Search
  • Follow NativePlanet
Share
» »భలే మంచి చౌక బేరము, మంచి తరుణం మించినా...

భలే మంచి చౌక బేరము, మంచి తరుణం మించినా...

భారత దేశంలో అత్యంత చౌకైన స్ట్రీట్ మార్కెట్ల గురించి కథనం.

షాపింగ్ ఒక కళ. ముఖ్యంగా టూర్లు వెళ్లినప్పుడు అక్కడ చాలా వస్తువుల నచ్చుతాయి. ఎందుకంటే అందులో కొన్ని ఆ ప్రాంతానికి మాత్రమే ప్రతేకం. అటువంటి ప్రత్యేకమైన వస్తువులు మన ఇంట్లోనో, వంటి పైనో ఉండటం ఒక రకమైన గర్వంగా ఫీలవుతాము.

అయితే ఆ వస్తువలు ధరలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. దీంతో సంగం టూర్ లోనే మన పర్స్ కాస్తా చాలా తేలికై పోతుంది. అయితే ముంబై, గోవా, బెంగళూరు ఇలా ఏ పట్టణం తీసుకున్నా అక్కడ తక్కువ ధరల్లో నాణ్యమైన వస్తువులు దొరికే ప్రాంతాలు కొన్ని ఉంటాయి.

అటువంటి చోట షాపింగ్ చేయడం వల్ల మనకు కాస్త తక్కువ ధరకే మనసుకు నచ్చిన వస్తువు సొంతమవుతుంది. ఈ నేపథ్యంలో వివిధ పర్యాటక నగరాల్లో అటువంటి చౌక ధరలకు వస్తువులు దొరికే మార్కెట్లకు సంబంధించిన సమాచారం మీ కోసం...

అర్పోరా బజార్, గోవా

అర్పోరా బజార్, గోవా

P.C: You Tube

గోవా అన్న తక్షణం మనకు బీచ్ లే గుర్తుకు వస్తాయి. ఇక అక్కడ నైట్ లైఫ్ అంటే కేవలం మందు కొట్టేవారికే అన్న సమాధానం వినిపిస్తుంది. అయితే అర్పోరా బజార్ ఆ ఆలోచనను తప్పని నిరూపిస్తుంది. ఆరు గంటల తర్వత తళుక్కుమనే లైటింగ్ తో ఈ ప్రాంతం అంతా సుందరంగా మారిపోతుంది. ఇక్కడ ఖరీదైన జ్యువెలరీ తో పాటు రూ.100 జీన్స్ కూడా లభిస్తుంది. గోవాకు వెళ్లినవారిలో షాపింగ్ అంటే ఇష్టముంటే తప్పకుండా ఇక్కడికి వెళ్లిరావాల్సిందే.

సరోజినీ మార్కెట్ ఢిల్లీ

సరోజినీ మార్కెట్ ఢిల్లీ

P.C: You Tube

స్ట్రీట్ మార్కెట్ లో సరోజినీ మార్కెట్ ది ప్రత్యేక స్థానం. ఇక్కడ ఎక్స్ పోర్ట్ క్వాలిటీ సరుకు కూడా అత్యంత తక్కువ ధరకు దొరుకుతుంది. అందుకే ఢిల్లీ వాసుల్లో ఎక్కువ మంది ఇక్కడే షాపింగ్ చేయడానికి ఇష్టపడుతారు. సరికొత్త ఫ్యాషన్ దుస్తులకు ఈ సరోజినీ మార్కెట్ పెట్టింది పేరు. బేరమాడే సమార్థ్యం ఉంటే మీరు ఇక్కడ అత్యంత తక్కువ ధరకే వస్తువులను సొంతం చేసుకోవచ్చు.

ఎఫ్.సీ మార్కెట్

ఎఫ్.సీ మార్కెట్

P.C: You Tube

పూనేలో మంచి కాలేజ్ అంటే ఎవరూ చెప్పక పోవచ్చు. అయితే షాపింగ్ కు అనువైన ప్రదేశం అంటే మాత్రం ప్రతి ఒక్కరి నోట వినిపించే పదం ఎఫ్.సీ మార్కెట్. ఇక్కడ అత్యంత ఫ్యాషనబుల్ వాచెస్ నుంచి దుస్తుల వరకూ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఇందులో చాలా వస్తువులు ముంబై నుంచి వచ్చేవే. అందుకే రోజులో ఏ సమయంలో చూసిన ఇక్కడ విద్యార్థులే ఎక్కువ సంఖ్యలో కనిపిస్తారు.

కమర్షియల్ స్ట్రీట్

కమర్షియల్ స్ట్రీట్

P.C: You Tube

స్ట్రీట్ మార్కెట్ కు నూతన నిర్వచనం చెప్పిన కమర్షియల్ స్ట్రీట్ బెంగళూరులో ఉంది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ మార్కెట్ లో షాపింగ్ మాల్స్ కూడా దొరకని అత్యంత ఫ్యాషనబుల్ దుస్తులు, బ్యాగులు, షూ ఇలా ఒకటేమిటి అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. అందువల్లే వీకెండ్ లో నగర యువత ఎక్కువ శాతం ఈ కమర్షియల్ స్ట్రీట్ లోనే కనిపిస్తుంటారు.

కొలబా మార్కెట్

కొలబా మార్కెట్

P.C: You Tube

ముంబైలో ఈ మార్కెట్ గురించి తెలియని వారు ఉండరు. ఇరుకైన వీధులతో ఉండే ఈ మార్కెట్ ప్రాంతంలో అత్యంత ఆకర్షణీయమైన ధరల్లో ఖరీధైన వస్తువులను మనం సొంత చేసుకోవచ్చు. బేరమాడే నైపుణ్యం ఉండాలే కాని రూ.100 వస్తువును కూడా రూ.20 కు ఇక్కడ కొనవచ్చు. అందుకే మధ్యతరగతి వారితో పాటు ధనవంతులు కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడకు షాపింగ్ కు వస్తుంటారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+