Search
  • Follow NativePlanet
Share
» »వ‌ర్షాకాలంలో విహార‌మా? అయితే, ఈ నియ‌మాలు పాటించాల్సిందే!

వ‌ర్షాకాలంలో విహార‌మా? అయితే, ఈ నియ‌మాలు పాటించాల్సిందే!

వ‌ర్షాకాలం వ‌స్తూ.. వ‌స్తూనే ఆహ్లాదాన్ని పంచే వాతావ‌ర‌ణాన్ని తీసుకువ‌స్తుంది. ఈ సీజ‌న్‌లో ప్ర‌కృతిలో విహ‌రించాల‌ని చాలామంది మ‌న‌సులో ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండ‌డంతో ప్రతి ఒక్కరూ ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయాల‌నుకుంటారు. మ‌రీ ముఖ్యంగా చిట‌ప‌ట చినుకులు ప‌డుతూ ఉంటే.. ఆ చినుకుల్లో త‌డిసిముద్ద‌యిపోవండం కొంద‌రికి చాలా ఇష్టం. అయితే, ఈ వ‌ర్షాకాలంలో ఆరు బ‌య‌ట విహ‌రించేవారు త‌ప్ప‌నిస‌రిగా కొన్ని జాగ్ర‌త్తులు తీసుకోవాలి. ఎందుకంటే, జీవితంలో ఎంజాయ్‌మెంట్ ఎంత ముఖ్య‌మో.. ఆరోగ్య‌మూ అంతే ముఖ్యం క‌దా! అందుకే ఈ రెయినీ సీజ‌న్‌లో ప‌ర్యాట‌కులు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిన కొన్ని విష‌యాల‌ను తెలుసుకుందాం!

వ‌ర్షాకాలంలో దూర ప్రాంతాల‌కు ప‌ర్య‌టించ‌డం చాలామందికి అల‌వాటు. ఈ ప్ర‌యాణంలో విడిది కేంద్రాల్లో కిటికీ ప‌క్క‌న కూర్చొని నేచ‌ర్‌ను ఎంజాయ్ చేయ‌డం కంటే.. వ‌ర్షంలో త‌డుస్తూ.. ఆ క్ష‌ణాల‌ను ఆస్వాదించాల‌నుకునేవారే ఎక్కువ‌. అయితే, ఇలా వ‌ర్షంలో త‌డ‌వ‌డం వ‌ల్ల ఫ్లూ, జ‌లుబు, తుమ్ములు, వైర‌ల్ ఫీవ‌ర్లు రావ‌డం స‌హ‌జ‌మే. వీటితోపాటు చ‌ర్మ సంబందిత అల‌ర్జీ స‌మ‌స్య‌లు ఎక్కువ మందికి వ‌స్తూ ఉంటాయి. ఇలాంటి స‌మ‌యాల్లో చిన్న చిన్న సూచనలు పాటించ‌డం ద్వారా ఈ భ‌యాల‌ను పోగొట్టుకోవ‌డంతోపాటు ఆహ్లాద‌క‌ర‌మైన వ‌ర్షాకాల‌పు వాతావ‌ర‌ణాన్ని ఆస్వాదించ‌వ‌చ్చు.

rainyseason tips

ఈ చిట్కాల‌తో మీరు సేఫ్..

ఆరుబ‌య‌ట‌ వర్షంలో త‌డుస్తూ ఎంజాయ్ చేసిన త‌ర్వాత ఆ తడి దుస్తులను అవ‌కాశం ఉన్నంత వ‌ర‌కూ తొంద‌ర‌గా మార్చుకోవాలి. అంతేకాదు, అలా తడిసిన తర్వాత మ‌ళ్లీ తప్పకుండా మంచి నీటితో స్నానం చేయ‌డం మ‌ర్చిపోవ‌ద్దు. అలాగే, షాంపూతో జుట్టును శుభ్రం చేసుకున్న త‌ర్వాత జ‌ట్టును పొడిగా ఆర‌బెట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల‌ జలుబు, జ్వరం వంటి వైరల్ సమస్యల బారిన‌ప‌డ‌కుండా ఉండొచ్చు. వర్షంలో తడవ‌డం వ‌ల్ల మ‌న శరీరంపై బ్యాక్టీరియా చేరే అవ‌కాశం ఉంది.

ఈ కార‌ణంగా చర్మానికి ఎలర్జీ వస్తుంద‌ని వైద్యులు చెబుతున్నారు. అందుకే, త‌డిసిన త‌ర్వాత స్నానం చేసి పొడి క్లాత్‌తో శరీరాన్ని తుడుకుకోవాలి. త‌ర్వాత కాళ్లూచేతులకు యాంటీ బ్యాక్టీరియల్ క్రీమ్ అప్లే చేసుకోవ‌డం మంచిది.

rain-seasontips items to carry

సాధార‌ణ గ‌ది ఉష్ట్రోగ్ర‌త‌లో..

ఈ సీజన్‌లో వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుందని మ‌న‌కు తెలుసు. ఈ కార‌ణంగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టేందుకు రోగనిరోధక శక్తిని పెంచే పోష‌కాహారాన్ని ఎక్కువ‌గా తీసుకోవాలి. వీలైనంత వరకు బయటి ఫుడ్‌కు దూరంగా ఉండ‌డం మంచిది. వర్షాకాలంలో రోడ్ సైడ్ ఫుడ్ తింటే ఇన్‌ఫెక్షన్ల స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటుంది. ఎక్క‌డ ఉన్నా.. వేడిని తీసుకునేందుకు ప్రాధాన్య‌త ఇవ్వాలి. చాలామంది వ‌ర్షంలో త‌డిచిన త‌ర్వాత నేరుగా ఏసీ, ఫ్యాన్ లేదా కూల‌ర్ వంటివి ఆన్ చేసి కూర్చొంటారు.

ఇలా చేయ‌డం అస్స‌లు మంచిదికాదు. ఇలా చేయ‌డం వ‌ల్ల చాలా తొంద‌ర‌గా జలుబు బారిన పడే అవ‌కాశం ఉంది. అలాకాకుండా త‌డిసిన త‌ర్వాత సాధార‌ణ గ‌ది ఉష్ట్రోగ్ర‌త‌లో కొంత స‌మ‌యం గ‌డ‌ప‌డం మీ ఆరోగ్యానికి శ్రేయ‌ష్క‌రం. శరీరాన్ని వెచ్చ‌గా ఉంచుకోవ‌డానికి అల్లం టీ లేదా కొన్ని సాధారణ మసాలా దినుసులతో చేసిన డికాక్షన్ లేదా హెర్బ‌ల్ టీ తీసుకోవ‌డం ఉత్త‌మం.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+