Search
  • Follow NativePlanet
Share
» »Tulip Festival 2024 : ఫిబ్ర‌వ‌రి 21 వ‌రకు కొన‌సాగ‌నున్న తులిప్ ఫెస్టివ‌ల్‌...

Tulip Festival 2024 : ఫిబ్ర‌వ‌రి 21 వ‌రకు కొన‌సాగ‌నున్న తులిప్ ఫెస్టివ‌ల్‌...

దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలోని శాంతిపథ్‌లో ప్ర‌తి సంవ‌త్స‌రం ఫిబ్రవరిలో నిర్వహించే తులిప్ ఫ్లవర్ ఫెస్టివల్ దేశంలో తప్పక సంద‌ర్శించాల్సిన పూల ప్రదర్శనల్లో ఒకటిగా పేరుగాంచింది. ఇది ప్ర‌తి ఏటా ఫిబ్ర‌వరి మాసంలో ప్రారంభ‌మ‌వుతుంది. ఈ ఏడాది ఇది ఫిబ్రవరి 10 నుండి ప్రారంభమై 21వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా మొత్తం 2 లక్షల అరుదైన తులిప్ పూలను హాలండ్ నుండి ప్రత్యేకంగా ఈ ప్రదర్శనకు తీసుక‌వ‌రావ‌డం జ‌రిగింది.

అవన్నీ ఇప్పుడు శాంతిపథ్‌తో పాటు ఆ పరిసర ప్రాంతాల్లోని పచ్చిక బయళ్లలో ప్రదర్శితమవుతూ ప‌ర్యాట‌కుల‌ను క‌నువిందు చేస్తున్నాయి. ఈ పూల పండుగను వసంత ఋతువుకు స్వాగతం ప‌లికేందుకు జ‌రుపుకుంటారు. ఈ అందమైన పూలు ఢిల్లీ అందాన్నిమ‌రింత‌గా పెంచుతున్నాయి. చాణక్యపురిలోని శాంతిపథ్‌లో న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఈ ఉత్సవాన్ని నిర్వహించింది.

tulipfestival

ఫోటోగ్రఫీ కంటెస్ట్‌...

ఈ సమయంలో ఇప్ప‌డు దేశ‌రాజ‌ధానిలో అసాధారణమైన వాతావరణం నెలకొని ఉంటుంది. సహజంగా ఫిబ్రవరి మాసంలో ఢిల్లీలో మంచు ప్ర‌భావం విపరీతంగా ఉంటుంది. అలాగే మార్చి ప్రారంభం నాటికి చ‌లి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఇలాంటి సమయంలో అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం నెల‌కొని ఉంటుంది. ఇలాంటి సమయంలో ఢిల్లీలాంటి ప్ర‌దేశాల‌ను విహ‌రించేందుకు ప‌ర్యాట‌కుల‌కు ఎంతో ఇష్ట‌ప‌డుతుంటారు. మరోవైపు ఈ ఫెస్టివల్ సందర్భంగా ఈవెంట్ నిర్వహాకులు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఫోటోగ్రఫీ కంటెస్ట్‌ను కూడా నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంది. ఫొటోగ్ర‌ఫి ప్రియులు త‌ప్ప‌కుండా ఈ తులిప్ ఫ్ల‌వ‌ర్ ఫెస్టివ‌ల్‌లో పాల్గొనాల్సిందే. ఫొటోగ్ర‌ఫితో పాటు ఇక్క‌డ ఇండో-డచ్ మ్యూజిక్ ప్రోగ్రామ్‌లను కూడా నిర్వ‌హిస్తున్నారు.

గివ్ మీ ట్రీస్ అనే స్వ‌చ్ఛంద సంస్థ‌...

ఢిల్లీలోని చాణక్యపురి శాంతిప‌థ్‌లో నిర్వ‌హించిన ఈ తులిప్ ఫెస్టివల్ న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC) ఆధ్వ‌ర్యంలో జరుగుతుంది. ఇది ఫిబ్రవరి 10 నుండి ఫిబ్రవరి 21 వరకు కొన‌సాగుంది. ఉదయం 11 నుండి సాయంత్రం 6 గంటల వరకు సంద‌ర్శ‌కులు ఈ ఫెస్టివ‌ల్‌ను వీక్షించొచ్చు. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో నివసిస్తున్న వార‌యితే త‌ప్ప‌కుండా ఈ పూల అందాల‌ను త‌నివీతీరా చూడాల్సిందే. ఇక అక్కడికి వచ్చే పర్యాటకులకు 'గివ్ మీ ట్రీస్' అనే స్వచ్ఛంద సంస్థ శాంతిపథ్‌తో పాటు చుట్టుపక్కలున్న స్మారక చిహ్నాలను కూడా చూపించే ప్ర‌య‌త్నం చేస్తోంది.

tulipfestival

అలాగే ఆ సంస్థ ప్రతినిధులు ఈ తులిప్ ఫ్ల‌వ‌ర్ ఫెస్టివ‌ల్‌కు హాజ‌రైన ప‌ర్యాట‌కులకు తులిప్‌ పూల మొక్కల గురించి కూడా వివరించ‌డం జ‌రుగుతుది. ఇక ఫోటోగ్రఫీ ఔత్సాహికులైతే తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఇది ఒక సువ‌ర్ణ అవ‌కాశ‌మ‌నే చెప్పుకోవాలి. ఎందుకంటే, వీటికి ప్ర‌త్యేక బ‌హుమ‌తులు కూడా ప్ర‌దానం చేస్తారు. ఫొటోగ్ర‌ఫి ప్రేమికుల చేయాల్సింద‌ల్లా ఒక్క‌టే. అది అక్కడ నాటిన తులిప్‌ పూలను సృజనాత్మకంగా తమ కెమెరాల్లో చిత్రీక‌రించ‌డమే. ఇక‌, ఈ ఫొటోగ్ర‌ఫీ పోటీలను హెరిటేజ్ ఫోటోగ్రఫీ క్లబ్‌తో కలిసి నిర్వహించ‌డం జ‌రుగుతుంది.

ఈ పూల అందాల‌ను మీ మీ కెమెరాల్లో బందించి విలువైన బుహుమ‌తుల‌ను సొంతం చేసుకోండి. న్యూఢిల్లీలోని NDMC శాంతి మార్గం, కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్, వివిధ రౌండ్అబౌట్‌ల వంటి ప్రధాన పార్కులలో ఈ తులిప్ పువ్వులను నాటారు. దీంతో పాటు ఉప రాష్ట్రపతి బంగ్లా చుట్టూ, సర్దార్ పటేల్ మార్గ్ మరియు 11 మూర్తి మార్గ్‌లో రంగురంగుల తులిప్ పువ్వులు కూడా నాటబడ్డాయి.

ఇక‌, ఈ తులిప్ పువ్వుల అందాల‌ను మీ మీ కెమెరాలో బంధించడానికి శాంతిపత్, చాణక్యపురిని చేరుకోవాల్సి ఉంఉటంది. ఈ ఫెస్టివ‌ల్‌కు వెళ్లేవారికి ప్రవేశం పూర్తిగా ఉచితం. ఈ ఫెస్టివల్‌లో నిర్వహించబడుతున్న ఫోటోగ్రఫీ పోటీలో పాల్గొనాలని ఆలోచిస్తున్నట్లయితే, దానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని NDMC వెబ్‌సైట్ https://www.ndmc.gov.in/pdf/tulip_festival_2024.pdf లింక్‌లో చూడగల‌రు.

More News

    Read more about: tulip flower festival 2024
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+