Search
  • Follow NativePlanet
Share
» »వావ్...వేసవి విడిది - కూల్ ...కూల్ .. ఎర్కాడ్ !

వావ్...వేసవి విడిది - కూల్ ...కూల్ .. ఎర్కాడ్ !

వేసవి వచ్చిందంటే, తమిళనాడు లోని సేలం జిల్లలో కల ఎర్కాడ్ హిల్స్ కు అనేకమంది పర్యటిస్తారు. ఈ హిల్ స్టేషన్ ఎంతో ప్రశాంతం, చల్లదనం. వేసవిలో విద్యార్ధులకు సెలవులు కూడా వస్తాయి కాబట్టి, దక్షినాది వారికి సమీపంలో కల ఎర్కాడ్ పిల్లలను, పెద్దలను అధిక సంఖ్యలో ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతానికి చాలా మంది కుటుంబ సమేత పర్యటన చేస్తారు. వాస్తవానికి సౌత్ ఇండియాలో హిల్ స్టేషన్ లు కొద్ది సంఖ్యలో కలవు. అది కూడా ఇక్కడ పడమటి కనుమలు, మరియు తూర్పు కనుమలు ఉండబట్టి. ఊటీ, మున్నార్, ఆగుంబే, చికమగాలూర్, కొడైకెనాల్, కూర్గ్ లు సౌత్ ఇండియాలో కల కొన్ని ప్రధాన హిల్ స్టేషన్ లు. అందమైన ఈ ఎర్కాడ్ హిల్ స్టేషన్ చెన్నై నుండి 360 కి. మీ. లు, బెంగుళూరు నుండి 228 కి. మీ. ల దూరంలో కలదు.

సేర్వారాయన్ టెంపుల్

సేర్వారాయన్ టెంపుల్

తూర్పు కనుమల లోని శేవరాయ్ పర్వత శ్రేణులలో కల ఎర్కాడ్ సముద్ర మట్టానికి 4970 అడుగుల ఎత్తున కలదు. ఎర్కాడ్ హిల్ స్టేషన్ లో అత్యధిక ఎత్తు కల ప్రదేశం సేర్వారాయన్ టెంపుల్.

Photo Courtesy: varun suresh

అందమైన సరస్సు

అందమైన సరస్సు

ఈ హిల్ స్టేషన్ లో కల ఒక అందమైన సరస్సు, మరియు అటవీ ప్రదేశం దీనికి మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఈ హిల్ స్టేషన్ నేషనల్ హై వే 28 ద్వారా సేలం పట్టణానికి కలుపబడి వుంది.
28. Photo Courtesy: BoyGoku

వాతావరణం

వాతావరణం

ఎర్కాడ్ లోని ఉష్ణోగ్రతలు ఒక మోస్తరుగా చల్లగా వుంటాయి. ఉష్ణోగ్రత లు ఈ ప్రదేశంలో అధికం 29 కనిష్టం 13 డిగ్రీ సెల్సియస్ గా ఎల్లపుడూ వుంటాయి. కనుకనే ఇక్కడ నిమ్మ పండ్లు, కాఫీ తోటలు పెంచుతారు.
Photo credit :Subharnab Majumdar

ప్రకృతి దృశ్యాలు

ప్రకృతి దృశ్యాలు

ఇక్కడ కల ప్రకృతి దృశ్యాలు ప్రతి ప్రకృతి ప్రేమికుడిని కట్టి పడవేస్తాయి. ఈ ప్రకృతి ఒడిలో సేద దీరతం ఒక మరువలేని అనుభవం కాగలదు.

Photo Courtesy: Thangaraj Kumaravel

 పురాతన రాతి యుగ పనిముట్లు

పురాతన రాతి యుగ పనిముట్లు

ఎర్కాడ్ సరస్సు నుండి అయిదు కి. మీ. ల దక్షిణంగా కల సేర్వరాయన్ హిల్స్ లో స్టోన్ ఏజ్ కు చెందినా కొన్ని రాతి పనిముట్లు కనుగొనబడ్డాయి. కనుక ఎర్కాడ్ ప్రదేశం, చరిత్ర కారులకు, పురావస్తు శాఖ వారికి ఒక ఆసక్తి కర ప్రదేశం.

Photo Courtesy: Mithun Kundu

ఎర్కాడ్ కాఫీ తోటలు

ఎర్కాడ్ కాఫీ తోటలు

పూర్వం మద్రాస్ రాష్ట్ర గవర్నర్ అయిన సర్ థామస్ మున్రో ఈ ప్రదేశం కనుగొన్నాడు. తర్వాత స్కాటిష్ కలెక్టర్ అయిన డేవిడ్ కాక బర్న్ ఇక్కడ కాఫీ, రేగు పండ్లు, ఆపిల్ వంటి పంటల సాగును ప్రవేశ పెట్టి, ఎర్కాడ్ అభివృద్ధికి పాటుపడి 'ఫాదర్ అఫ్ ఎర్కాడ్ ' గా పేరు గాంచాడు. Photo Courtesy: Jai Kumara Yesappa

టూరిస్ట్ ఆకర్షణలు

టూరిస్ట్ ఆకర్షణలు

ఎర్కాడ్ లో అనేక టూరిస్ట్ ఆకర్షణలు కలవు. వాటిలో లద్య్స్ సీట్ లేదా 90 అడుగుల ఎత్తు కల కిలియూర్ జలపాతాలు, బేర్ కేవ్, గ్రీన్ హౌస్ వంటివి మిమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తాయి.
Photo Courtesy: Subharnab Majumdar

ఎలా చేరాలి ?

ఎలా చేరాలి ?

దక్షిణ భారత దేశ కంట హారంగా చెప్పబడే ఎర్కాడ్ హిల్ స్టేషన్ చెన్నై, బెంగుళూరు లకు రైల్ లేదా రోడ్డు మార్గాలలో అనుసంధానించబడి వుంది. ఈ హిస్స్ స్టేషన్ సేలం పట్టణానికి 36 కి. మీ. ల దూరం మాత్రమే.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+