Search
  • Follow NativePlanet
Share
» »క‌ర్ణాట‌క‌లోని ఆధ్యాత్మిక ప్రాంతాల సంద‌ర్శ‌న కోసం ఈ టూర్ ప్యాకేజీ..

క‌ర్ణాట‌క‌లోని ఆధ్యాత్మిక ప్రాంతాల సంద‌ర్శ‌న కోసం ఈ టూర్ ప్యాకేజీ..

క‌ర్ణాట‌క‌లో ప్ర‌సిద్ధిచెందిన పుణ్య‌క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అతి త‌క్కువ ధ‌ర‌తోనే క‌ర్ణాట‌క‌లోని ఈ ప్రాంతాల‌ను సందర్శించాల‌నుకునేవారికి ఐఆర్‌సిటిసి ఓ స‌రికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. కోస్టల్ కర్ణాటక పేరిట ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ టూర్ ప్యాకేజీలో మొత్తం 5 రాత్రులు, 6 పగ‌ళ్లు ఉండనుంది. ఈ ప్యాకేజీలోని భాగంగా కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలైన మురుడేశ్వర్, శృంగేరి, ఉడుపి ప్రాంతాల‌ను సంద‌ర్శించేయొచ్చు.

ఈ ప్యాకేజీనీ బుక్‌చేసుకుని ఎంచక్కా 5 రాత్రులు, 6 రోజుల పాటు క‌ర్ణాట‌క‌లోని ఆయా ప్రదేశాలను చుట్టి రావచ్చు. ఈ ప్యాకేజీ జూన్ 11,2024 న ప‌ర్యాట‌కుల‌కు అందుబాటులో ఉంటుంది. ఈ తేదీ మిస్ అయినా మ‌రో తేది అందుబాటులో ఉంటుంది. ప్ర‌తి మంగ‌ళ‌వారం ఈ టూర్ అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ వివ‌రాలేంటో చూసేద్దాం..

murudeshwar1

ఐదు రోజుల టూర్ షెడ్యూల్‌...

ఇది రైలు ప్రయాణం. ఈ ప్రయాణంలో ఏన్నో ఆధ్యాత్మిక ప్రాంతాల‌ను సంద‌ర్శించుకోవ‌చ్చు. ఈ టూర్ లో భాగంగా ఉడిపి, శృంగేరి, మురుడేశ్వ‌ర్ వంటి ప్రాంతాల‌ను చూడొచ్చు. ఐదు రాత్రులు, ఆరు ప‌గ‌ళ్లుతో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ లో భాగంగా మొద‌టి హైద‌ర‌బాద్ నుంచి ఉద‌యం ఆరుగంటకు ట్రైన్ బ‌య‌లుదేరుతోంది. మరుసటి రోజు ఉదయం ఉడిపి చేరుకున్నాక‌, అక్కడ హోటల్‌లో రీఫ్రెష్ అయ్యి.. శ్రీకృష్ణ దేవాలయం, సెంట్ మెరీస్ ఐలాండ్స్, మాల్పే బీచ్ సంద‌ర్శ‌న ఉంటుంది. మూడో రోజు ఉదయం హోటల్ నుండి చెకౌట్‌ చేసి శృంగేరి వెళ్తారు. అక్కడ శారదాంబ టెంపుల్ చూశాక కొల్లూర్‌కు బ‌యలుదేరుతారు. కొల్లూర్‌లో మూకాంబికా అమ్మవారి ఆలయం సంద‌ర్శ‌న ఉంటుంది.

అక్కడి నుండి మురుడేశ్వర్ సందర్శనకు ప్ర‌యాణం చేస్తారు. రాత్రికి అక్కడికి చేరుకుంటారు. నాలుగో రోజు ఉదయం అక్కడి నుండి జోగ్ వాటర్ ఫాల్స్‌కి టూర్ ఉంటుంది. అద‌య్యాక గోకర్ణకు బయలుదేరతారు. అక్కడ ఆలయంలో దర్శనం అనంతరం పక్కనే ఉన్న బీచ్‌ల‌ను తిల‌కిస్తారు. రాత్రికి తిరిగి మురుడేశ్వర్ చేరుకుంటారు. ఐదో రోజు ఉదయం మురుడేశ్వర్ నుండి బయలుదేరి మంగళూరుకు చేరుకుంటారు. అక్కడ మంగళ దేవిని ద‌ర్శించుకుని, సాయంత్రం 7 గంటలకు మంగళూరు రైల్వేస్టేషన్‌లో వదిలేస్తారు. అక్కడి నుండి రాత్రి 8:05 గంటలకు కాచీగూడ రైలులో తిరుగు పయనమవుతారు. దీంతో ఈ టూర్ కాస్త ముగుస్తోంది.

sringeri

టూర్ ధ‌ర‌ల షెడ్యూల్..

హైద‌రాబాద్ క‌ర్ణాట‌క టిక్కెట్ ధ‌ర‌లు చూస్తే కంఫ‌ర్ట్ క్లాసులో సింగిల్ షేరింగ్‌కు 37970 ధ‌ర పలుక‌గా, డ‌బుల్ షేరింగ్‌కు రూ. 21820 చెల్లించాల్సి ఉంటుంది. అదే స్టాండ‌ర్డ్ క్లాసులో చూస్తే గ‌నుక సింగిల్ షేరింగ్‌కు రూ.34980 చెల్లించాలి. డ‌బుల్ షేరింగ్‌కు 18830 గా నిర్ణ‌యించారు. అదే ట్రిపుల్ షేరింగ్ అయితే, రూ. 14430 గా నిర్ణ‌యించారు. ఈ టూర్ ప్యాకేజీలో టిక్కెట్లు , హోట‌ల్ వ‌స‌తి, టిఫిన్‌, లంచ్, డిన్న‌ర్‌, వీసా ఛార్జీలు, ట్రావెల్ ఇన్యూరెన్స్ అన్నీ క‌వ‌ర్ అవుతాయి. టోల్, పార్కింగ్, జీఎస్టీ కూడా ప్యాకేజీలోనే ఉంటాయి. పూర్తి వివ‌రాల కోసం ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు.

udupi

టూర్ ప్యాకేజీలో ఉండ‌నివి..

ఇక, ఈటూర్ ప్యాకేజీలో ఉండేవి పైన వివ‌రించాము. అలాగే, ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణంలో భోజనాలు ఉండవు. అలాగే సందర్శనీయ ప్రాంతాల్లోనూ మధ్యాహ్నం, రాత్రి వేళ భోజన ఏర్పాట్లు ప్యాకేజీలో ఉండ‌వు. ఆ ఖ‌ర్చుల‌న్నీ ప‌ర్యాట‌కులు చూసుకోవాల్సి ఉంటుంది. సందర్శనీయ స్థలాల్లోని ఎంట్రీ టికెట్లు కూడా ప్యాకేజీలో ఉండవు. ఇక హార్సింగ్, బోటింగ్, వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నీ వారే చూసుకోవాలి. ఒకవేళ ఈ ప్యాకేజీ ఎంచుకున్నాక ఇతర కారణాల వల్ల టూర్ రద్దు చేసుకోవాలంటే క్యాన్సిలేషన్ పాలసీ కూడా ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ని సందర్శించండి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+