Search
  • Follow NativePlanet
Share
» »స‌మ్మ‌ర్‌లో ట్రావెలింగ్ చేస్తున్నారా..? అయితే ఇవి త‌ప్ప‌నిస‌రి!

స‌మ్మ‌ర్‌లో ట్రావెలింగ్ చేస్తున్నారా..? అయితే ఇవి త‌ప్ప‌నిస‌రి!

వేసవి కాలం అంటే సెలవుల కాలం. ఎందుకంటే, పిల్ల‌ల‌కు స్కూల్‌సెల‌వులు ఉంటాయి. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు సెలవులు ఇస్తారు. కాబ‌ట్టి చాలామంది ఈ ఉరుకుల ప‌రుగుల జీవితం నుంచి కాస్త ఉప‌శ‌మ‌నం పొందేందుకు, అలాగే ఈ వేడి నుంచి త‌ప్పించుకునేందుకు విహార‌యాత్రల‌కు ప్లాన్ చేస్తుంటారు. కొంద‌రు హిల్‌స్టేష‌న్లు సంద‌ర్శిస్తే మ‌రికొంద‌రేమో చ‌ల్ల‌నిప్రాంతాల‌కు వెళ్తుంటారు. ప‌చ్చ‌ని ప్ర‌కృతి అందాల న‌డుమ సేద‌తీరేందుకు మ‌రికొంద‌రు వెళ్తుంటారు.

అయితే, ఈ స‌మ్మ‌ర్‌లో ట్రావెలింగ్ చేయాల‌నుకున్న‌ప్పుడు త‌ప్ప‌కుండా మీ వెంట కొన్ని వ‌స్తువుల‌ను తీసుకెళ్లాలి. లేదంటే విహారానికి వెళ్లిన‌ప్పుడు తీవ్ర ఇబ్బందుల‌కు గురికావాల్సి ఉంటుంది. చాలామంది విహార‌యాత్ర‌ల‌కు వెళ్లే ముందు వారి ప్రయాణాన్ని సులభంగా, సౌకర్యవంతంగా చేసేందుకు ప్రజలు ముందుగానే సీట్ బుకింగ్, హోటల్ బుకింగ్ వంటివి చేస్తారు. కానీ, వారి బ్యాగ్‌లు స‌రిగా ప్యాకింగ్ చేయడం మ‌రిచిపోతుంటారు.

ఇక‌, మీరు కూడా రాబోయే రోజుల్లో ఎక్కడికైనా వెకేషన్‌కు వెళ్లబోతున్నట్లయితే మాత్రం ట్రిప్‌కి వెళ్లేటప్పుడు స‌రైన బ్యాగ్ ప్యాకింగ్ చేయ‌డం ఎంతో అవ‌స‌రం. మీతో పాటు ఏఏ వ‌స్తువుల‌ను తీసుకెళ్లాలో వాటిని చూద్దాం..

traveltips

అవసరమైన పత్రాలు

ఈ సీజ‌న్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నప్పుడు త‌ప్ప‌నిస‌రిగా మీ ద‌గ్గ‌ర టికెట్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్ వంటివి త‌ప్ప‌కుండా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రయాణ సమయంలో అవసరమైన అన్ని ముఖ్యమైన పత్రాల ఫోటోకాపీలను తయారు చేసి, ఒక కవరు పక్కన పెట్టుకోండి. విహ‌ర‌యాత్ర‌ల‌కు వెళ్లేట‌ప్ప‌డు ఇది ఎంత‌గానో ఉపయోగపడుతుంది.

ఫేస్ వైప్స్..

వేసవిలో ఎక్క‌డికైనా వెళ్లేట‌ప్ప‌డు లేదంటే విహార‌యాత్ర‌ల‌కు ప్లాన్ చేసేట‌ప్ప‌డు ఫేస్ వైప్స్ ఎంతో అవసరం. కాబట్టి ఈ స‌మ‌యంలో మీ ద‌గ్గ‌ర త‌ప్ప‌నిస‌రిగా వెట్ ఫేస్ వైప్స్ ఉంచుకోవాల్సిందే. చెమట తుడుచుకోవాలన్నా, మేకప్ తీసేయాలన్నా, తిన్న తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలన్నా, ముఖాన్ని ఫ్రెష్ చేసుకోవాలన్నా ఇది ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్రయాణంలో నీరు ప్రతిచోటా అందుబాటులో ఉండకపోవచ్చు. అటువంటి పరిస్థితిలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

సన్‌స్క్రీన్‌..

ప్రయాణం చేసేట‌ప్ప‌డు చాలామంది త్వ‌ర‌గా అల‌సిపోతుంటారు. మీ శరీరమంతా జిడ్డుగా మారుతుంది. కాబ‌ట్టి స‌న్‌స్క్రీన్ మీరు అందుబాటులో ఉంచుకోవ‌డం ఎంతో ఉత్తమం. మీ చర్మానికి హాని ఏ ఇత‌ర క్రీమి కీట‌కాలు హానీ కలిగించకుండా ఉండాలంటే మీరు ప్రతి రెండు నుండి మూడు గంటలకు దీన్ని మాయిశ్చ‌యిరైజ‌ర్ చేయాల్సిందే.

Traveling in summer

ఇవి ఎంతో అవ‌స‌రం..

ఒక పెద్ద బాక్సును మీ బ్యాగ్‌లో త‌ప్ప‌నిస‌రిగా ఉంచండి. అందులో మీకు అవ‌స‌ర‌మైన అన్ని ప్రాథమిక ముఖ్యమైన విషయాలు ఉంచండి. టూత్ బ్రష్, పేస్ట్, పేపర్ సబ్బు, ఫేస్ వాష్, ఫేస్ క్రీమ్, లిప్ బామ్, టిష్యూ పేపర్, మేకప్ కిట్ వంటి వాటిని ఇందులో భ‌ద్ర‌ప‌రుచుకోవ‌చ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఒక చిన్న వస్తువును బయటకు తీయడానికి బ్యాగ్ మొత్తం ఖాళీ చేయాల్సిన అవసరం ఉండ‌దు.

సన్ గ్లాసెస్

సన్ గ్లాసెస్ లేకుండా వేసవిలో ప్ర‌యాణం అంత‌మంచిది కాదు. ఈ ప్ర‌యాణంలో మొత్తం కళ్లను కప్పి ఉంచే ఒక జత సన్ గ్లాసెస్ త‌ప్ప‌కుండా తీసుకెళ్లండి. వీటిని మీ హ్యాండ్‌బ్యాగ్‌లో మాత్రమే ఉంచండి. అలాగే పాకెట్ ఫ్రెండ్లీ పోర్టబుల్ పెర్ఫ్యూమ్ ఉంచుకోవడం కూడా మర్చిపోవద్దు.

టోపీలు, గొడుగులు

ఈ స‌మ్మ‌ర్ ట్రిప్‌లో మీతో పాటు త‌ప్ప‌కుండా టోపీలు, గొడుగుల‌ను తీసుకెళ్లాల్సిందే. విహార‌యాత్ర‌లో వాకింగ్‌కు వెళ్లేట‌ప్ప‌డు టోపీ, గొడుగును మీతో త‌ప్ప‌నిస‌రిగా ఉంచుకోవాలి. ప్రస్తుతం చిన్న పర్స్ సైజు గొడుగులు మార్కెట్‌లో సులువుగా లభిస్తున్నాయి. అవి మీకు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+