Search
  • Follow NativePlanet
Share
» »పెనుకొండ దుర్గం : కృష్ణదేవరాయల రాజధాని !

పెనుకొండ దుర్గం : కృష్ణదేవరాయల రాజధాని !

By Mohammad

విజయనగర సామ్రాజ్యములో 'పెనుకొండ' రెండవ రాజధానిగా ఉండేది (మొదటి రాజధాని ప్రస్తుత హంపి). విజయనగర రాజులలో అగ్రగణ్యుడు శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ 300 కు పైగా ఆలయాలు కట్టించినట్లు చరిత్ర చెబుతుంది. రాజులు అప్పట్లో యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ఇక్కడే పూజ చేసేవారని, తిరుపతి వెంకటేశ్వరుణ్ని దర్శించుకొనేందుకు వెళ్ళేటప్పుడు ఇది వారికి విడిది కేంద్రంగా ఉండేదని అంటారు.

పెనుకొండ లో విజయనగర ఆనవాళ్లు ఇప్పటికీ కనపడతాయి. వాటిలో పెనుకొండ కోట, ఎర్రమంచి గేటు, పెనుకొండ కొండ మరియు దేవాలయాలు ప్రధానమైనవి. పెనుకొండ కొండ ఒక శత్రు దుర్భేద్యమైన కోట. లోపల చెరువు, నరసింహ స్వామి ఆలయం, కోనేరు చూడదగినవి.

ఇది కూడా చదవండి : ఆంధ్రా, తెలంగాణ లోని అద్భుత కట్టడాలు !

క్రీ. శ. 1585 వ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యం పతనమై, విజయనగరాన్ని దక్కన్ ముస్లీమ్ రాజ్యాలు నేలమట్టం చేసాక విజయనగర రాజులు ఇక్కడ కొన్నేళ్లు జీవించారు.

పెనుకొండ అనంతపురం జిల్లాలో, బెంగళూరు - హైదరాబాద్ జాతీయరహదారి మార్గంలో కలదు. అనంతపూర్ నుండి 70 KM ల దూరంలో, హిందూపూర్ నుండి 36 KM ల దూరంలో, ధర్మవరం నుండి 55 KM ల దూరంలో పెనుకొండ ఉన్నది.

పెనుకొండ కోట

పెనుకొండ కోట

పెనుకొండ ను మొదట హోయసలలు పరిపాలించారు. వారు జైన మతాన్ని బాగా ఆదరించేవారు. ఇప్పటికి ఈ ప్రాంతము జైన మతస్తులకు అత్యంత ప్రాదాన్యమైనది కూడా. ఆతరువాత కృష్ణదేవరాయల కాలంలో పెనుగొండ, వారి రాజ్యానికి రెండవ రాజధానిగా వర్థిల్లినది. అదేవిదంగా వారికి ఇది వేసవి విడిదిగా సేవలందించింది.

చిత్ర కృప : Mikhail Esteves

సంపద

సంపద

విజయనగర సామ్రాజ్యం పతనం అయిన తర్వాత అక్కడి నుండి ఆనేక ఏనుగులు, గుర్రాల పై విజయనగర సిరిసంపదలను తరలించి పెనుగొండలోను, చిత్తూరు జిల్లాలోని చంద్ర గిరి కోటలో దాచారని చారిత్రిక ఆదారాలున్నాయి.

చిత్ర కృప : Rohit

విశేషాలు

విశేషాలు

పెనుకొండ కోటను బుక్కరాయుడు కట్టించాడు. ఈ కోటలో ఎన్నో పురాతన శాశనాలు ఉన్నాయి. ఇందులోని కట్టడాలు శత్రుదుర్బేద్యంగా ఉంటాయి.

చిత్ర కృప : Sujith Nair

విశేషాలు

విశేషాలు

యెర్రమంచి గేటులో 1575లో నిర్మించిన 11 అడుగుల ఆంజనేయుని విగ్రహం ఉంది. విజయనగరపు రాజులు యుధ్ధానికి వెళ్ళేముందు ఇక్కడే పూజలు జరిపేవారట. పెనుకొండ లొ 365 దేవాలయాలు కలవు. వీటిని కృష్ణదేవరాయలు నిర్మించాడు.

చిత్ర కృప : Alx Uttermann

విశేషాలు

విశేషాలు

కృష్ణదేవరాయలు, విజయనగరం (ప్రస్తుతం హంపి) వలే ఏడు కోటలను ఇక్కడ నిర్మించాడు. వేసవి విడిదిగా , వసంతోత్సవాల స్థావరంగా ఎక్కువ కాలము పెనుకొండ సేవలందించింది. వ్యాసరాయలు కృష్ణరాయలు ఏకాంతంగా రాజకీయాలు పెనుకొండలో చర్చించుకొనేవారు.

చిత్ర కృప : Nicolas Mirguet

పెనుకొండ లో సందర్శించదగినవి

పెనుకొండ లో సందర్శించదగినవి

పెనుకొండ లో మహామంత్రి తిమ్మరసు బందీఖానా చూడదగ్గది. గగన మహల్, గాలిగోపురం, కుంభకర్ణ విగ్రహం, పాంచ్ బీబీ దర్గా, జామియా మసీద్, షేర్ ఖాన్ మసీద్, బాబా ఫక్రుద్దీన్ దర్గా, కాళేశ్వర స్వామి ఆశ్రమాలు ఇతర ఆకర్షణలుగా ఉన్నాయి.

చిత్ర కృప : kumar_08

వసతి

వసతి

పెనుకొండ లో వసతికై మధ్యతరహా హోటళ్లు, లాడ్జీలు అందుబాటులో కలవు. ఉదయం టిఫిన్లు, మధ్యాహం, రాత్రి ఆంధ్రా భోజనం దొరుకుతుంది.

చిత్ర కృప : Veera.sj

పుట్టపర్తి

పుట్టపర్తి

పెనుకొండ వచ్చే పర్యాటకులు 22 KM ల దూరంలో ఉన్న పుట్టపర్తిని కూడా సందర్శించండి.

ఇది కూడా చదవండి : పుట్టపర్తి - ఒక ప్రశాంత నిలయం !

చిత్ర కృప : Herry Lawford

పెనుకొండ ఎలా చేరుకోవాలి ?

పెనుకొండ ఎలా చేరుకోవాలి ?

పెనుకొండ చేరుకోవటానికి రోడ్డు, రైలు మార్గం సూచించదగినది.

విమానం ద్వారా : పుట్టపర్తి (22KM) సమీప విమానాశ్రయం. 140 KM ల దూరంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా కలదు.

రైలు ద్వారా : పెనుకొండ లో జుంక్షన్ కలదు. ధర్మవరం, బెంగళూరు, గుంతకల్, గుత్తి, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి రైళ్లు వస్తుంటాయి.

రోడ్డు ద్వారా : ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ప్రతి రోజూ పుట్టపర్తి నుండి, హిందూపూర్ నుండి, అనంతపూర్ నుండి, ధర్మవరం నుండి బస్సు సేవలను అందిస్తున్నది.

చిత్ర కృప : Rohit

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+