Search
  • Follow NativePlanet
Share
» »తెలంగాణ‌లో ప్ర‌ముఖ దేవాల‌యాల సంద‌ర్శ‌న కోసం ఈ టూర్ ప్యాకేజీ..!

తెలంగాణ‌లో ప్ర‌ముఖ దేవాల‌యాల సంద‌ర్శ‌న కోసం ఈ టూర్ ప్యాకేజీ..!

తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌సిద్ధిచెందిన ఆల‌యాలు ఎన్నో ఉన్నాయి. ఈ సెల‌వుల్లో ఆధ్యాత్మిక ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించాల‌నుకునేవారి కోసం తెలంగాణ టూరిజం ఓ స‌రికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా హైద‌రాబాద్‌లోని ప‌లు ప్ర‌ముఖ దేవాల‌యాల‌ను వీక్షించొచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా కాళేశ్వరం, రామప్ప, వెయ్యి స్తంభాల గుడి, యాదగిరిగుట్టి, కీసరగుట్ట ఆలయాలను సందర్శించవచ్చు. వీటిని కేవ‌లం రెండురోజుల్లోనే ద‌ర్శించుకోవ‌చ్చు.

అతి త‌క్కువ ధ‌ర‌లో పుణ్య‌క్షేత్రాల ద‌ర్శ‌న భాగ్యం పొందొచ్చు. తెలంగాణ టూరిజం కాక‌తీయ రీజియ‌న్ పేరుతో ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీ ప్రతి శనివారం, ఆదివారం ప‌ర్యాట‌కుల‌కు అందుబాటులో ఉంటుంది. నాన్ ఏసీ కోడ్ ద్వారా ఈ టూర్ ఉంటుంది. కేవ‌లం పెద్దలకు- రూ.2999, పిల్లలకు- రూ.2399తో ఈ ప్ర‌యాణాన్ని ఆస్వాదించొచ్చు. నాన్-ఏసీ హైటెక్ కోచ్‌లో ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. కాళేశ్వరం హరిత హోటల్‌లో ఫ్రెష్ అప్ అయిన వెంట‌నే ఈ పుణ్య‌క్షేత్రాల‌ను ద‌ర్శించుకోవ‌చ్చు.ఈ టూర్ ప్యాకేజీలో దర్శనం టికెట్లు, ఆహారం మినహాయింపు ఉంటుంది.

housandpillartemple

ప‌ర్య‌ట‌న షెడ్యూల్‌..

ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా మొద‌టిరోజు 09:30 PM సీఆర్వో బషీర్‌బాగ్ నుంచి బస్సు బయలుదేరుతుంది. అదేరోజు ఉద‌యం ప‌దిగంట‌ల‌కు యాత్రి నివాస్ నుంచి కాళేశ్వరం బయలుదేరుతుంది. మ‌రుస‌టి రోజు ఉద‌యం 05.00 AM గంట‌ల‌కు కాళేశ్వరం చేరుకుంటారు. 05.00 AM నుంచి 07.00 AM వరకు - కాళేశ్వరం ఆలయ దర్శనం ఉంటుంది. 07.00 AM - కాళేశ్వరం నుంచి రామప్పకు బయలుదేరతారు. అనంత‌రం తొమ్మిది నుంచి 11.00 గంట‌ల సమ‌యంలో రామప్ప వద్దకు చేరుకుంటారు.

అక్కడ టిఫిన్ చేసి, రామ‌ప్ప ఆల‌య ద‌ర్శ‌నానికి వెళ్తారు. ఆ త‌ర్వాత ప‌ద‌కొండు గంట‌ల స‌మ‌యంలో రామ‌ప్ప నుంచి బస్సు వరంగల్‌కు బయలుదేరుతుంది. 12.30 PM నుంచి మధ్యాహ్నం 02.30 PM స‌మ‌యంలో వరంగల్ చేరుకుని హరిత హోటల్‌లో మ‌ధ్యాహ్న భోజ‌న కార్య‌క్ర‌మం ఉంటుంది. 02.30 PM - హన్మకొండ నుంచి యాదగిరిగుట్టకు బస్సు బయలుదేరుతుంది.

kaleswaram dam

యాద‌గిరి గుట్ట ఎంతో ప్ర‌త్యేకం..

04.30 PM నుంచి 06.00 గంట‌ల స‌మ‌యానికి యాదగిరిగుట్ట చేరుకుంటాము. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సందర్శన ఉంటుంది. తెలంగాణ‌లో ప్ర‌సిద్ధిచెందిన ఆల‌యంలో ఇది ఒక‌టి. ఇక్క‌డికి వ‌చ్చిన వారు త‌మ కోరిక‌లు నెర‌వేరేందుకు న‌ర‌సింహ‌స్వామివారికి త‌మ మొక్కులు చెల్లించుకుంటారు. యాద‌గిరిగుట్ట‌పై వెల‌సిన స్వామివారిని ఇక్క‌డికి వ‌చ్చేవారు ఎంతో భ‌క్తితో కొలుస్తారు. ఈ ఆల‌యం స‌మీపంలో ప్ర‌కృతి అందాల‌ను ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి.

ఇక ఇక్క‌డినుంచి కీసరగుట్టకు ప్ర‌యాణం ఉంటుంది. 07.15 PM నుంచి 08.00 గంట‌ల స‌మ‌యంలో కీసరగుట్ట ఆలయం చేరుకుని దర్శనం చేసుకుంటారు. హైదార‌బాద్‌లోని ఈ ఆల‌యం కూడా ఎంతో పేరుగాంచింది. భాగ్య‌న‌గ‌ర‌వాసుల‌యితే ప్ర‌తి వీకెండ్‌లో ఇక్క‌డికి వ‌స్తుంటారు. ఇక‌, ఎనిమిదిగంట‌ల స‌మ‌యంలో కీసరగుట్ట నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్ర‌యాణం ఉంటుంది. తొమ్మిది గంట‌ల‌స‌మ‌యంలో హైద‌రాబాద్ చేరుకుంటాం. దీంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తోంది. మ‌రెందుకాల‌స్యం మీరు కూడా ఈ టెంపుల్ టూర్ ప్యాకేజీ ప్ర‌యాణానికి సిద్ధం కండి. హైద‌రాబాద్‌లోని పుణ్య‌క్షేత్రాల‌ను ద‌ర్శించుకోండి.

More News

Read more about: hyderabad telangana
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+