Search
  • Follow NativePlanet
Share
» »హైద‌రాబాద్‌లోని ఈ రిసార్ట్ అచ్చం హ్యారీ పోట‌ర్ హాగ్వార్డ్‌లానే ఉంటుంది..

హైద‌రాబాద్‌లోని ఈ రిసార్ట్ అచ్చం హ్యారీ పోట‌ర్ హాగ్వార్డ్‌లానే ఉంటుంది..

హ్యారీ పోటర్ ప్రపంచాన్ని చూడాల‌ని ప్ర‌తి ఒక్క‌రికీ ఉంటుంది. ఇక‌, పిల్ల‌ల‌కైతే ఈ మాయ ప్ర‌పంచంలోకి ఎప్పుడెప్పుడూ వెళ్దామా అని అనుకుంటూ ఉంటారు. ఈ మాయ ప్ర‌పంచాన్ని నిజ జీవితంలో జీవించాలని కలలుగన్నట్లయితే, ఇప్పుడు ఈ కలను నిజం చేసుకునే సమయం వచ్చింది. అచ్చం హ్యారీ పోట‌ర్స్ హాగ్వార్డ్స్‌ని పోలీ ఉన్న ప్యాలెస్ గురించి మ‌నం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇది మ‌రెక్కడో లేదు. తెలంగాణలోని హైద‌రాబాద్‌లో ఉంది. హైదరాబాద్‌లోని ఒక రహస్య ప్యాలెస్ గురించి మ‌నం ఇప్ప‌డు చెప్పుకుంటున్నాం. ఇది హ్యారీ పోటర్స్ హాగ్వార్డ్స్‌ని పోలి ఉంటుంది.

హైదరాబాద్‌లో 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 'ది హిడెన్ కాస్ట‌ల్' రిసార్ట్ ఇది. ఈ ర‌హ‌స్య ప్ర‌దేశానికి క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ సెల‌వుల్లో సరాదాగా విహ‌రించొచ్చు. రోజువారీ జీవితం నుంచి విసుగు చెంది ఉండే త‌ప్ప‌కుండా ఈ మాయ‌జాల‌పు ప్ర‌పంచంలోకి అడుగుపెట్టాల్సిందే. ఇక్క‌డి వాతావ‌రంలో మీ అలసట అంతా క్షణంలో ఎగిరిపోతుంది.

resortinhyderabadislikeharrypottershogwarts

ఐదేళ్ల పిల్ల‌ల‌కు ఎటువంటి ఛార్జీలు ఉండ‌వు..

ఇక్క‌డ కొన్ని రోజులు విశ్రాంతి కూడా తీసుకోవచ్చు. లాంగ్ వీకెండ్‌కు ఇక్క‌డికి వ‌చ్చయొచ్చు. ఈ రిసార్ట్‌లో బ‌స చేసేందుకు అన్ని వ‌ర్గాల వారికి అనువైన గదులు అందుబాటులో ఉన్నాయి. వివిధ వర్గాల గదులను బుక్ చేసుకోవచ్చు. హిడెన్ కాస్ట‌ల్‌ రిసార్ట్‌లో, ప‌ర్యాట‌కులకు ప్రెసిడెన్షియల్ సూట్, హెరిటేజ్ సూట్, అట్టిక్ రూమ్ నుండి క్యాంపింగ్, గ్రూప్ బుకింగ్ నుండి బుకింగ్ చేసుకునే ఎంపికను చేసుకునే వీలుంటుంది. ఇక్క‌డ అన్ని రకాల రూమ్ బుకింగ్‌లతో పాటు జిప్ లైన్, ఆర్చరీ, భోగి మంటలు, కమాండో నెట్, క్రికెట్, వుడ్ వాక్, సైక్లింగ్ మొదలైన అనేక రకాల కార్యకలాపాలను చేసే అవకాశం లభిస్తుంది. ఈ అన్ని రకాల గదులలో 5 సంవత్సరాల‌ పిల్లలకు ఎటువంటి ఛార్జీలు తీసుకోబ‌డ‌వు. అంత కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు రాత్రికి రూ. 7,000-8,000 చెల్లించాల్సి ఉంటుంది.

ఒక్క‌రోజులో ఎన్నో కార్య‌క్ర‌మాల‌ను చూడొచ్చు..

వీటితోపాటు ఇక్క‌డ రుచికరమైన ఆహారాన్ని, పానీయాలను ఆస్వాదించొచ్చు. ఇంకా ఇక్క‌డ విహ‌రించేందుకు పార్కింగ్, స్విమ్మింగ్ పూల్, ట్రెక్కింగ్, కారవాక్, ఆక్వా సర్క్యూట్, రెయిన్ డ్యాన్స్, వర్టికల్ లిమిట్, బీచ్ వాలీబాల్, మ్యూజియం, లండన్ బ్రిడ్జ్, ట్రీ టాప్ వాక్, ఆర్మీ యాక్టివిటీ మొదలైనవి కూడా ఈ రిసార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ రిసార్ట్‌లో చాలా ఆఫర్లు ఉన్నాయి. ఇందులో ఒక్క‌ రోజు పర్యటనను బుక్ చేసుకోవ‌చ్చు. ఈ 8 గంటల ట్రిప్‌లో,ఇక్క‌డి అనేక కార్యకలాపాలను ఆస్వాదించే అవకాశాన్ని పొందుతారు. వెల్‌కమ్ డ్రింక్, లంచ్, హై టీ, వెజ్ స్నాక్స్ రెయిన్ డ్యాన్స్ ఆల్ రైడ్‌లు, గేమ్స్ స్విమ్మింగ్ పూల్ ఆక్వా సఫారి మ్యాజిక్ షో మ్యూజియం ఇంకా మ‌రెన్నో కార్య‌క్ర‌మాల‌ను ఆస్వాదించొచ్చు. ఈ ట్రిప్‌లో ఒక్కొక్కరికి సుమారు 1,500 రూయ‌లు చెల్లించాల్సి ఉంటుంది. దీనికోసం ఆన్‌లైన్ బుకింగ్ కూడా చేసుకోవ‌చ్చు.

ఎలా చేరుకోవాలి..

ఈ ప్ర‌దేశం ఫోటోగ్రఫీల‌కు, ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్‌కు కూడా ఎంతో అనువైన‌ది. ఈ రిసార్ట్‌లో ఫోటోషూట్ బుకింగ్‌లో గదిని మార్చుకునే సదుపాయం, డ్రోన్ వంటి అవ‌కాశాల‌ను కూడా పొందుతారు. అయితే, ఫోటోషూట్ కోసం ఈ రిసార్టు ఏ ఫోటోగ్రాఫర్‌ల‌ను మీరే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీలో వెల్‌కమ్ డ్రింక్, లంచ్, హై టీ మరియు వెజ్ స్నాక్ కూడా ఉంటాయి. ఈ రిసార్ట్ సికింద్రాబాద్/హైదరాబాద్ జూబ్లీ బస్టాండ్ నుండి సుమారు 69 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. సికింద్రాబాద్-కరీంనగర్ హైవేపై ఉంది. ప్రెగ్నాపూర్ పట్టణానికి 17 కిలోమీటర్ల దూరంలో గజ్వేల్ సమీపంలో ఈ రిసార్ట్ ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి హైదరాబాద్ నుండి క్యాబ్‌లు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+