Search
  • Follow NativePlanet
Share
» »తోషాలి హస్త కళల మేళా !, భువనేశ్వర్ !!

తోషాలి హస్త కళల మేళా !, భువనేశ్వర్ !!

ప్రతి సంవత్సరం ఓడిషా లోని భువనేశ్వర్ లో నిర్వహించే తోషాలి హస్త కళల మేళా ఈ సంవత్సరం డిసెంబర్ 15 తేదీన మొదలైంది. అతి వైభవంగా నిర్వహించే ఈ మేళా 13 రోజులపాటు నిర్వహిస్తారు. అయితే, ప్రతి సంవత్సరం ఈ మేళా ను ఓడిషా టూరిజం శాఖ నిర్వహిస్తూ వుండగా, ఈ సంవత్సరం ఈ మేళా ను ఓడిషా రాష్ట్ర టెక్స్ టైల్ శాఖ నిర్వహిస్తోంది.

భువనేశ్వర్ లోని జనతా మైదాన్ లో నిర్వహించ బడుతున్న ఈ మేళా ఈ సంవత్సరం "తుస్సార్" అనే భావనతో నిర్వహిస్తున్నారు. 'తుస్సార్' అనేది సిల్క్ యొక్క ఒక ఉత్పత్తి. చీరలు, నేయటానికి లేదా ఇతర హస్త కళా వస్తువుల తయారీలో దీనిని ఉపయొగిస్తారు. ఈ సంవత్సరం మేళా లో సుమారు 350 నేత పని వారు, కళాకారులు దేశ వ్యాప్తంగా వచ్చి పాల్గొంటున్నారు. ఓడిషా రాష్ట్ర ప్రభుత్వం ఈ మేళా నిర్వహణ ద్వారా సుమారు 8 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆశిస్తోంది.

తోషాలి క్రాఫ్ట్ ఫెయిర్ దాని నిర్వహణలో హర్యానాలోని సూరజ్ కుండ్ ఫెయిర్ ను అనుకరిస్తోంది. ఈ మేళా లను ప్రతి సంవత్సరం హస్తకళాకారులలోని ప్రతిభను వెలికి తీసేతందుకు, కొనుగోలు దారుల అభిరుచులు అభివృద్ధి చెందించేందుకు, ఇండియా యొక్క సంస్కృతి, ప్రత్యేకించి ఓడిషా యొక్క ఆహార రుచుల అభివృద్ధికి నిర్వహిస్తున్నారు. ఈ మేళాల నిర్వహణ దేశీయ, విదేశీయ కళాకారుల, ప్రతిభలను, వారి పనులను ప్రోత్సహించేందుకు తోడ్పడుతున్నాయి. దుస్తుల నుండి, శిల్పాల వరకు, ప్రతి వస్తువు, ఒక కళా దృష్టి తో ఉత్పత్తి చేయబడతాయి.

ఇండియా లో నేత పరిశ్రమ నేర్పులను ప్రదర్సించేందుకు గాను సుమారు 10 స్టాళ్ళ ను పెడతారు. ఇక ఇక్కడ కల హోటళ్ళు, అసలు సిసలైన స్థానిక ఆహారాల రుచులు అందిస్తాయి.

గత సంవత్సరం మేళా లో క్లాసికల్ మరియు ఫోక్ ఆర్ట్ ప్రదర్శించారు. వీటిలో ఉషా ఉతుప్ వంటి సెలిబ్రిటీ లు కూడా స్టేజి పై ప్రదర్శనలిచ్చి, ఎంతో వైభవంగా చేసారు.

తోషాలి హస్త కళల మేళా !, భువనేశ్వర్ !!

ఈ సంవత్సరం కూడా ఈ మేళా లో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సుమారు 22 రాష్ట్రాల నుండి కళాకారులు ఈ మేళా లోని వివిధ సంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన నున్నారు. మ్యూజిక్, డాన్స్ మొదలగు రంగాలలో తమ ప్రతిభను చాటనున్నారు. ఈ తోషాలి క్రాఫ్ట్స్ ఫెయిర్ , టూరిస్ట్ లకు మధ్యాహ్నం 2 గం. నుండి రాత్రి 9 గం. వరకు తెరచి వుంటుంది. తోషాలి ప్రదేశం ప్రసిద్ధ మౌర్య సామ్రాజ్యంలో తూర్పు ప్రాంతం లో కలదు. ప్రస్తుత భువనేశ్వర్ పట్టణానికి ఈ తోషాలి ప్రదేశం 5 నుండి 7 కి. మీ. కల దూరం వుంటుంది.
టెంపుల్స్ నగరం గా ప్రసిద్ధి చెందిన భువనేశ్వర్ ను ఎలా చేరాలి ? ఓడిషా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్ కు రవాణా సదుపాయాలూ అనేకం. కలవు. రోడ్డు, వాయు, రైలు మార్గాలలో దేశంలోని వివిధ ప్రధాన ప్రాంతాలనుండి ఈ ప్రదేశం కలుప బడి వుంది.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+