Search
  • Follow NativePlanet
Share
» » ప్రపంచంలోనే అత్యంత ఎతైన ఈ దేవాలయం దర్శనం చేసుకోవాలంటే రానున్న వేసవి వరకూ ఆగాల్సిందే.

ప్రపంచంలోనే అత్యంత ఎతైన ఈ దేవాలయం దర్శనం చేసుకోవాలంటే రానున్న వేసవి వరకూ ఆగాల్సిందే.

తుంగానాథ్ పుణ్యక్షేత్రం గురించి

పంచకేదార్ దేవాలయాల్లో ఒకటైన ఈ దేవాలయం ప్రపంచంలోనే అత్యంత ఎతైన శివదేవాలయం. ఈ దేవాలయాన్ని వేసవి కాలంలోమాత్రమే చూడగలం. దైవ దర్శనం వల్ల చాలా కాలంగా జరగక ఆగినపనులన్నీ జరుగుతాయని ప్రజలు నమ్ముతారు.

అందువల్లే అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులను కూడా లెక్కచేయకుండా ఆ దేవదేవుడి దర్శనానికి వెలుతుంటారు. ఈ క్రమంలో క్రూరమృగాలుఎదురైనా లెక్కచేయరు. ఇక చలికాలంలో ఆ దేవాలయంలోని గర్భగుడి మొత్తం మంచుతో మూసుకుపోతుంది.

అందువల్లే ఆ దేవదేవుడి ఉత్సవ విగ్రహాన్ని దగ్గర్లోని మఠానికి తరలించి అక్కడ నిత్య పూజలుచేస్తారు. తిరిగి వేసవి రాగానే ఆ ఆలయ గర్భగుడి ద్వారాలు తెరుచుకొంటాయి. పురాణ ప్రాధాన్యత కలిగిన ఈ దేవాలయం కేదర్నాథ్ దేవాలయం కంటే అత్యంత ఎత్తులో ఉండటం గమనార్హం. ఈదేవాలయంలోని ఆ పరమశివుడి దర్శనానికి ఒంటరిగా కంటే బృందాలుగా వెల్లడమేమేలు. ఈ నేపథ్యంలో ఆ ఆలయానికి సంబంధించిన వివరాలన్నీ మీ కోసం.

తుంగానాథ్ దేవాలయం

తుంగానాథ్ దేవాలయం

P.C: You Tube

ప్రపంచంలో అత్యంత ఎతైన ప్రదేశంలో ఉన్న దేవాలయం తుంగనాథ దేవాలయం. ఇది మన భారత దేశంలోనే ఉంది. ఈ దేవాలయాన్ని చేరుకోవడానికి కేవలం వేసవి కాలంలో మాత్రమే వీలవుతుంది. ఆ సమయంలో పరిసర ప్రాంతాలు హరనామ స్మరణతోమారుమోగుతాయి.

ఉత్తరాఖండ్

ఉత్తరాఖండ్

P.C: You Tube
దేవతలు నివశించే హిమాలయ రాష్ట్రంగా పేరుగాంచిన ఉత్తరాఖండ్ లోని తుంగనాథ దేవాలయం రుద్రప్రయాగ నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడకు కాలినడకన మాత్రమే చేరుకోగం. డోలీలు అందుబాటులో ఉంటాయి. వాతావరణ పరిస్థితులను అనుసరించి ఛార్జీల్లో కొంత మార్పులు ఉంటాయి.

ఢిల్లీ నుంచి

ఢిల్లీ నుంచి

P.C: You Tube

ఇక దేశ రాజధాని ఢిల్లీ నుంచి తుంగనాథ దేవాలయం చేరాలంటే సుమారు 304 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అత్యంత కఠిన ప్రయాణ మార్గం. అందుకే ముసలివారు ఇక్కడికి వెళ్లడానికిసాధారణంగా అనుమతించరు.

1273 అడుగుల ఎత్తులో

1273 అడుగుల ఎత్తులో

P.C: You Tube

ఈ అద్భుత దేవాలయం సముద్రమట్టం నుంచి 1273 అడుగుల ఎత్తులో ఉంటుంది. మందాకిని, అలకనంద నదుల మధ్యన కొలువైన ఈ దేవాలయం భారత దేశంలో అత్యంత ప్రాచీన దేవాలయాల్లో ఒకటి. అత్యంత పురాతన శిల్పాలను కూడా ఈ ఆలయ గోడల పై చూడవచ్చు.

