ఢిల్లీలోని చాందినీ చౌక్ పర్యాటకులలో ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇక్కడ అన్నీ వస్తువులూ లభిస్తాయి. అతి తక్కువ ధరలకే ప్రతి ఒక్క వస్తువూ ఈ మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీని సందర్శించాలనుకునే వారు తప్పకుండా చాందినీ చౌక్‌ను సందర్శిస్తారు. ప్రస్తుతం పండుగల సీజన్, పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది కాబట్టి, ఇంకా ఇక్కడ రద్దీ మాములుగా ఉండదు. కానీ, మినీ చాందీని చౌకగా ప్రసిద్ధిచెందిన మార్కెట్‌ను చూశారు. ఇది మరెక్కడో లేదండోయ్.. నోయిడాలో ఉంది. నోయిడా ప్రజల కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఒక చాందినీ చౌక్ ఉంది. దీనిని అట్టా మార్కెట్ అని కూడా పిలుస్తారు. ఈ మార్కెట్‌లో కూడా ప్రతి వస్తువు అందుబాటులో ధరలకే లభిస్తుంది. అన్నిరకాల వస్తువులను ఇక్కడ కొనుగోలు చేయొచ్చు.
అట్టా మార్కెట్‌కి ఎలా చేరుకోవాలి?
అట్టా మార్కెట్‌ను కారు, ఆటో లేదా బైక్ ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఇక్కడ నోయిడా అథారిటీ పార్కింగ్ సౌకర్యం కూడా పొందే అవకాశం ఉంది. అట్టా మార్కెట్‌కి చేరుకోవడానికి మెట్రోలో ప్రయాణించడం ఉత్తమమైన ఎంపికగా చెప్పుకోవచ్చు. దీని కోసం ముందుగా నోయిడాలోని సెక్టార్ 18 మెట్రో స్టేషన్‌ను చేరుకోవాల్సి ఉంటుంది. ఈ మార్కెట్ ప్రతిరోజూ ఉదయం పదిగంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంటుంది. అందుకే ఈ ప్రాంతంలో ఎప్పుడైనా షాపింగ్ చేయొచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఈ ప్రాంతానికి వెళ్లొచ్చు.

షాపింగ్ చేసేందుకు ఎంతో అనువైనది..
నోయిడాలోని అట్టా మార్కెట్ అమ్మాయిలకు ఇష్టమైన షాపింగ్ మార్కెట్‌గా మారింది. అట్టా కా పుర మార్కెట్ రోడ్డులో నిర్మించబడింది. ఈ ప్రాంతానికి సులభంగా చేరుకోవచ్చు. షాపింగ్‌కు చాందీన్ చౌక్‌కు వెళ్లాలనుకుంటే మాత్రం ఆ ప్రాంతమంతా ఎంతో రద్దీగా ఉంటుంది. ఎర్రకోట అదే ప్రాంతానికి సమీపంలో ఉండడవల్ల అక్కడ నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ షాపింగ్‌కు వెళ్లినవారికి తప్పకుండా ట్రాఫిక్ చిక్కులు తప్పవు. కానీ, అట్టా మార్కెట్‌లో అంత ట్రాఫిక్ ఉండదు. ప్రశాంతంగా ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. ఈ మార్కెట్‌లోని ప్రతి దుకాణం వద్ద బేరసారాలు చేయొచ్చు.

నోయిడా చాందినీ చౌక్?
పర్యాటకులు ఈ ప్రాంతంలో షాపింగ్ వస్తువులు, ఆహారం, పానీయాలతో పాటు ఇంటి అలంకరణ వస్తువులను సరసమైన ధరలకే కొనుగోలు చేయొచ్చు. ఒకే స్థలంలో అన్ని వస్తువులను ఒకేసారి పొందే అవకాశం ఈ మార్కెట్లో మాత్రమే సాధ్యపడుతుంది. దీపావళి వంటి పండుగ సందర్భాల్లో ఈ మార్కెట్ కూడా విద్యుద్దీపాలతో ముస్తాబయ్యి పర్యాటకులను మరింతగా తన అందంతో కట్టిపడేస్తుంది. అందుకే ఈ ప్రాంతాన్ని మినీ చాందినీ చౌక్‌గా అభివర్ణిస్తున్నారు.
రుచికరమైన వంటకాలకు కూడా ప్రసిద్ధిచెందింది..
ఈ మార్కెట్‌కు కేవలం షాపింగ్‌కు మాత్రమే కాకుండా ఎన్నో రుచికరమైన వంటకాలకు కూడా ఎంతగానో పేరుగాచింది. ఇక్కడ ప్రతి ఒక్క వంటకాన్ని పర్యాటకుడు టేస్ట్ చేయాల్సిందే. విభిన్నమైన రుచులు కూడా ఇక్కడ లభిస్తాయి. ఇక్కడి స్ట్రీట్‌ఫుడ్ పర్యాటకులకు ఎంతగానో నచ్చుతుంది. పానీపూరి నుంచి, ఛాట్, సమోస వంటివేకాకుండా ఇంకా ఎన్నో రకాల తిండి పదార్థాలు ఇక్కడ లభిస్తాయి.



Click it and Unblock the Notifications












