Search
  • Follow NativePlanet
Share
» »వ‌ర్షాకాలంలో ప్ర‌యాణ‌మా.. ఈ జాగ్రత్త‌లు పాటిస్తే చాలు..!

వ‌ర్షాకాలంలో ప్ర‌యాణ‌మా.. ఈ జాగ్రత్త‌లు పాటిస్తే చాలు..!

వ‌ర్షాకాలంలో ప్ర‌యాణ‌మా.. ఈ జాగ్రత్త‌లు పాటిస్తే చాలు..!

వ‌ర్షాకాలంలో ప్ర‌యాణం చాలా ఆహ్లాద‌క‌రంగా ఉంటుంది. అందుకే చాలామంది ప‌ర్యాట‌కులు వ‌ర్షాకాలంలో ప‌ర్య‌టిస్తుంటారు. ఈ కాలంలో ప్రయాణం చాలా సరదాగా, ఉత్సాహంగా ఉంటుంది. అయితే, వ‌ర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ‌గా ప‌డుతున్నాయి. కాబ‌ట్టి ప్ర‌యాణంలో కొన్నిస‌మ‌స్య‌లు ఎదుర‌వుతుంటాయి. ఆ స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించాలంటే ప్ర‌యాణంలో కొన్ని జాగ్ర‌త్త‌లు పాటిస్తే.. మీ వ‌ర్షాకాల‌పు ప్ర‌యాణంలో ఎలాంటి ఒడుదుడుకులు ఎదురవ్వ‌వు. రండి, ఆ జాగ్ర‌త్త‌లేంటో చూద్దాం..

1

ఇవి త‌ప్ప‌నిస‌రి..

ప్ర‌యాణం కోసం ప్యాకింగ్ చేస్తున్నప్పుడు చాలామంది మ‌రిచిపోయే రెండు ముఖ్యమైన విషయాలు మొదటిది ప్రయాణ బీమా రక్షణ, రెండవది ప్రథమ చికిత్స కిట్. ఏదైనా ప్రాంతానికి ప్ర‌యాణించేట‌ప్పుడు త‌ప్ప‌కుండా ప్రయాణ బీమాను ద‌గ్గ‌ర‌గా ఉంచుకోవ‌డం ఉత్త‌మం. మ‌రొక‌టి ప్రథమ చికిత్స వస్తు సామగ్రి తప్పనిసరిగా కలిగి ఉండాలి. ప్ర‌యాణం చేసేట‌ప్పుడు లేదా ట్రెక్కింగ్ వంటివి చేసేట‌ప్ప‌డు ప్రమాదానికి గుర‌య్యే అవ‌కాశం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ప్రథమ చికిత్స కిట్ కలిగి ఉండటం చాలా ముఖ్యం. కాబట్టి ప్రథమ చికిత్స ప్ర‌యాణ‌పు వస్తు సామగ్రిలో ముందుగానే భ‌ద్ర‌ప‌రుచుకోవాలి.

హ్యాండ్ సానిటైజర్

కోవిడ్ అనంత‌రం శానిటైజర్ ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. అలాగే ఎటువంటి ప్ర‌మాదాలు జ‌రిగినా, గాయం అయినప్పుడు, ఇన్ఫెక్షన్ వంటివి రాకుండా ఉండేందుకు శానిటైజర్‌ని ఉపయోగించ‌డం ఎంతో మంచిది. అందుకే ముందుగానే హ్యండ్ శానిటైజ‌ర్ బ్యాగ్‌లో ఉంచండి.

2

ముందుగా తెలుసుకోండి..