పంచకేదార మందిరాల్లో ఒకటిగా

పంచకేదార మందిరాల్లో ఒకటిగా

P.C: You Tube

తుంగనాథ దేవాలయాన్ని పంచకేదార మందిరాల్లో ఒకటిగా చెబుతారు. ద్వాపర యుగానికి ఈ దేవాలయానికి అవినాభావ సంబంధం ఉంది. కేదర్నాథ్ దేవాలయం నిర్మించిన సమయంలోనే ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చెబుతారు.

 బ్రహ్మహత్యా దోషం

బ్రహ్మహత్యా దోషం

P.C: You Tube

కురుక్షేత్ర యుద్ధంలో పంచపాండవులకు బ్రహ్మహత్యా దోషం పట్టుకొంటుంది. దోషం నుంచి విముక్తి కోసం ఆ పరమశివుడి అనుగ్రహం పొందడానికి చాలా చోట్ల తిరుగుతారు. ఈ సమయంలో చాలా అవాంతరాలు ఎదురైనా వారు లెక్కచేయరు.

గుహాక్షి అన్న చోట

గుహాక్షి అన్న చోట

P.C: You Tube

అయితే వారికి ఆ పరమశివుడి దర్శనం కనిపించదు. చివరికి నారదుడి ద్వారా హిమాలయాల్లో గుహాక్షి అన్న చోట ఉన్నాడని తెలుసుకుంటారు. అక్కడికి ప్రయాణమైన పంచపాండవులు మార్గమధ్యలో చాలా చోట్ల శివుడికి దేవాలయాలు కట్టించారని పురాణాలు చెబుతాయి.

హిమాలయాలకు వెలుతారు

హిమాలయాలకు వెలుతారు

P.C: You Tube

ఆ పరమశివుడిని దర్శించుకోవడం కోసం పాండవులు హిమాలయాలకు వెలుతారు. అయితే పరమశివుడు మాత్రం కురుక్షేత్రంలో తమ సొంత సోదరులను చంపారన్న కోపం ఉంటుంది. అందుకే సులభంగా వారికి దర్శన భాగ్యం కల్పించకూడదని నిర్ణయించుకొంటాడు.

నంది రూపంలో

నంది రూపంలో

P.C: You Tube


దీంతో ఆ పరమశివుడు పాండవులకు దొరక్కుండా ఆ పరమశివుడు నంది రూపంలో తిరుగుతూ ఉంటాడు. అయినా కూడా పాండవులు పట్టు విడవరు. పరమేశ్వరుడిని దర్శించే వెనుతిరగాలనుకొంటారు. ఈ క్రమంలో అనేక కష్టనష్టాలను, పరీక్షలను పంచపాండవులు సహనంతో ఎదుర్కొంటారు.

భీమసేనుడు

భీమసేనుడు

P.C: You Tube

ఈ విధంగా నంది రూపంలో తిరుగుతున్న పరమశివుడు ఒకసారి అనుకోకుండా భీముడికి ఎదురుపడుతాడు. అసాధరణ తేజస్సుతో ఉన్న ఆ నందిని భీముడు కొద్దిసేపు తదేకంగా చూస్తాడు. పరమశివుడు మాత్రం వారికి దర్శనం ఇవ్వకూడదనే అనుకొంటాడు.

శివుడి శరీర భాగాలు

శివుడి శరీర భాగాలు

P.C: You Tube

ఆయన పరమశివుడే అని భావించి ఆ నందిని గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు.అయితే పరమేశ్వరుడు భీముడికి చిక్కకుండా అద`ష్యమైపోయి ఐదు చోట్ల ఐదు రూపాల్లో నిలిచిపోతాడు. ఆ ఐదు చోట్ల శివుడి శరీర భాగాలు పడ్డాయని కూడా స్థానికులు చెబుతారు.

ఐదు శివాలయాలు

ఐదు శివాలయాలు

P.C: You Tube

ఈ విషయం తెలుసుకొన్న పాండవులు ఆ ఐదు చోట్ల ఐదు శివాలయాలు నిర్మించి శివుడిని ఆరాధిస్తారు. అవే వరుసగా కేదారినాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, మధ్య మహేశ్వర్, కల్పేశ్వర్. వీటిని పంచకేదారాలు అని అంటారు. ఇవి హిందువులకే కాకుండా నేపాల్ కు చెందిన వారికి కూడా పరమపవిత్రమైన పుణ్యక్షేత్రాలు.

