Search
  • Follow NativePlanet
Share
» »Tourist Places in Delhi: ఢిల్లీలోని ఈ ప్ర‌దేశాల‌ను ఎప్పుడైనా చూశారా..?

Tourist Places in Delhi: ఢిల్లీలోని ఈ ప్ర‌దేశాల‌ను ఎప్పుడైనా చూశారా..?

భార‌త‌దేశ రాజధాని ఢిల్లీ చరిత్ర వందేళ్ల నాటిది. ఇక్కడ సందర్శించడానికి అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడి పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప‌ర్యాట‌కులు త‌ర‌లి వస్తుంటారు. ఇక్క‌డ అనేక పురాత‌న క‌ట్ట‌డాలు, చారిత్ర‌క కోట‌లు ఉన్నాయి. ఇటువంటి స‌మ‌యంలో స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో క‌లిసి ఇక్క‌డ సంద‌ర్శించాల‌ని అనుకుంటే మాత్రం త‌ప్ప‌కుండా ఈ ప్రాంతాల‌ను సంద‌ర్శించాల్సిందే. రండి ఆ ప్ర‌దేశాలేంటో చూద్దాం..

akshardhamtemple1

అక్షరధామ్ ఆలయం

ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయం చాలా ఎంతో ప్రసిద్ధి చెందింది. దీనిని స్వామినారాయణ దేవాలయం అని కూడా పిలుస్తారు. స్వామి నారాయణ్ శాఖకు చెందిన ఈ ఆలయం హిందూ మతం మరియు దాని ప్రాచీన సంస్కృతికి ప్ర‌తిబింబంగా నిలుస్తుంది. ఇది నవంబర్ 6, 2005న ప్రారంభించబడిన ఆల‌యం. ఈ ఆల‌యం నవంబర్ 8, 2005 నుండి సాధారణ ప్రజల కోసం తెరవబడింది. ఈ ఆల‌య స‌మీపంలో బోట్ రైడ్, లైట్ షో, థియేటర్ మరియు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఆస్వాదించవచ్చు.

ఇండియా గేట్

భారతదేశ చరిత్రకు నిలువెత్తు నిదర్శనం న్యూఢిల్లీ ఇండియా గేట్. ఇది దేశ రాజధాని అయిన న్యూ ఢిల్లీలో ఉంది. రాష్ట్రపతి భవన్‌కు కూత‌వేటు దూరంలో ఇండియా గేట్ ఉంది. న్యూ ఢిల్లీలో చూడవలసిన అతి కొద్ది పర్యాటక స్థలాలలో ఇది ఒకటి. దీనిని మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో, ఆఫ్ఘన్ యుద్ధ సమయంలో అమరులైన 90 వేల మంది జవాన్ల జ్ఞాపకార్థం ఈ స్మృతి చిహ్నాన్ని కట్టించారు. ఇది ఒక అపురూప కట్టడం. దీని ఎత్తు సుమారు 42 మీటర్లు ఉంటుంది. ఈ కట్ట‌డాన్నిఎర్ర‌రాయితో క‌ట్టించారు.

ఈ ఎర్ర‌రాయిని భరత్‌పూర్ నుంచి తెప్పించారు. ఇండియా గేట్ పరిసరాలు చూడటానికి ఎంతో ఆహ్లాద‌భ‌రితంగా ఉంటాయి. ఇక్క‌డి పరిసరాలలో పచ్చిక బయళ్ళు, చిన్నారులు ఆడుకోవడానికి సుందరమైన పార్కు, బోట్‌ క్లబ్ ఉండటమే కాకుండా ఇక్కడి నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్ చూడడం మరుపురాని అనుభూతినిస్తుంది. దుత్వపత్‌లో ఉన్న ఇండియా గేట్ భారతదేశంలోని ప్రధాన చారిత్రక ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్ద సంఖ్యలో ప్రజలు త‌ర‌లి వ‌స్తుంటారు.

qutubminar1

కుతుబ్ మినార్

ఢిల్లీలోని అందమైన ప్రదేశాలలో కుతుబ్ మినార్ కూడా ఒకటి. 73 మీటర్ల ఎత్తైన ఈ టవర్ యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో కూడా చేర్చబడింది. దీన్ని చూసేందుకు దేశం నుండే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు త‌ర‌లి వస్తుంటారు.

ఎర్రకోట

మొఘల్ చక్రవర్తుల రాజధాని ఢిల్లీ. ఎర్రకోటను మొఘల్ చక్రవర్తి షాజహాన్ 1638-1648 మధ్య నిర్మించారు. ఇక్క‌డ మ్యూజియంల‌తో పాటు సాంప్రదాయ హస్తకళలకు సంబంధించిన అనేక విషయాలను ఇక్కడ చూడొచ్చు. ఎరుపు రంగు గోడల కారణంగా, సాయంత్రం వేళలో ఇది విభిన్నమైన అందాన్ని కలిగి ఉంటుంది.

lotustemple1

లోటస్ టెంపుల్

లోటస్ టెంపుల్ చూడ్డానికి అచ్చం తామ‌ర‌పువ్వులా ఉంటుంది. ఇది 27 పాలరాయితో తయారు చేయబడింది. ఇది 1986లో నిర్మించబడింది. దీనిని 'బహాయి దేవాలయం' అని కూడా అంటారు. ఇది ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఉన్న ఒపెరా హౌస్‌తో కూడా పోల్చబడింది. ఇక్కడ ఎటుచూసిన ప‌చ్చంద‌నం ప‌ర్యాట‌కుల‌ను క‌నుల‌విందు చేస్తుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+