ఉదయాన్నే లేవటం ... ఆఫీస్ కు పోవటం ... సాయంత్రం మళ్లీ తిరిగి రావటం .. తినటం .. నిద్రపోవటం ఉదయమైతే మళ్ళీ అదే ... అదే వీకెండ్ అయితే బైక్ ల మీద, కార్ల మీద చక్కర్లు, పబ్ లు, రెస్టారెంట్ లు, చాట్ లు .. ఇంతేనా ? ఇదేనా జీవితం అంటే ?
ఇది మాన్సూన్ సీజన్. చాలా మంది పర్యాటకులు ఈ సీజన్ లో ఎటైనా వెళ్లి ఆహ్లాదంగా గడపటానికి, ఆనందించటానికి ఇష్టపడుతుంటారు. దీని కోసమై ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేసుకొని ప్రదేశాలను చూసి వస్తుంటారు.
ఇది కూడా చదవండి : ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు !
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా మాన్సూన్ పర్యాటక ప్రదేశాలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. మీరు తొలిసారి ఈ పర్యాటక ప్రదేశాలను చూసేవారైతే మీ అనుభూతులు చెప్పలేనివి. ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ కొన్ని ప్రదేశాల వైపు దృష్టి సారించటం లేదనేది వాస్తవం. మీరే ఆ ప్రదేశాలను శోధించి అక్కడికి వెళ్లి సెలవులను గడిపేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది ? మీరే చెప్పండి.
మా నేటివ్ ప్లానేట్ కూడా ఆంధ్ర ప్రదేశ్ లో మాన్సూన్ లో తప్పక సందర్శించవలసిన కొన్ని పర్యాటక ప్రదేశాలను శోధించి మీకు అందిస్తున్నది. మరి మీరు అక్కడికి వెళ్లి ఆనందిస్తారు కదూ ..!
ఇది కూడా చదవండి : ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ లో చూడవలసిన మాన్సూన్ జలపాతాలు !

హార్సిలీ హిల్స్
హార్సిలీ హిల్స్ అనే ప్రదేశం, చిత్తూర్ జిల్లాలోని మదనపల్లె డివిజన్ లో (29 KM) కలదు. ఇక్కడున్న పచ్చిక బయళ్లు, ప్రకృతి అందాలు, ఆహ్లాదకరమైన చల్లని వాతావరణం పర్యాటకులను ఎక్కువగా ఆకట్టుకుంటోంది. నేచర్ మరియు ఫోటో గ్రఫీ మీద ఆసక్తి ఉన్న వారు మల్లమ్మ ఆలయం, కౌండీన్య వన్య ప్రాణుల అభయారణ్యం తప్పక చూడాలి.
చిత్ర కృప : SAIKAT SARKAR

అరకు వాలీ
అరకు లోయ .. చల్లని వాతావరణం, ఎత్తైన కొండలు, లోతైన లోయలు, ఉవ్వెత్తున ఎగిసిపడే జలపాతాలు .. ఎలా ఎన్నో ప్రకృతి ప్రసాదించిన అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తున్నది. సుందరమైన జలపాతాలు, బొర్రా గుహలు, వ్యూ పాయింట్ లు, సాహస క్రీడలు ఇక్కడ చూడదగ్గవి మరియు చేయదగ్గవి. వైజాగ్ నుండి 115 KM ల దూరంలో అరకు వాలీ కలదు.
ఇది కూడా చదవండి : అరకు వాలీ - మరుపురాని పర్యటన !
చిత్ర కృప : Sunny8143536003

ఎత్తిపోతల జలపాతాలు
ఎత్తిపోతల జలపాతాలు గుంటూరు జిల్లాలో కలదు. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ను చూసే ప్రతి పర్యాటకుడు ఎత్తిపోతల జలపాతాన్నిసందర్శిస్తారు. డ్యాం నుండి జలపాతం కేవలం 11 KM ల దూరంలో కలదు.
చిత్ర కృప : Sheetal

తలకోన
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన జలపాతాలలో మొదటిది తలకోన వాటర్ ఫాల్స్. దాదాపు 60 మీటర్ల ఎత్తు నుండి నీటి ప్రవాహం కిందకు పడుతుంది. తిరుపతి కి 45 కిలోమీటర్ల దూరంలో యెర్రావారిపాలెం గ్రామం వద్ద, శేషాచలం అడవుల పర్వత శ్రేణుల మధ్య కిందకు జాలువారుతున్న జలపాత దృశ్యం నయనానందకరంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి : తలకోన జలపాతం - అద్భుత దృశ్యాలు !
చిత్ర కృప : R Muthusamy

నాగార్జున సాగర్
నాగార్జున సాగర్ నల్గొండ జిల్లా - గుంటూరు జిల్లా సరిహద్దు భాగం లో కలదు. కృష్ణా నది మీద లాంచీ లో ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. రిజర్వాయర్ మధ్యలో ఉన్న బౌద్ధ ద్వీపం తప్పక సందర్శించాలి.
ఇది కూడా చదవండి : నాగార్జున సాగర్ - శ్రీశైలం బోట్ ట్రిప్ !
చిత్ర కృప : Amy Barr

పుట్టపర్తి
పుట్టపర్తి, అనంతపురం జిల్లాలోని భగవాన్ శ్రీ సత్య సాయి బాబా యొక్క నివాస స్థలం. శాంతి, సత్యం, ప్రేమ, నిజాయితీ మరియు అహింస సూత్రాలను బాబా పరమపదించే వరకు బోధించేవారు. బాబా స్థాపించిన ప్రశాంతి నిలయం, ఆంజనేయ స్వామి ఆలయం, మ్యూజియం, సత్య భామా ఆలయం, విఘ్నేశ్వరుని ఆలయం, శివాలయం, కల్ప వృక్షం మొదలైనవి చూడదగ్గవి.
ఇది కూడా చదవండి : పుట్టపర్తి - ఒక ప్రశాంత నిలయం !
చిత్ర కృప : Herry Lawford

పాపి కొండలు
పాపికొండలు ప్రకృతితో పెనవేసుకున్న ప్రదేశం. రాజమండ్రి కి 100 KM ల దూరంలో, ప్రతి పర్యాటకుడు బోట్ లో ప్రయాణించి పాపి కొండల అందాలను, దాని యొక్క ముగ్ధమనోహర దృశ్యాలను చూస్తూ పరవశించిపోతాడు. ఏ కాలమైనా సరే ఇక్కడి వాతావరణం చల్లగానే ఉంటుంది.
ఇది కూడా చదవండి : పాపికొండల ప్రయాణం !
చిత్ర కృప : Pankaj Kulkarni

మారేడుమిల్లి
సహజ సిద్ధ అటవీ అందాలకు పుట్టినిల్లు మారేడుమిల్లి. రాజమండ్రి కి 80 KM ల దూరంలో ... భద్రాచలం పోయే దారిలో ఈ ప్రదేశం ఉన్నది. మాన్సూన్ సీజన్ లో ఇక్కడి ప్రకృతి అందాలు చూడటానికి రెండుకాళ్ళూ చాలావనుకోండి ..! జలపాతాలు, తూర్పుకనుమల కొండలు, ఆలయాలు, అటవీ అందాలు, ఉద్యానవనాలు చూడదగ్గవి. వసతికై స్టే హోం లు సైతం ఉన్నాయి.
ఇది కూడా చదవండి : మారేడుమిల్లి - రంపచోడవరం : దేవుడు సృష్టించిన ఒక కొత్త భూమి !
చిత్ర కృప : KRISHNA SRIVATSA NIMMARAJU



Click it and Unblock the Notifications













