం ఆలయంలో గరుడ సేవ ఉత్స‌వాలు ప్రారంభమవుతాయి. ఈ ప్రత్యేకమైన రోజున, సమీపంలోని 12 ప్రసిద్ధ దేవాలయాలలో కూడా ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.

బాంకే బీహార్ పాదాల దర్శనం..

అక్షయ తృతీయ రోజున బృందావన్‌లోని బాంకే బిహారీ దేవాలయం పెళ్లికూతురులా ముస్తాబ‌వుతుంది. భక్తులు భగవంతుని పాద పద్మాలను దర్శించుకునే రోజు ఇది. ఇక్క‌డి భగవంతుని పాదాలను ఏడాది పొడవునా తామరపూలతో కప్పి ఉంచుతారు. వాటిని కేవ‌లం అక్షయ తృతీయ రోజున మాత్రమే భక్తులకు ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+