ఉరుకుల పరుగుల జీవితంలో స్వచ్ఛమైన గాలి పీల్చడం కూడా గగనమై పోతోంది. చుట్టూ కాంక్రీట్ జంగిల్ వంటి నగరాల్లో కలుషితమై పోయిన గాలినే పీల్చుతూ రోగాలను కొని తెచ్చుకొంటున్నాం. ఈ ఉపద్రవం నుంచి అప్పుడప్పుడు బయట పడటానికి వీలుగా అందమైన ఉద్యానవనాల్లో గడపాల్సిందే. భారత దేశంలో వివిధ చోట్ల ఎంతో అందమైన ఉద్యానవానాలు ఉన్నాయి.
మొక్కలను వివిధ ఆకృతుల్లో పెంచుతూ అక్కడి సిబ్బంది పర్యాటకులను ఆకర్షిస్తున్నారు. ఇక ఈ ఉద్యానవనాల్లో వేల, లక్షల చెట్లు ఒకే చోట ఉంటూ స్వచ్ఛమైన గాలిని అందజేస్తున్నాయి. మీరు ఆయా ప్రాంతాలకు వెళ్లినప్పుడు కనీసం ఒక రోజైనా అక్కడ గడపడానికి ప్రయత్నించండి. లేదా మీరు అదే నగరంలో ఉంటే వారంలో కనీసం మూడు రోజులైనా రోజుకు గంట చొప్పున అక్కడ ఉండండి మీ ఆరోగ్యం పదిలమే.

మొగల్ గార్డెన్
P.C: You Tube
షాలిమర్ భా, నిషాత్ భాగ్, ఛస్మాషాహీ కలిసి జమ్ము కాశ్మీర్ లో మొగల్ గార్డెన్ గా పిలుస్తారు. పరిర్షియన్ వాస్తు శైలి లో నిర్మించిన ఈ ఉద్యానవనం లోని వాటర్ ఫౌటెన్లు విశేషంగా ఆకర్షిస్తాయి. వారంలో శుక్రవారం తప్ప మిగిలిన అన్ని రోజుల్లో ఈ ఉద్యానవనంలోకి పర్యాటకులను అనుమతిస్తారు. ప్రవేశ సమయం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ

లాల్ భాగ్
P.C: You Tube
దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న లాల్ భాగ్ బెంగళూరులో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటి. హైదర్ ఆలీ ఈ ఉద్యాన వనం నిర్మాణానికి ప్రధాన కారణం. అటు పై లండన్ నుంచి తెప్పించిన అనేక రకాల చెట్ల జాతులతో ఈ ఉద్యాన వనం నిండిపోయింది. ప్రస్తుతం 1,854 జాతుల చెట్లు ఇక్కడ ఉన్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ వారంలో అన్ని రోజులూ సందర్శించవచ్చు.

మొఘల్ గార్డెన్, ఢిల్లీ
P.C: You Tube
ఢిల్లీలో ఉన్న ఈ మొఘల్ గార్డెన్ ను ప్రతి ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో మాత్రమే సందర్శకుల ప్రవేశానికి అనుమతి. ఈ గార్డెన్ లోనే రాష్ట్రపతి భవన్ ఉంది. ఇక్కడ 33 జాతుల ఔషద మొక్కలు కూడా ఉన్నాయి. తులిప్స్ ఇక్కడ ప్రదాన ఆకర్షణ. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పర్యాటకులకు అనుమతి ఉంటుంది.

నెక్ ఛాంద్ రాక్ గార్డెన్, చండీఘర్
P.C: You Tube
చండీఘర్ లో ఉన్న ఈ ఉద్యానవనంలో వివిధ జాతుల మొక్కలతో పాటు పనికిరాని వస్తువులతో తయారు చేసిన బొమ్మలు విశేషంగా ఆకర్షిస్తాయి. వీకెండ్ సమయంలో ఇక్కడకు ఎక్కువ మంది వస్తుంటారు. అదే విధంగా చండీఘర్ వెళ్లిన వారు తప్పకుండా ఈ ఉద్యానవనాన్ని సందర్శస్తూ ఉంటారు. ఈ ఉద్యానవనం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ సందర్శించవచ్చు.