ఘోరక్ నాథ్ తెగవారు

ఘోరక్ నాథ్ తెగవారు

P.C: You Tube

నేపాల్ లోని ఘోరక్ నాథ్ తెగవారు పంచకేదార యాత్రకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. భారతీయులు కూడా ఈ యాత్ర చేయడం అత్యంత పుణ్యఫలమని చెబుతారు. అందుకే వేసవి కాలంలో నేపాల్ దేశంలో ఉన్న హిందువులు ఈ పంచ కేదార యాత్రకు బయలు దేరి వస్తారు.

తుంగనాధుడంటే శిఖరాలకు

తుంగనాధుడంటే శిఖరాలకు

P.C: You Tube

ఈ పంచ కేదారాల్లో రెండవదే తుంగనాథ్. శివుని చేతులు లింగ రూపంలో వెలిసిన క్షేత్రం తుంగనాథ్. కేదర్నాథ్ కంటే ఎతైన ప్రదేశం. తుంగనాధుడంటే శిఖరాలకు అధిపతి అని అర్థం.

ఎడమ వైపునకు వాలి

ఎడమ వైపునకు వాలి

P.C: You Tube

ఈ ఆలయంలో లింగం ఒక అడుగు ఎత్తున చేతులను పోలి ఉంటుంది. స్వల్పంగా ఎడమ వైపునకు వాలి ఉంటుంది. గర్భగుడిలో శివుడితోపాటు వ్యాస గణపతి అష్టధాతు విగ్రహాలు ఉంటాయి. ఇక దేవాలయం గోడల పై పండవులు గీచినట్లు చెప్పబడే అనేక చిత్రాలను చూడవచ్చు.

పంచకేదార ఆలయాల నమూనాలు

పంచకేదార ఆలయాల నమూనాలు

P.C: You Tube

ప్రమద గణాల విగ్రహాలను మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఆలయానికి కుడివైపున పార్వతీ దేవి ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి వెనుకవైపున ఐదు ఆలయాలు ఉంటాయి. వీటిని పంచకేదార ఆలయాల నమూనాలు అని పిలుస్తారు.

శీతాకాలంలో ఆలయాన్ని మూసివేస్తారు.

శీతాకాలంలో ఆలయాన్ని మూసివేస్తారు.

P.C: You Tube

వీటిని పంచ కేదారాల నమూనా ఆలయాలు అంటారు. ఇక తుంగనాథ ఆలయాన్ని అర్జునుడు స్వయంగా నిర్మించాడని ప్రతీతి. ఇక్కడ శీతాకాలంలో ఆలయాన్ని మూసివేస్తారు. గర్భగుడితో పాటు ఆలయ శిఖరం మంచుతో కప్పబడి ఉండటమే ఇందుకు కారణం.

ముకునాథ్ మఠానికి

ముకునాథ్ మఠానికి

P.C: You Tube

ఉత్సవ విగ్రహాలను సమీపంలోని ముకునాథ్ మఠానికి తరలించి పూజిస్తారు. అందుకే ఈ దేవాలయాన్ని ప్రతి ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో మాత్రమే సందర్శించడానికి వీలవుతుంది. ఈ సమయంలోనే భక్తులు ఈ తీర్థయాత్ర చేస్తారు.

చంద్రశిల పర్వతం

చంద్రశిల పర్వతం

P.C: You Tube
ఈ తుంగనాథ దేవాలయానికి దగ్గరగా మందాకినీ నది, అలకనంది నదులు ప్రవహిస్తూ ఉంటాయి. అంతేకాకుండా చంద్రశిల పర్వతం కూడా ఉంది. వేసవి కాలంలో ఈ తుంగనాథ్ పరిసర ప్రాంతాలు ప్రక`తి అందాలతో మెరిసిపోతూ ఉంటాయి.

డెహ్రడూన్ దగ్గరగా

డెహ్రడూన్ దగ్గరగా

P.C: You Tube

ఈ పవిత్ర క్షేత్రానికి దగ్గర్లో ఉత్తరాఖండ్ లోని డెహ్రడూన్ దగ్గరగా ఉన్న జాలీ గ్రాండ్ విమానాశ్రయం ఉంది. ఢిల్లీ నుంచి ఇక్కడికి విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక తుంగనాథ్ కు దగ్గరగా హరిద్వార్ రైల్వేస్టేషన్ ఉంది. వీటి మధ్య దూరం 225 కిలోమీటర్లు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+