ఏ ప్ర‌దేశానికి వెళ్లాల‌నుకుంటున్నారో ఆ ప్ర‌దేశం వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల గురించి ముందుగా తెలుసుకోవ‌డం మంచిది. ఎందుకంటే, కొన్ని ప్రాంతాల్లో అధిక వ‌ర్ష‌పాతం న‌మోద‌వుతుంది. అటువంటి ప్రాంతాల‌ను ఎంపిక చేసుకోక‌పోవ‌డమే మంచిది. ఉత్త‌రాఖండ్‌, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ వంటి ప్రాంతాల్లో త‌ర‌చుగా ఈ సీజ‌న్‌లో చాలా ప్ర‌మాదాలు సంభ‌విస్తుంటాయి. అధిక వ‌ర్షాల కార‌ణంగా అక్క‌డ కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌డం వంటివి జ‌రుగుతుంటాయి. దాంతో ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి మీరు వెళ్లే ప్ర‌దేశం గురించి ముందుగానే తెలుసుకోవాలి.

త‌ర‌చుగా నీటిని తాగుతుండాలి..

ఈ సీజ‌న్‌లో నీరు క‌లుషిత‌మ‌య్యే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి రోగాల‌బారిన ప‌డే అవ‌కాశం లేక‌పోలేదు. అందుకే త‌ప్ప‌నిస‌రిగా వాట‌ర్‌బాటిల్‌ను మీతో పాటు ఉంచుకోవాలి. శ‌రీరం డీహైడ్రేష‌న్‌కు గుర‌వ్వ‌కుండా త‌రుచుగా నీటిని తాగుతుండాలి. యాంటీ బాక్టీరియల్ వైప్స్, గ్లౌజులు, ఇతర ఉపరితలాలను శుభ్రపరచడానికి గొప్పగా ఉపయోగపడతాయి. ఎందుకంటే అవి సూక్ష్మక్రిములను చంపి, ఇన్ఫెక్షన్ వచ్చే అవ‌కాశాలను త‌గ్గిస్తాయి. అందుకే గ్లౌజుల‌ను తీసుకెళ్లండి. అలాగే తలనొప్పి, జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ వంటివి ఈ సీజ‌న్‌లో సర్వసాధారణంగా వ‌స్తుంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందేందుకు మందులు వాడాల్సి ఉంటుంది. కాబ‌ట్టి వీటిని తీసుకెళ్లాల్సి ఉంటుంది. పెద్దలు, పిల్లలకు ఉపయోగించే మందులను ఎల్లప్పుడూ మీతో పాటు ఉంచుకోవాలి.

3

వాట‌ర్‌ఫ్రూఫ్ క‌వ‌ర్లు..

ఇలాంటి ప్ర‌యాణ విష‌యాల్లో ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా ఎవో ఒక‌టి మ‌రిచిపోతూనే ఉంటారు. కాబ‌ట్టి ముఖ్య‌మైన వ‌స్తువుల‌ను ముందుగానే భ‌ద్ర‌ప‌ర‌చండి. అలాగే అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో అవ‌స‌ర‌మ‌య్యే వాటిని ముందుగా తీసుకెళ్లడం మంచిది. ఫోన్ చార్జ‌ర్‌, ప‌వ‌ర్‌బ్యాంక్ వంటివి తీసుకెళ్లాలి. అలాగే వ‌ర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా రెయిన్ కోట్‌, గొడుగు, వాట‌ర్ ఫ్రూప్ జాకెట్ వంటివి త‌ప్ప‌కుండా తీసుకెళ్లాలి. వీటివ‌ల్ల ఎప్పుడూ వ‌ర్షం వచ్చినా ఎటువంటి ఇబ్బంది ఉండ‌దు. మీరు ధ‌రించే చెప్పులు , షూలు కూడా వాట‌ర్‌ఫ్రూపులు అయ్యి ఉండేలా చూసుకోండి. ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు, బ్యాగులు త‌డ‌వ‌కుండా ఉండేందుకు వాట‌ర్‌ఫ్రూఫ్ క‌వ‌ర్లు తీసుకెళ్ల‌డం మంచిది. ఈ జాగ్ర‌త్త‌లు పాటిస్తే వ‌ర్షాకాలంలో మీ ప్ర‌యాణం ఎంతో ఆహ్ల‌ద‌భ‌రితంగా ఉంటుంది.

More News

    Read more about: travel during rainy season
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+