కమలా నెహ్రూ పార్క్
P.C: You Tube
ముంబై లోని మలబార్ పర్వత శిఖరం పై ఉన్న ఈ కమలా నెహ్రూ పార్క్ ప్రముఖ పర్యాటక కేంద్రం. వర్షాకాలంలో ఈ ఉద్యానవనం మరింత అందంగా కనిపిస్తుంది. ఈ ఉద్యానవనం నుంచి చూస్తే చౌపటీ బీచ్ అందాలు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకూ ఈ ఉద్యానవనాన్ని సందర్శించవచ్చు.

బృందావన్ గార్డెన్
P.C: You Tube
మైసూరులో ఉన్న బృందావన్ గార్డెన్ వినూత్నమైన ఉద్యానవనం. కే.ఆర్.ఎస్ డ్యాం కింది భాగంలో ఉన్న ఈ ఉద్యానవనం మిగిలిన వాటి కంటే బిన్నమైనది. సాయంత్రం పూట సంగీతానికి అనుగుణంగా నాట్యం చేస్తే వాటర్ ఫౌటైన్లను చూసి తీరాల్సిందే. అందులోనూ రంగు రంగుల్లో కనిపించే ఆ ఫౌటైన్ అందాలను సాయంత్రం సమయంలో చూడటం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. వారంలో ఏడు రోజులూ ఈ ఉద్యానవనాన్ని సందర్శించడానికి అవకాశం ఉంది. సందర్శన సమయం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ

మెహతా భాగ్ ఆగ్రా
P.C: You Tube
ఆగ్రాలోని యమునా నది ఒడ్డున ఉన్న ఈ మొహతా భాగ్ అనేక చిత్రాల్లో మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడి నుంచే తాజ్ మహల్ ను షూట్ చేస్తారు. బాబర్ ఈ ఉద్యానవనాన్ని నిర్మించినట్లు చెబుతారు. ఈ ఉద్యానవనం తాజ్ మహల్ కంటే పురాతనమైనది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎప్పుడైనా ఈ ఉద్యానవనాన్ని సందర్శించవచ్చు.

తులీప్ గార్డెన్
P.C: You Tube
సాధారణంగా తులీప్ గార్డెన్ అన్న తక్షణం మనకు జపాన్, నెధర్లాండ్ గుర్తుకు వస్తుంది. అయితే భారత దేశంలో కూడా తులీప్ గార్డెన్ ఉంది. ప్రముఖ పర్యాటక కేంద్రం దాల్ లేక్ కు ఆనుకొనే ఈ తులీప్ గార్డెన్ ఉంది. ఐదు హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ గార్డెన్ అనేక సినిమాల్లో మనకు కనిపిస్తుంది.

ఇండియా డైనోసార్స్ పార్క్
P.C: You Tube
గుజరాత్ లోని అహ్మదాబాద్ కు 65 కిలోమీటర్ల దూరంలో ఈ పార్క్ ఉంటుంది. ఇక్కడ అనేక రకాల చెట్లతో పాటు డైనోసార్స్ శిలాజాలు, వాటి గుడ్లను కూడా చూడవచ్చు. ఇప్పటి వరకూ ఈ ప్రాంతంలో 10వేల డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. ఆ గుడ్లను మనం చేతితో తాకవచ్చు. అంతే కాకుండా సదరు డైనోసార్స్ చర్మాన్ని, ఎముకలను కూడా మనం ఇక్కడ తాకవచ్చు.

బొటానికల్ గార్డెన్, ఊటీ
P.C: You Tube
భారత దేశంలో అత్యుత్తమమైన బొటానికల్ గార్డెన్స్ లో ఊటీలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఉద్యానవం ఒకటి. మొత్తం 22 హెక్టార్లలో ఈ ఉద్యానవనంలో లక్షల మొక్కలు ఉన్నాయి. 20 మిలియన్ సంవత్సరాలకు పూర్వపు చెట్టు అవశేషాలను కూడా మనం ఈ గార్డెన్ లో చూడవచ్చు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సందర్శకులను అనుమతిస్తారు.



Click it and Unblock the Notifications













