భాగ్యనగరవాసులు సేదదీరేందుకు అర్బన్ ఫారెస్ట్ పార్కులు వచ్చేస్తున్నాయ్
భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ పరిధిలో రెండు అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లు త్వరలో హల్‌చల్ చేయబోతున్నాయి. ఇప్పటికే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) వీటిని అభివృద్ధి చేస్తోందట. త్వరలోనే ఈ పార్క్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఈ అర్బన్ ఫారెస్ట్ పార్కులు పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చితే నగరవాసులకు ప్రకృతితి మమేకమ్యే గొప్ప ఛాన్స్ వచ్చినట్లే. మానసిక ప్రశాంతత కోసం సుదూర ప్రాంతాలకు విహారానికి వెళ్లే బాధనుంచి విముక్తి దొరుకుతుంది. మరెందుకు ఆలస్యం ఈ అర్బన్ ఫారెస్ట్‌ల విశేషాలపై ఓ లుక్కేయండి మరి!
నిత్యం ఈ కాంక్రీట్ నగరంలో గజిబిజిగా గడిపే సగటు నరరవాసికి కాస్త ఆటవిడుపు కావాంటే ట్రిప్‌లు ప్లాన్ చేయటం పరిపాటిగా మారింది. మారుతున్న జీవన శైలికి అనుగుణంగా ఏదైనా అటవీ ప్రాంతాలకు వెళ్లేందుకు ఎక్కువమంది మక్కువ చూపుతారు. అలాంటి వారికి ఆ ప్రశాంతతను చేరువ చేసే ప్రయత్నం చేస్తోంది జీహెచ్‌ఎంసీ.

హాయిగా అడవుల మధ్య స్నానం చేసే సౌకర్యంతో పాటు ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవడానికి ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడిపేలా అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో ఏర్పాట్లు చేస్తోన్నారు. ప్రకృతిని రక్షించుకోవాల్సిన అవసరం గురించి అవగాహన కల్పించడం కూడా వీటి లక్ష్యమని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు.
అర్బన్ ఫారెస్ట్ పార్కుల పేరిట యాప్..
నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యేవారు ఈ పార్క్‌ల్లో కాస్త సేద దీరితేచాలు నూతన ఉల్లాసాని మూటగట్టుకుంటారు. అలా ప్రశాంత వాతావరణంలో గడిపే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయంటున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు. రాజేంద్రనగర్‌లోని మాదన్నగూడ ఫారెస్ట్ పార్క్, ఆదిభట్ల సమీపంలోని నాదర్‌గుల్ అర్బన్ ఫారెస్ట్ పార్కులను త్వరలోనే అన్ని హంగులతో అందుబాటులోకి తీసుకురానున్నారు.

నగరవాసులకు తెలిసిన ప్రాంతాలే కావడంతో దూర ప్రయాణాలకు ఇక స్వస్తి చెప్పక తప్పదు. అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లను సందర్శించుకునేవారి కోసం 'అర్బన్ ఫారెస్ట్ పార్కుల' పేరిట ఓ యాప్‌ను అధికారులు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ యాప్ సహాయంతో సందర్శకులు తమ టూర్‌ను ప్లాన్ చేసుకోవచ్చు. పార్కుల లొకేషన్ వివరాలు కూడా యాప్‌లో ఉంటాయి.
అన్ని సదుపాయాలతో రూట్ మ్యాప్..
అంతేకాదు, ఈ పార్క్‌లలో ఎలాంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయో కూడా చెబుతున్నారు. ఎటు చూసినా పచ్చదనం కమ్మేసిన అడవిలో సరదాగా కుటంబసమేతంగా విహరించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఈ పార్క్‌లలో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లతో పాటు యోగా షెడ్‌లు, పిల్లల కోసం ప్లే గ్రౌండ్, కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేస్తున్నారట. మాదన్నగూడ పార్కు 270 ఎకరాల్లో విస్తరించి ఉండగా.. 34 ఎకరాలను సందర్శకుల జోన్‌గా గుర్తించారు.

ఈ పార్కుల్లో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ 3.80 కిలోమీటర్లు ఉంటుంది. ఇక నాదర్‌గూడ ఫారెస్ట్ పార్క్ 105 ఎకరాల్లో విస్తరించి ఉండగా.. మొత్తం సందర్శకులకు అందుబాటులోకి ఉంటుంది. 3.80 కిలోమీటర్ల వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. అధునిక భత్రద నడుమ నగరంలో త్వరలోనే ఈ అర్బన్ ఫారెస్ట్‌లు అందుబాటులో రానున్నాయి. అడవిలో అంత స్వేచ్ఛగా విహరించే అవకాశం మనకు దగ్గరలోనే ఉందంటే ఎవరు మిస్ చేసుకుంటారు చెప్పిండి. కుటుంబసమేతంగా విహరించేందుకు మీరూ సిద్ధమవ్వండి.



Click it and Unblock the Notifications













