Search
  • Follow NativePlanet
Share
» » జులై నెలలో కర్నాటక అందాలన్నీ ఇక్కడే

జులై నెలలో కర్నాటక అందాలన్నీ ఇక్కడే

జులై నెలలో కర్నాటకలో చూడదగిన ప్రాంతాల గురించి కథనం.

కర్నాటక ప్రకృతి అందాలకు నెలవు. సువిశాలమైన ఈ దక్షిణ భారత దేశానికి చెందిన రాష్ట్రంలో ఒక వైపు ఎతైన కొండలు ఉంటే మరోవైపు లోతైన సముద్రం కూడా ఉంది. అదే విధంగా పచ్చటి మైదానాలు, జల జలా పారే జలపాతాలకు కూడా కొదువలేదు. ఇక ప్రకృతి కొత్త అందాలను సంతరించుకునే జులై మాసంలో కర్నాటకలోని పలు ప్రాంతాలు మరింత అందంగా కనిపిస్తాయి.

ఇందులో నదీలోయ ప్రాంతాలు, జలపాతాలు కూడా ఉన్నాయి. ప్రకృతి కి పర్యాయ పదంగా నిలిచే అందాలు కర్నాటకలో ఎన్నో ఉన్నాయి. అందులో ఎంపిక చేసిన ఐదు పర్యాటక కేంద్రాల క్లుప్త సమాచారం ఇక్కడ మీకు అందిస్తున్నాం. మరెందుకు ఆలస్యం చదివి రానున్న జులైలో ఏదో ఒక వీకెండ్ లో అక్కడికి వెళ్లి రావడానికి ప్రణాళికలు రచించుకోండి.

కబిని అటవీ ప్రాంతం

కబిని అటవీ ప్రాంతం

P.C: You Tube

కబినిలో మిగిలిన అభయారణ్యాలకు, కబినీ అభయారణ్యాలకు చాలా తేడా ఉంది. సాధారణంగా అక్కడి వాతావరణం, వర్షం పడే సూచన తదితర కారాణాల వల్ల ఈ జులైలో చాలా అభయారణ్యాలు సందర్శనకు అనుమతివ్వవు. అయితే వర్షం పడే సమయంలో అటవీ ప్రాంతంలో గడపాలనుకొనేవారికి కబినికి మించిన పర్యాటక ప్రాంతం మరొకటి లేదు. ముఖ్యంగా ఈ సమయంలో నెమళ్ల నాట్యం ఇక్కడ సర్వసాధారణం. ఇక్కడ లక్ష్మణ తీర్థ జలపాతం, బైలుకుప్పే తదితర ప్రాంతాలు చూడదగినవి.

ఆగుంబే

ఆగుంబే

P.C: You Tube

పూర్తిగా అటవీ ప్రాంతమైన ఆగుంబేలో వర్షాలు బాగా పడే జులై నెలలో విభిన్న జంతుజాలాన్ని, పక్షులను చూడటానికి వీలవుతుంది. అరుదైన కింగ్ కోబ్రా జాతి పాములు ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా ట్రెక్కింగ్ చేసేవారికి అడుగడుగునా జలపాతాలు కనిపించగా కనుచూపుమేర ఉన్నపచ్చదనం కనువిందు చేస్తాయి. ఇక్కడికి దగ్గరగా శృంగేరి, కుడ్లు జలపాతం, భీమేశ్వర అభయారణ్యం చూడదగిన పర్యాటక కేంద్రాలు

కెమ్మనగుడి

కెమ్మనగుడి

P.C: You Tube

కెమ్మనగుడి కర్నాటకలోని ప్రముఖ హిల్ స్టేషన్. ముఖ్యంగా ఈ జులై నెలలో ఈ ప్రాంతం కనుచూపుమేర పచ్చదనం మనకు కనువిందు చేస్తుంది. ఇక్కడే మనకు అబ్బే ఫాల్స్ ను చూడవచ్చు. ట్రెక్కింగ్ చేసేవారు ఈ ప్రాంతాన్ని ఎక్కువగా సందర్శిస్తుంటారు. అయితే ఇక్కడ మౌలిక సదుపాయాల కొరత వేదిస్తోంది. ఇక్కడకు దగ్గరగా బాబాబుడేన్ గిరి, ములయాన్ గిరి, చిక్కమగళూరు తదితర పర్యాటక కేంద్రాలు ఉన్నాయి.

హొగనేకల్

హొగనేకల్

P.C: You Tube

సాధారణంగా ఇది తమిళనాడు పరిధికి వస్తుంది. అయితే కావేరి నదీ జలాలు కర్నాటకలో నుంచి తమిళనాడులోకి ఇక్కడే ప్రవేశిస్తాయి. అంతేకాకుండా బెంగళూరుకు ఈ హెగనేకల్ జలపాతం చాలా దగ్గరగా ఉంటుంది. అందువల్ల చాలా మంది కన్నడిగులు ఈ జులై నెలలో ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు. కావేరి అభయారణ్యం ఇక్కడ చూడదగిని పర్యాటక కేంద్రం. అంతేకాకుండా ఈ జలపాతాన్ని చూసి వెనుతిరిగే వారు తప్పక బెంగళూరులో పలు పర్యాటక కేంద్రాలను సందర్శిస్తూ ఉంటారు.

శరావతి నదీ లోయ ప్రాంతం

శరావతి నదీ లోయ ప్రాంతం

P.C: You Tube

కర్నాటకలోని జులైలో అత్యంత అందంగా కనిపించే ప్రాంత శరావతి నదీ లోయ ప్రాంతం. వర్షాలకు చిగురిస్తున్న చెట్లతో కనుచూపుమేర పచ్చదనం తప్ప మనకు ఇక ఏమి కనిపించదు. అందువల్ల ప్రక`తి ప్రేమికులు ఎక్కువ మంది ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు. భద్ర అభయారణ్యం, లింగనమక్కి రిజర్వాయర్, గోకర్ణ, యానా గుహాలయం తదితర ప్రాంతాలు ఇక్కడ చూడదగినవి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+